అంతర్జాతీయం

ఎట్టకేలకు తుది ముసాయిదా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫలించిన పారిస్ పర్యావరణ సదస్సు ప్రయత్నాలు

లీ బౌర్గెట్, డిసెంబర్ 12: భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గించడంతో పాటుగా 2020నుంచి ప్రతి ఏటా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వంద బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన ఒప్పందానికి సంబందించిన తుది ముసాయిదాను ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు శనివారం ఎట్టకేలకు ఖరారు చేసింది. 2 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ, చివరికి 1.5 డిగ్రీల లక్ష్యాన్ని సైతం చైనా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంగీకరించకపోవచ్చనే అనుమానాలు ఇంతకు ముందు ఉండేవి. సమావేశానికి సాజరయిన 195 దేశాల ప్రతినిధుల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ ఈ ముసాయిదాను సదస్సులో ప్రతిపాదించగా, ఈ ఒప్పదానికి ఆమోదముద్ర వేయాల్సిందిదిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు. ముసాయిదాను పరిశీలించడానికి ప్రతినిధులకు మూడు గంటల విరామం ఉన్న నేపథ్యంలో హోలాండే భారత్‌ను ఈ ఒప్పందానికి అంగీకరింప చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఫోన్ చేసి మాట్లాడారు. ఒప్పందం తాజా పరిస్థితిని హోలాండే ప్రధానితో చర్చించారని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. హోలాండే తనకు ఫోన్ చేయడాన్ని మోదీ ప్రశంసించినట్లు కూడా ఆయన చెప్పారు. దాదాపు 13 రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం న్యాయమైన, ఆచరణ యోగ్యమైన, చట్టబద్ధంగా కట్టుబడదగిన ఈ తుది ముసాయిదా తయారైందని ఫాబియస్ అన్నారు. కాగా, ఇప్పటివరకు పాశ్చాత్య దేశాలతో విభేదిస్తూ ఉండిన భారత్, చైనా, సౌదీ అరేబియా లాంటి దేవాలు సైతం ఈ తుది ముసాయిదా పట్ల హర్షం వ్యక్తం చేసాయి. ‘ఈ ఒప్పందంతో మేము సంతోషంగా ఉన్నాం. ఇది సమతూకంతో కూడుకుని ఉన్నదని, మా ప్రయోజనాలను వారు పరిగణనలోకి తీసుకున్నారని మేము భావిస్తున్నాం’ అని దాదాపు రెండు డజన్ల వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘లైక్‌మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్’ తరఫున మలేసియాప్రతినిధి గురుదయాళ్ సింగ్ నిజార్ చెప్పారు. కాగా తమకు కూడా ఎలాంటి అభ్యంతనాలు లేవని యూరోపియన్ కమిషన్ కూడా తెలియజేసింది. దాదాపు అందరూ ఈ తుది ముసాయిదా పట్ల సంతృప్తితో ఉన్నందున ఈ ఒప్పందానికి సదస్సు ఆమోదముద్ర వేస్తుందనే భావిస్తున్నారు.