తెలంగాణ

రెండు స్థానాలపైనా తెరాస గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పాలమూరు నేతల భేటీ

మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలపై తెరాస గురిపెట్టింది. ఈ నెల 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జిల్లాలో గల రెండు స్థానాలను గెలుచుకునేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా గురువారం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిల సమావేశాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, మాజీ ఎంపి మందజగన్నాథం, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఇన్‌చార్జి మంద శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో పాటు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణరావు, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు పోటీ చేస్తారని, అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన వారి గెలుపుకోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాలో మన బలం సగానికిపైగా ఉందని రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి తీరుతామని అందులో ఢోకా లేదన్నారు. కాంగ్రెస్, తెదేపా, బిజెపి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ భయపడేది లేదని, ఆ పార్టీల నుండి మరో 120 మందికిపైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మనతో టచ్‌లో ఉన్నారని ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వారిది కేవలం మేకపోతు గాంభీర్యమేనని కాంగ్రెస్, తెదేపా అభ్యర్థులు ఉన్నప్పటికీ జిల్లాలోని రెండు స్థానాలను తెరాస అభ్యర్థులే గెలిచి తీరుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ తెరాస ప్రజాప్రతినిధులకు గురువారం శంషాబాద్ సమీపంలో గల ఓ ఫంక్షన్‌హాల్‌లో ఓటింగ్‌పై కూడా బ్రహ్మం అనే మాజీ ఎన్నికల నిర్వహణ అధికారితో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒకరోజు నిర్వహించారు. ఓటింగ్‌లో ఏ విధంగా ఓట్లు వేయాలని ఎంపిటిసి, జడ్పీటిసి, కౌన్సిలర్లకు అర్థం అయ్యే విధంగా శిక్షణ ఇచ్చారు. మరిన్ని ఎత్తుగడలతో మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొంతమంది టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లతో కొందరు తెరాస నాయకులు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెరాస వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.