క్రీడాభూమి

శాఫ్ కప్ ఫుట్‌బాల్ నుంచి వైదొలగిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 23: భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ మరోవైపు ఒత్తిడిని పెంచేందుకు తనకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. వాటిలో భాగంగానే వచ్చేనెల ఇక్కడ జరగనున్న దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. భారత్‌తో ఏ స్థాయి పోటీల్లోనూ పాల్గొనకుండా వెలివేస్తామని గతంలో హెచ్చరించిన పాక్ ఆ సూత్రాన్ని ఇతర క్రీడలకు వర్తింప చేస్తున్నది. భారత్, నేపాల్, శ్రీలంక జట్లతో కలిసి శాఫ్ క్రీడల్లో పాకిస్తాన్ గ్రూప్ ‘ఎ’లో ఉంది. గ్రూప్ ‘బి’లో మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాన్, డిఫెండింగ్ చాంపియన్ అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఇలావుంటే, భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మ ధ్య ఒకవేళ క్రికెట్ సిరీస్ ఖరారైతే, మిగతా క్రీడల్లో పట్టువిడుపులు ఉంటాయని పరిశీలకులు అంటు న్నారు. గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాన్ని అ మలు చేయాలన్న డిమాండ్‌తో ఒకవైపు భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న పాక్ మరోవైపు భారత్‌లో లే దా భారత్‌తో జరిగే అన్ని టోర్నీల నుంచి వైదొలగ డం ద్వారా సమస్య తీవ్రతను క్రీడా ప్రపంచం దృష్టి కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ క్రమం లోనే ఈ నిర్ణయం తీసుకుంది.