సబ్ ఫీచర్

పెరుగుతున్న విశ్వకుటుంబ భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతులు, మతాలు, వర్గాలు వంటి విభేదాలతో ముక్కలు చెక్కలుగా ఉన్న ప్రపంచం ‘విశ్వకుటుంబ భావన’వైపుకు మరలడం సాధ్యం కాదని వర్తమాన పరిస్థితులపై అవగాహన ఉన్నవారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలూ, అనుబంధ కాలేజీలూ, హైస్కూళ్లూ, స్వలాభ ఆపేక్ష లేని వివిధ విద్యాసంస్థలూ, సేవాసంస్థలూ నిర్వహిస్తున్న ‘మోడల్ యుఎన్’లు అనగా ‘ఐక్యరాజ్యసమితి నమూనాలు’ విద్యార్థుల్లో ‘విశ్వకుటుంబ భావనను’ పెంపొందింప జేయడానికి యత్నిస్తుండం ఆశావహ పరిణామం.
గత వందేళ్లుగా ప్రపంచంలో ఎవరికి వారంగా ఉంటున్న మనలోని సంకుచిత భావం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి ముఖ్యకారకులు- భారతదేశంలో 1901లో ‘శాంతినికేతన్’తోపాటుగా ‘విశ్వకుటుంబ ఉద్యమాన్ని’ ప్రారంభించిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, విదేశాలలో బెల్ట్‌రాండ్ రస్సెల్, అబ్రహం లింకన్ ప్రభృతులు వారి నిరంతర ప్రవచనాలూ, ఉద్యమాల కారణంగానే రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం- విశ్వవ్యాప్త ప్రజానాయకులలో ఒక ‘చలనం’ కలిగింది. ‘అన్ని దేశాలూ ఒక సంఘం’గా- ‘ఐక్యరాజ్యసమితి’గా- ఏర్పడి తమమధ్య ఏర్పడే సమస్యలనూ, వైరుధ్యాలనూ సమన్వయ సహకార బుద్ధితో పరిష్కరించుకోవాలి- అని. ఇప్పుడు ఈ ‘ఐక్యరాజ్యసమితి’ మాదిరిగానే వివిధ ప్రజాసంఘాలు అన్నీ కూడా తమ మధ్యగల వైరుధ్యాలను తొలగించుకొని- అందరూ ఆనందంతో జీవనం సాగించగలిగేట్లు ప్రజల మనస్సులలో మార్పులు తెస్తున్నాయి. హైస్కూలు స్థాయినుండి కూడా వివిధ విద్యాసంస్థలలో ఈ ‘ఎమ్‌యూఎన్’ అనగా ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’లేక ‘ఐక్యరాజ్యసమితి నమూనాలు’ నిర్వహించబడుతూ ప్రజలకు ఎదురయ్యే వివిధ జాతీయస్థాయి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నేర్పుతున్నాయి. ఈ ‘ఎమ్‌యూఎన్’లు లేక ‘ఐక్యరాజ్యసమితి నమూనాలు’ వివిధ స్కూళ్లలో, కాలేజీలలో ఎట్లా నిర్వహిస్తారో తెలుసా?
‘ఐక్యరాజ్యసమితి నమూనా’లో వివిధ స్కూళ్లు లేక కాలేజీలనుండి వచ్చిన విద్యార్థులు ప్రపంచంలోని ఒక్కొక్క దేశ ప్రతినిధిగా తమ పాత్రను నిర్వహిస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తారు. ‘ఐక్యరాజ్యసమితి’లో లాగానే వివిధ పదవులలో వారు నియోగింపబడి, ‘సమితి’ నియమాల ప్రకారం చర్చల్లో పాల్గొని తగురీతిలో అవసరమైన తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది. వివిధ స్కూళ్లనుండి, కాలేజీలనుండి ఈ ‘ఐక్యరాజ్యసమితి నమూనా’లో పాల్గొనే విద్యార్థులు తాము ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించాలో ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ నిర్ణయిస్తారు. అప్పుడు విద్యార్థులు తమకు కేటాయంచిన దేశపు చరిత్రను, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఆ దేశపు వైదేశిక విధానాన్ని కూడా బాగా అధ్యయనంచేసి, అర్థంచేసుకొని, దానిని ఇతరులకు విడమర్చి చెప్పగల సమర్థతనూ, నేర్పునూ సాధించుకోవాల్సి ఉంటుంది.
ఇతర దేశాల ప్రతినిధులుగా ఈ ‘ఐక్యరాజ్యసమితి’ నమూనాలో పాల్గొనే విద్యార్థులు వేసే అనేక చిక్కు ప్రశ్నలకు ధైర్యంతో ఆ దేశపు సభ్యుడిలాగ అంకితభావంతో సమాధానం చెప్పి, అందరినీ ఒప్పించి, మెప్పించి, తీర్మానాన్ని ఆమోదింపచేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోని వివిధ విద్యాసంస్థలలో ఇలా ‘ఐక్యరాజ్యసమితి నమూనాలు’ నిర్వహింపబడుతూ ప్రపంచ ప్రజలందరిమధ్య మంచి అవగాహన ఏర్పడేట్లు చేయడం జరుగుతున్నది. ఈ ‘ఐక్యరాజ్యసమితి నమూనాలు’ విద్యార్థులు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ప్రపంచ దేశాల చరిత్రలను గురించీ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను గురించి మంచి అవగాహన కలిగిస్తున్నాయ. అంతేకాదు కొత్తతరం విద్యార్థులు అందరిలోనూ ‘విశ్వకుటుంబ భావనను’పెంపొందిస్తూ ఉండడం విశ్వకల్యాణానికి దోహదంచేసే విషయం. ఇది ఎంతో ప్రయోజనకరమైన శుభపరిణామం కదా!

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి