పర్యాటకం

పాండురంగని మెప్పించి కొలువుదీరిన నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణుచిత్తుని భాగ్యాన్ని విల్లివిరియచేసిన విల్లిపుత్తూరు తమిళనాడు మధురై జిల్లా రామనాధపురం తాలూకాలో ఉంది. ధనుర్మాసం ఎపుడు వస్తుందా అని, తన చెలులతో కలసి తాను కూడా ఆ కాత్యాయని వ్రతం చేసుకొందామని ఎదురుచూసిందా తల్లి ఆనాడు. ఆ మాసం రానేవచ్చింది. అసలు చిన్ననాటినుంచి రంగని కొలువున ఉన్న తండ్రి పొందే ఆనందాన్ని తాను చవిచూడాలనుకొంది. తానే తండ్రి తాను పెంచే తోటలోని పూలు , తులసి స్వయంగా కోసుకొని వచ్చి చక్కని గజమాలలు కట్టి వాటిని తానే ధరించి చూసుకొనేది. ఇక ఈ మాలలు రంగనికి అలంకరిస్తే ఎంత బాగుంటాయో నని తలచి మురిసేది. తన తండ్రిచేత వాటినికోవెలకు పంపించి తాను రంగని వైభవాన్ని వర్ణిస్తూ మానవ జీవితం ఏవిధంగా సార్థకం చేసుకోవచ్చో, ఏవిధంగా రంగని కొలుస్తే మళ్లీ మళ్లీ ఈ జననమరణ చక్రం నుంచి విడవడవచ్చో తన తోటి వారికి తెలిసేటట్టుగా చక్కని పాటలు రచించి మరీ పాడేది.
ఆ రంగడు సదా తన్ను మనసున నిలుపుకని తననే హృదయేశ్వరునిగా కొలిచే ఆండాళ్ ను తన హృదయేశ్వరిగా చేసుకోవాలని అనుకొన్నాడు. అట్లాంటిరోజుల్లోనే ఓకనాడు తనను అలంకరించ వచ్చిన అర్చకస్వాములకు తన హృదయపీఠంలో ఉన్న విష్ణుచిత్తుడు తెచ్చిన పూమాలల్లో వెంటుక్రను కనిపింపచేశాడు. అమాయకులైన అర్చకస్వాములు అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయింది అనుకొని తప్పు తప్పు అనుకొంటూ విషయాన్ని విష్ణుచిత్తునకు ఎరిగించారు. ఆయన అంత తప్పు బుద్ధిలేక చేశానని పదేపదే క్షమాపణలు చెప్పుకుంటూ ఇంటికివెళ్లి అన్యమనస్కుడై మరుసటి రోజు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశాడు. తెలతెలవారుతుండగా కాలకృత్యాలు తీర్చుకుని పూలు ఏరడానికి వెళ్లే సరికి అక్కడ అప్పటికే తాను అల్లారు ముద్దుగా పెంచే తన గోదా మాలలు అల్లి తాను ధరించి చూసుకొని తృప్తితో పూబుట్టలో పెట్టడం కంటబడింది. దాంతో ఇంత అపరాధం తన తనయ తెలియక చేసిందనుకొన్నాడు. అయినా ఆ తల్లి ని కోప్పడి తాను మరలా పూలను, తులసి ని సేకరించి తానేస్వయంగా అల్లి వడివడిగా రంగని కొలువుకూటానికి చేరాడు. తాను తెచ్చినమాలలను అలంకరించమని ఎంతో వినయంగా అర్చకస్వాములను ప్రార్థించాడు. వారు అలంకరించబోతే ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడైన రంగడు కోపావేశంతో ఎర్రని కనులతో హుంకరించాడు. హతాశులైన అర్చకులు విష్ణుచిత్తులు ఏం చేయాలో తోచక అల్లాడుతుంటే స్వామినే కరుణించి ‘‘ఓరుూ విష్ణుచిత్తా! మరేమీ లేదు. నాకు నీ కూతురు అల్లిన మాలలే కావాలి. ఆ చిన్నది ధరించి ఇచ్చిన మాలలనే నేను ప్రీతి పూర్వకంగా ధరిస్తాను ’’అని చెప్పాడు. అసలే తన చిన్నది చిన్నప్పటినుంచి రంగనే తన ప్రాణనాథునిగా భావించి తరిస్తోందని విషయం గుర్తుకువచ్చి స్వామికి అసలు విషయాన్ని నివేదించి తాను ఆ గోదా అల్లిన మాలలను తన గోదాదేవిని నీ దేవేరిగా చేసుకో తండ్రీ అని విష్ణుచిత్తుడు. ప్రార్థించాడు. భక్తులమొరను ఆలకించడానికే అవతారాలెత్తే ఆ మహావిష్ణువు అవతారుడైన శ్రీరంగస్వామిని విష్ణుచిత్తుని మనోరథాన్ని ఈడేరుస్తానని మాటిచ్చాడు. అందుకే గోదాదేవికి,శ్రీరంగని వైభవోపేతంగా వివాహం చేయించారు. వారిద్దరు కొలువైన ఈ మధురై జిల్లాలోని విల్లిపుత్తూరు గ్రామంలో మహిమాన్వితమైనదిగా పేరొందింది.
ఈ దేవాలయంలో ఏ కోరిక కోరినా తల్లి గోదాదేవి శ్రీరంగస్వామి క్షణాల్లో తీరుస్తారు. భక్తులందరూ తండోపతండాలు వచ్చి ఈ మార్గశిరమాసంలో తిరుప్పావైను అనుసంధానించుకుంటూ తమను కూడా పరమాత్మలో లీనం చేసుకోమని ప్రార్థిస్తుంటారు. శ్రీ ఆండాళ్ దేవాలయ గోపురమే తమిళనాడు ప్రభుత్వ రాజచిహ్నంగా పిలువ బడుతోంది. మధురైనుండి టెన్‌కాశి వెళ్లేమార్గంలో శ్రీవిల్లి పుత్తూరు ఉంది. 788వ సంవత్సరంలో నిర్మాణం జరిగిన ఈ ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ ఊరిలో కొలువుతీరిన స్వామి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే. ఈ స్వామిని వటపత్రశాయి అని కూడా పిలుస్తారు.
శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి ఆలయ ప్రాంగణంలో మూడు భాగాలు మనకు దర్శనమిస్తాయి. ఉత్తర భాగంలో పల్లికొండ పెరుమాళ్ (విష్ణువు), దక్షిణ భాగంలో ఆండాళ్ ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాల మధ్య తులసీ వనం ఉంది. శ్రీ విల్లిపుత్తూరులోని దేవాలయ గోపురం ఎత్తు 192 అడుగులు. 17వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.
ఈ ఆలయంలో పెరియాళ్వార్ విగ్రహం కూడా భక్తులకు కనులపండుగ చేస్తుంది. ఈయన నివసించిన ఇంటిని దేవాలయంగా మార్చారు. ఆండాళ్ అమ్మవారు ఉపయోగించిన బావి ఈనాటికీ ఉంది. ఆ బావిలోని నీరు ఎప్పటికీ తరగదు. ఈ బావి నీటిని ‘దర్పణ తీర్థం’గా భావిస్తారు. ఆనాడు ఆ తల్లి తన సౌందర్యాన్ని తానే చూసుకున్న ఈ నీటి ఇప్పటికీ భక్తులు అత్యంత పవిత్రంగా చూస్తారు. ఇక్కడి పూవులన్నీ గోదారంగనాథులకే అన్న భావంతో ప్రతి యాత్రీకుడూ రంగని భజన చేస్తూ గోదా భాగ్యాన్ని కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. రంగని మెప్పించి తన నాథునిగా చేసుకొన్న ఆ గోదాదేవినే భక్తులంతా గోదాదేవినే సూడికొడుత్త నాచ్చియార్‌గా పిలుస్తారు.

- సాయకృష్ణ