వరంగల్

కల్యాణం.. కమనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి సోమేశ్వరునికి పట్టువస్త్రాలు,
తలంబ్రాలు సమర్పించిన ఎర్రబెల్లి దంపతులు
పాలకుర్తి, మార్చి 7: పాలకుర్తిలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రమణీయంగా.. కన్నుల పండువగా శివపార్వతులు, లక్ష్మీనర్సింహస్వాముల కల్యాణమహోత్సవం సాగింది. ఈ ఉత్సవాన్ని తిలకించి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయంలో రాత్రి 8.30గంటలకు స్వామివార్ల కల్యాణ మహోత్సవం ఆగమ సాంప్రదాయానుసారంగా బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి నేతృత్వంలో వైదిక శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు మండపంపైకి తీసుకొచ్చారు. స్వామివార్లకు సాంప్రదాయబద్దంగా జీలకర్ర, బెల్లం, మంగళధారణ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు పోసే కార్యక్రమం భక్తులను మైమరమింపచేసింది. ఒకే కల్యాణ మండపంపై శివుడు, విష్ణువు సతీసమేతంగా కల్యాణం జరిపించుకోవడం ఇక్కడ విశేషం కావడంతో లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి తరలివచ్చి స్వామివార్ల ఆశీర్వాదం పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాలకుర్తి సిఐ బి. తిరుపతి, ఎస్సై నాగభూషణంతో పాటు కొడకండ్ల, దేవరుప్పుల ఎస్సైలు పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భూక్య దల్జీత్‌కౌర్, జడ్పీటిసి బనె్నపాక గణేష్, పాలకుర్తి సర్పంచ్ అంగడి అంజమ్మ, దేవస్థాన ఇవో సదానందంలతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.