క్రీడాభూమి

భారత్‌కు రానున్న పాక్ షూటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు భారత్ అంగీకరించకపోవడంతో అసంతృప్తితో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలనే రద్దు చేసుకుంటుందన్న అనుమానం వ్యక్తమైంది. అయితే, వచ్చేనెల 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఇక్కడి డాక్టర్ కర్నీ సింగ్ రేంజ్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షూటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు పాక్ షూటర్లు రానున్నారు. అక్టోబర్ మాసంలో ఇదే కేంద్రంలో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్ పోటీలకు పాకిస్తాన్ హాజరుకాలేదు. అయితే, ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు హాజరుకావాలని నిర్ణయించింది. మొత్తం 44 దేశాలకు చెందిన సుమారు 500 మంది షూటర్లు 35 ఒలింపిక్ కోటా స్థానాల కోసం పోటీపడతారు.