వరంగల్

సామాజిక సేవ అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
పర్వతగిరి, మార్చి 7: ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో సామాజిక సేవ అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని కల్లెడ గుడి-మన గుడి ఆధ్వర్యంలో 1300 గజాల ఖాళీ స్థలంలో 14 మంది నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం భూపంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రాంమోహన్‌రావు ఎలాంటి రాజకీయ అపేక్ష లేకుండా ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. జీవితం అంటే సంపాదన మాత్రమే కాదు, సామాజిక సేవ చేయడం, త్యాగబుద్ధిని కలిగి ఉండడమేనని అన్నారు. కల్లెడ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో రాంమోహన్‌రావులాంటి వ్యక్తులు ముందుకు వస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో నీటి సమస్యలు రాకుండా ఉండడం కోసం కృష్ణ, గోదావరి జలాలను అందించడం కోసమే కెసిఆర్ మహరాష్ట్ర పర్యటన అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎంపి దయాకర్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కల్లెడ గ్రామంలో వైభవంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగలు, ముగ్గుల పోటీలు, ఎడ్లబండి పోటీలు వంటి దోహదం చేస్తాయన్నారు. వర్థన్నపేట ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ ఇక్కడ నిర్మించే గృహాలకు తన వంతు సహాయాన్ని అందిస్తానని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం తాను టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లోకి వచ్చినట్లు తెలిపారు. టిడిపి కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోని అభివృద్ధి కోసం తన వెంట రావాలని అన్నారు.