పర్యాటకం

కోరికలు ఈడేర్చే ముడుపుల స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుకొండల వాడా..వేంకటరమణ..అనగానే కలియుగదైవం మనని కనికరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మనస్సు నిర్మలంగా, హృదయం పవిత్రంగా, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే సదరు భక్తుడిని కాపాడేందుకు దివినుండి భువికి నారాయణుడే దిగివస్తాడు. అలా దిగివచ్చినవాడే ‘కాశీబుగ్గ’లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు. భాగ్యనగరం హైందవ దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. వైష్ణవ దేవాలయాలు, శైవదేవాలయాలు తదితర ఆలయాలు అనేకం ఉన్నాయి. వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు, ఇటీవలే ఆధునిక కళాకృతులతో నిర్మించిన దేవాలయాలు అనేకం భాగ్యనగరంలో ఉన్నాయి. వైష్ణవ ఆలయాల్లో ప్రధానంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు పదులసంఖ్యలో ప్రసిద్ధ్ది చెంది ఉన్నాయి. అలా ప్రసిద్ధి చెందిన ఆలయమే కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ స్వామి వారికే ‘ముడుపులస్వామి’ అన్న పేరుకూడా ఉంది. ఇక్కడ ఎవరైనా తమకోరిక తీరేందుకు ముడుపుకడితే వారి కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు. కోరిక తీరిన తర్వాత స్వామివారికి ముడుపు చెల్లించాల్సి ఉంటుంది. విద్య, వివాహం, అనారోగ్యానికి గురైనవారు, వివాహమై చాలాకాలమైనా సంతానం కానివారు సంతానంకోసం, ఎవరైనా తమ విలువైన వస్తువులను పోగొట్టుకుంటే తిరిగి పొందేందుకు, పాస్‌పోర్టు, వీసాలకోసం ఇలా ఒకటేమిటి..ఎలాంటి మంచికోరికలైనా కోరి ముడుపులు కడితే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అనేక మంది ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టి తమకోరిక నెరవేరగానే స్వామికి, అమ్మవార్లకు ముడుపులు చెల్లించి, దుస్తులు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించి తరిస్తున్నారు. భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకంటే బడంగ్‌పేట రెవెన్యూ గ్రామపరిధిలో వేంచేసిఉన్న కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభుగా వెలిశాడు. దీనికొక చరిత్ర ఉంది. దాదాపు ఐదువందల సంవత్సరాల పూర్వం విష్ణ్భుక్తులైన భార్యాభర్తలు తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కాలినడకన వెళుతున్నారట. వారుపయనిస్తూ దారిలో బడంగ్‌పేట సమీపంలో ఒక చెట్టుకింద సేదతీరేందుకు ఆగారట. సూర్యాస్తమయం కూడా కావడంతో వారు ఆ రాత్రి అక్కడే వంటచేసుకుని, భోజనం అయ్యాక చెట్టుకింద నిద్ర పోయారట. గాఢనిద్రలో ఉన్న వారికి శ్రీవేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, ‘‘మీరు ప్రస్తుతం నిద్రిస్తున్న స్థలం చెంతనే అలమేలుమంగ, పద్మావతీ సమేతంగా వెలసి ఉన్నాను. మీరు ఏడుకొండలవరకు రానవసరం లేదు. మీకు ఇక్కడే దర్శనం ఇస్తున్నాను, నన్ను వెలికి తీసి, పూజలు చేసి, నాకొక ఆలయం కట్టించండి’’ అని ఆదేశించాడట. ఆ భార్యాభర్తలు ఉదయం లేవగానే రాత్రి తమకు వచ్చిన కల గురించి చర్చించుకున్నారు. ఆ దారిలో వెళుతున్న కొందరితో సదరు దంపతులు తమకు వచ్చిన కలగురించి చెప్పి, స్వామివారిని వెతికేందుకు తమకు సాయం చేయమని కోరారట. దంపతులు సేదతీరిన ప్రాంతంలోని సమీపంలో వెదకగా, పుట్టలాంటి ఒక ప్రదేశం కనుగొన్నారు. అందరూ కలిసి దాన్ని తవ్విచూడగా, పద్మావతి, అలమేలుమంగ సహిత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయటపడ్డాయట. ఒక రాతికే తొలచినట్టున్న విగ్రహాలను కనుగొన్న దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. స్వామివారి ఆదేశాల మేరకు వారు తమ ఆస్తిలో కొంత ధనాన్ని ఖర్చు చేసి ఆలయాన్ని కట్టించారట.
గర్భగుడి ఎదుట ధ్వజస్తంభం, కుడివైపున ఆళ్వారులు, ఎడమవైపు ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాలున్నాయి. ఇక్కడి ప్రసన్నాంజనేయస్వామికి నియమానుసారం ప్రదక్షిణలు చేసిన వారికి శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. క్షేత్రపాలకుడిగా ఉన్న హనుమంతుడి విగ్రహం ముందునుండి గుహలా ఉన్న గర్భగుడిలోకి వెళ్లేందుకు చిన్నదారి ఉంది. ఈదారిలోంచి లోపలకు వెళ్లగానే చిన్న గుహలో అలమేలు, పద్మావతి సమేతంగా వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి కనిపిస్తారు. గర్భగుడిలో ఈశాన్యంలో వేంచేసి ఉన్న స్వామివారు నైరుతివైపు చూస్తున్నట్టు కనిపిస్తారు. ఈ తరహా విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. వేంకటేశ్వరస్వామి వామహస్తం వద్ద శివలింగం ఉంది. ఈ తరహాలో విగ్రహం బహూశా ఎక్కడా ఉండకపోవచ్చు. స్వామివారి ఎదుట గుహలోకి వెళ్లిన ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఐదుశతాబ్దాల నుండి ఉన్న ఈగుహను, స్వామివారిని యథాతథంగా కొనసాగిస్తున్నారు. నాటినుండి నేటి వరకు స్వామి వారికి పూజలు కొనసాగుతూనే ఉన్నాయి.

కాశీబుగ్గలో నేటినుంచి బ్రహ్మోత్సవాలు
కోనేటిరాయుడు భక్తుల కోరికలు నెరవేరుస్తూ, నిత్యపూజలు అందుకుంటున్నారు. మాసోత్సవాలు, వైశాఖమాసంలో వార్షికబ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు ఈఏడు 2017 మే 1 నుండి 6 వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల వెంకటాచార్యులు వారి ఇద్దరి కుమారులు అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరిలో ఒకరైన చక్రవర్తుల మదన్‌మోహన్ చార్యులు ప్రస్తుతం అర్చకులుగా పనిచేస్తున్నారు. మే 1 న వాసుదేవ పుణ్యహవాచనము, రక్షాబంధనం, అంకురార్పణ, 2 న వైనతేయ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, 3 న కల్యాణం, 4 న హనుమత్‌వాహన సేవ, 5 న రథోత్సవం, మే 6 న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, శేషవాహనం పుష్పయాగం, దేవతోద్వాసన ఉంటాయని మదన్ మోహన్ తెలిపారు.

- పి.వి. రమణారావు 98499 98093