బిజినెస్

దిగుమతులపైనే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది కూడా తప్పని పప్పు ధాన్యాల కొరత
కంది, మినుము పంటలను దెబ్బతీసిన అకాల వర్షాలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యాపార వర్గాలు

రాజమండ్రి, డిసెంబర్ 7: వర్షాభావం కారణంగా పప్పు ధాన్యాల దిగుబడి తగ్గి ప్రస్తుతం ఏర్పడిన కొరత.. వచ్చే ఏడాది కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరుకు కంది, మినుము కొత్త పంటలు మార్కెట్‌కు వస్తాయి కాబట్టి డిసెంబర్ నెలాఖరు నుండి కందిపప్పు, మినపప్పు ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్న వ్యాపారులు.. ఊహించని విధంగా విరుచుకుపడ్డ అకాల వర్షాల వల్ల చేతివరకు వచ్చిన మినుము, కంది పంటలు దెబ్బతినడంతో వచ్చే ఏడాది కూడా పప్పు ధాన్యాల కొరత తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా పంట దెబ్బతినటంతో ఇక పూర్తిగా విదేశాల నుండి దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో కొరత కారణంగా కేజి రూ. 150 నుండి రూ. 200 వరకు పెరిగిన కందిపప్పు, మినపప్పు ధర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తాత్కాలిక చర్యల కారణంగా కాస్తంత దిగివచ్చిన సంగతి విదితమే. ప్రస్తుతం తక్కువ రకం కందిపప్పు ధర, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కిలో రూ. 123గా ఉంది. గత ఏడాది మొదటి రకం కందిపప్పు ధరనే రూ. 70 నుండి రూ. 80 పలకడం గమనార్హం. అకాల వర్షాల వల్ల పప్పు ధాన్యాల పంటలు దెబ్బతినటంతో వచ్చే ఏడాది కిలో రూ. 130 పైనే ఉంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కాకపోతే ఈ ధర ఇంకా పెరగవచ్చని, అందువల్ల ఇప్పటి నుండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై దిగుమతులపై దృష్టి పెట్టాలని హోల్‌సేల్ వ్యాపారులు కోరుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయలో పెరిగిన పప్పు ధాన్యాల ధరలతో దేశీయంగా నెలకొన్న డిమాండ్‌ను అందుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం సైతం విదేశాల నుంచి భారీగా పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు దేశీయంగా అక్రమ నిల్వలపైనా దాడులు నిర్వహిస్తుండగా, వేలాది టన్నుల పప్పు ధాన్యాలు బయటపడుతున్నది తెలిసిందే.