పర్యాటకం

వీరాచల రామచంద్రస్వామి ఆలయం అచంచల భక్తికి నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞా నం, యోగం, సిద్ధి మానవ జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి కావలసిన సాధనాలు. జ్ఞానం పెరిగే కొలది మనిషి అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు. క్షణికానందాన్నిచ్చే కోర్కెలు తీరిన తర్వాత ఏదో వెలితి, ఇదంతా భ్రమ అని బోధపడుతుంది.
ఇవన్నీ సామాన్య మానవులకు ఎదురయ్యే విషయాలు. కొందరు మహాత్ములు పుట్టుకనుంచే జ్ఞానులుగా ఉంటారు. వారు ఇహలోక సంపదలపై ఆశపడరు. అలాంటివారందరూ ఉత్తమ పురుషులుగా జ్ఞాన ఖనులుగా మనకు తారసపడుతుంటారు. మరికొందరు పుట్టి కాస్త ఊహతెలిసినప్పటినుంచి విరాగులుగా మారుతుంటారు.
అట్లాంటి మనిషి వరంగల్లు జిల్లాలో జీడికల్ గ్రామంలోకొన్నాళ్ల క్రితం జన్మించాడట. అతని పేరు వీరుడు. అతనికి చిన్నప్పటి నుంచే భగవంతుని దర్శించుకోవాలన్న కోరిక ఉండేదట. అందుకే ఎవరు అవధూతల్లాగా, సన్యాసులలాగా దైవత్వం ఉన్నవారిలాగా కనిపించగానే వారి నల్లా భగవంతుని దర్శనం చేసుకొనే దెట్లా అని అడుగుతుండేవాడు.
ఎపుడూ దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి తనకు దర్శనం ఇవ్వమని తనతో మాట్లాడమని వేడుకుంటూ ఉండేవాడట.
ఒకసారి ఓ సన్యాసి ఆయనకు కనిపించి ‘ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ వదిలిపెట్టి ఒంటరిగా కూర్చుని తదేక ధ్యానంతో భగవంతుని ప్రార్థించు నీ కోరిక నెరవేరుతుంది.’ అని చెప్పాడట. అంతే వీరుడనువానికి ఎక్కడలేని సంతోషం వేసింది. వెంటనే తన తల్లిదండ్రులతో చెప్పేసి తాను అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఇపుడు శ్రీరామచంద్రుడు కొలువైన ప్రదేశానికి చేరుకొన్నాడట. అక్కడి ప్రకృతి, కొండగాలి, చల్లదనం చూసి ఇక్కడ నా భగవంతుడు కొలువై ఉంటే ఎంత బాగుంటుంది. నేను నిత్యమూ ఆయన్ను దర్శనం చేసుకొనేవాడిని కదా అనుకొన్నాడట.
వెంటనే తాను అక్కడే కూర్చుని తన ఇష్టదైవమైన రాముణ్ణి ఏకాగ్రతతో ఉపాసించాడట. శ్రీరామ నామంతో ఆ ప్రదేశమంతాదద్దరిల్లేట్టుగా మనసున శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ కూర్చుండిపోయాడట. అలా ఎన్నో సంవత్సరాలు తపస్సులో వీరుడు మునిగిపోయాడట.
కొనే్నళ్లకు వీరుడు చిక్కి శల్యమైపోయాడట. కాని తన ఏకాగ్రతను విడవకుండా రామ మంత్రాన్ని అనుసంధానిస్తూ ఉండిపోయాడట.
అపార కృపావత్సలుడైన శ్రీరాముడు తన భక్తుని వైపు చూపు సారించాడట. లౌకిక దృష్టిలేకుండా తనవైపే దృష్టిని నిలిపి తన దర్శనం కోసం ప్రాకులాడే వీరుడని చూచి శ్రీరాముడు కన్నీళ్లు కార్చాడట. వెంటనే వీరుని దగ్గరకు శ్రీరాముడు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడై వచ్చాడట. ‘ఓ వీరా! నీ తపస్సుకు మెచ్చాను. నీకోసం వచ్చాను. కనులు తెరువు’ అన్నాడట. ఆ మృదుమధుర వచనాలతో కనులు తెరిచిన వీరుడు కన్నీటి పర్యంతమై శ్రీరామ దర్శనం చేసుకొన్నాడట. ‘నాయనా వచ్చావా! నీ దర్శనం నాకు లభించింది. ఎన్నివేల సంవత్సరాల పుణ్యఫలం ఇది’ అని సీతారాములకు పదేపదే నమస్కరించాడట.
శ్రీరాముడు నీకోరిక ఏమిటి అని ప్రశ్నించగా ‘నీ దర్శనం లభించిన తర్వాత నాలో ఏ కోరికలు కలుగడం లేదు స్వామి. కాని నాలాంటి భక్తులను కరుణించడానికి నీవు ఈ కొండపై ఈ గుట్టపై కొలువై ఉండు అదే నా భాగ్యం’అని కోరాడట వీరుడు. వీరుని భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుడు నేను నీ కోరిక ప్రకారం ఇక్కడే కొలువై ఉంటాను. ఇక నుంచి ఈ కొండ వీరాచలమను పేరుతో ప్రఖ్యాతవౌతుంది. నీ కొండను దర్శించినవారంతా నిన్ను స్మరిస్తుంటారు. నీవు సదా నా దగ్గరే ఉంటావు ’అని వరం ఇచ్చాడట. ఆ పర్వతం పైనే చిన్న నీటి గుండము, ఒక గుహ ఉంది. ఆ గుహాలోని ఒక రాయి శ్రీరామచిహ్నాలతో అలరారడం చూచిన వీరుడు శ్రీరాముడే ఇక్కడ స్వయంభూగా వెలశాడని ఆనందంతో ఆ రాయినే శ్రీరామచంద్రునిగా భావించి పూజలు చేశాడట. కాల క్రమంలో రామవచనం ప్రకారం ఈ పర్వతమే శ్రీవీరాచలంగాప్రఖ్యాతి పొందింది. నేడు శిథిలావస్థలోని దేవాలయంలో వరంగల్లు జిల్లాలోని జీడికల్ ప్రాంతంలో ఉంది.
నేడు ఆ ప్రదేశంలోనే శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయుల విగ్రహాలను భక్తులు ప్రతిష్టించి సీతారాములను పూజిస్తున్నారు.
త్రేతాయుగంలో దశరథపుత్రుడైన శ్రీరాముడిని నేడు కలి యుగంలోను ధర్మస్వరూపంగా భావించి ఆబాల గోపాల మూ సేవిస్తున్నారు. శ్రీరాముని ధర్మాచరణలో మనమూ భాగస్తులం కావాలని కోరుకుం టున్నారు. ధర్మోరక్షితి రక్షతః అంటే ఇదే కదా. ధర్మాన్ని ఆచరిస్తే చాలు ధర్మమే కీర్తిప్రతిష్టల నుకొనితెస్తుంది. దీనికి తార్కాణమే శ్రీరాముని జీవితచరిత్ర. కనుక నేటి కలియుగ మానవులంతా ధర్మస్వరూపాన్ని తెలుసుకొని మరీ ఆచరించాల్సిన తరుణం ఇదే.

- చివుకుల రామ మోహన్