అంతర్జాతీయం

మోదీ పర్యటనపై పిటిషన్‌ను తోసిపుచ్చిన పాక్ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జనవరి 2: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు శనివారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను శీతాకాల సెలవుల్లో విచారించాల్సిన అత్యవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది. అజార్ సాదిక్ అనే న్యాయవాది శనివారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం తోసిపుచ్చిందని కోర్టు అధికారి ఒకరు పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ఎలాంటి ‘అధికారిక అనుమతి’ లేకుండా మోదీ, అతని బృందం పాకిస్తాన్‌లో పర్యటించిందని, మోదీ ప్రతినిధి బృందంలోని అనేకమంది వీసా లేకుండానే లాహోర్ విమానాశ్రయం ప్రాంగణంలో ఉన్నారని అజార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ శీతాకాల సెలవులు ముగిసిన తరువాత తాను మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని సాదిక్ చెప్పారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు మోదీ తన బృందంతో కలిసి గత సంవత్సరం డిసెంబర్ 25న లాహోర్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఇక్కడికి సమీపంలోని జటి ఉమ్రాలో గల షరీఫ్ రయివిండ్ నివాసానికి మోదీ వెళ్లారు. సుమారు రెండున్నర గంటల సేపు పాకిస్తాన్‌లో పర్యటించిన మోదీ.. షరీఫ్ మనవరాలి వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన షరీఫ్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.