రాష్ట్రీయం

పులకించిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని పల్లకి సేవ
శ్రీకాళహస్తి, మార్చి 13: ముచ్చటగా మూడు పల్లకీలపై జరిగిన ఉత్సవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల నడుమ జరిగిన పల్లకీసేవ ఉత్సవం ఆదివారం రాత్రి శ్రీకాళహస్తిలో వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఒక పల్లకిపై, జ్ఞానప్రసూనాంబ మరో పల్లకిపై ఊరేగారు. ఆదివారం ఆడికృత్తిక కావడంతో శ్రీ వళ్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి మరో పల్లకిపై ఊరేగడం విశేషం. మూడు పల్లకీల్లో ఊరేగిన ఉత్సవమూర్తులను చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
అయితే తనతో కల్యాణం అయినా కూడా శివుడు గంగాదేవితో ఉండడాన్ని సహించలేని పార్వతీదేవి పల్లకీలో కోపంతో ముందుగా వెళ్లిపోవడం జరిగింది. ఆగ్రహంతో ఉన్న అమ్మవారిని భక్తులు నేరుగా చూడకుండా అర్చకులు నిలువుటద్దాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి అలంకరణను భక్తులు అద్దంలో చూసి మురిసిపోయారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పల్లకీసేవ చివరి ఊరేగింపు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్పూర హారతులిచ్చారు. ఈ ఉత్సవంలో దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇఓ బ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.