బిజినెస్

ఆధార్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం: పనగరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం ఓ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ అరవింద్ పనగరియా. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా ప్రభుత్వ రాయితీలను, ప్రయోజనాలను పొందడానికి ప్రజలకు ఇకపై ఆధార్ ఓ ప్రవేశద్వారంగా ఉంటుందన్న విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. శనివారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), భారత్ సంయుక్తంగా నిర్వహించిన అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడారు. శుక్రవారం లోక్‌సభలో ఆధార్ బిల్లు పాసయినది తెలిసిందే. కాగా, త్వరలోనే ఆధార్ ద్వారా ఎరువుల సబ్సిడీ అమల్లోకి రానుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఎరువులు, ఆహార సబ్సిడీలను ఆధార్‌పై లబ్ధిదారులకు అందించే యోచన ఉందని, అయితే లబ్ధిదారులకు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.