పర్యాటకం

అటు భక్తి, ఇటు శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ధ్యాత్మిక ప్రపంచంలో ప్రముఖ మైన వారు భక్తుడు భగవంతుడు. ఇద్దరూ దేనిలోను తీసిపోరు. ఎవరు ఎవరికీ తక్కవకాదు. ఎందు కంటే భక్తుడు భగవంతుని అధీనం.. భగవంతుడు భక్త్ధానం. చిత్త శుద్ధితో, నిజ మైన భక్తితో సంపూర్ణంగా భగ వంతుడికి శరణాగతి పొందితే భక్తుడే భగవంతుడు అవు తాడు. అంటే భక్తి పరమోన్నత మైన స్థాయికి చేరుకున్నప్పు డు భక్తుడే భగవంతుడవు తాడు.
సనాతన ధర్మం కూడా భక్తుడు చిత్తశుద్ధితో పూజించి నపుడు భగవంతుడు భక్తుని హృదయపీఠంపై ఆసీనుడై ఉంటాడని అంటుంది. దానికి తార్కాణంగానే హనుమంతుడు తన హృదయపీఠంపై తాను ఆరాధించే స్వామి సతీ సమేతం గా కొలువె ఉన్న ట్టు చూపినట్లు పురాణాలు చెబుతున్నాయ.
హనుమంతుఢు రామబంటు, రామ దూత, ఎక్కడ రామనామం జపిస్తుంటారో అక్కడ ఆ హనుమంతుడు ఆనంద చిత్తుడై ఆనందభాష్పాలు కనులనిండా నింపుకుని కూర్చుని ఉంటాడని ఐతిహ్యాలు ఉన్నాయ. తులసీదాసు రామచరితమానస్ ను చదువు తుంటే వెనుక వరుసలో ఆంజనేయుడు కూర్చుని ఉండే వాడట. ఆయన రాముడికి భక్తుడు.. కాని మనకు మాత్రం భగవంతుడే.
హరిహరాద్వైతవాది. శివుడి అంశలో జన్మించినవాడు. నారాయణావతారి రాముడికి భక్తుడైన వాడు. అందుకే అందరికీ ఆరాధ్య దైవంగా నిల్చున్నాడు హను మంతుడు. హైదరాబాదు నగర సమీపంలో ఉన్న యాద్రాదికి హనుమంతుడే క్షేత్రపాలకుడు. ఎన్నో క్షేత్రాలు ఆయన పాలనలో ఉన్నప్పటికీ యాద్రాదికి క్షేత్ర పాలకుడుగా ఉన్న హనుమంతుడు భక్తులం దరికీ స్వామి లక్ష్మీ నరసింహుని అను గ్రహానికి పాత్రులను చేయడానికి సాయం చేస్తుంటాడు.
భూతప్రేత పిశాచాదులను పారద్రోలడమే కాదు నిర్భయాన్ని కలిగించడంలోను, అభయ ప్రదాతగాను ఆంజనేయుడు భక్తుల మనస్సులో కొలువై ఉంటాడు. అందుకే రహదారుల వెంబడి కూడా ఆంజనేయుడు భారీవిగ్రహాలు కొలువు దీరిఉంటాయ. జై భజరంగభళీ అని వీరులు కూడా మునుముందుగా హనుమంతుడికే నమస్కరిస్తారు. ఏపని ఆరంభించాల న్నాకూడా శ్రీరాముని తోపాటుగా తలుచుకునే భగవంతుడు ఆంజ నేయుడు.
అటువంటి హనుమన్న యాదాద్రికి వెళ్లే దారిలో సురేంద్రపురిలోను కొలువై ఉన్నాడు. అసలు సురేంద్రపురి దేవతల ఆవాసంగా కనబడుతుంది. అక్కడ
యాదగిరి గుట్టకు చేరువలోనే పద్ధెనిమిది ఎకరాల స్థలంలో పంచ ముఖ ఆంజనేయుని ఆలయ సముదా యాన్ని అభివృద్ధి పరిచారు. ఇక్కడ ప్రధానమైన ఆకర్షణ పంచముఖ హను మంతుని గంభీరమైన విశ్వరూపం. అరవై అడుగుల ఎతె్తైన విశాలమైన మహా విగ్రహం అన్నది ఒక విశేషమైతే, సంయుక్త విగ్రహం కావడం మరో విశేషం. ఒక వైపు పంచముఖ హనుమ దీశ్వరులు ఉంటే, ఇదే విగ్రహానికి మరోవైపు పంచముఖ విరాట్ స్వరూ పుడైన పరమశివుడు మనకు కనిపి స్తారు.
సురేంద్రపురి ముఖద్వారందగ్గరే స్వర్గ్ధా పతి దేవేంద్రుడు ఐరావతంపై వజ్రాయుధ ధారియై వచ్చి ఉండగా, నాగలోక, గంధర్వ లోక వాసులు ఆయుధ ధారులైన నైరుతి వరుణులు, ముగ్గురు అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకల నాట్యం కలగలసిన అపూర్వమైన సన్నివేశంభక్తులను ఆకట్టుకొం టుంది. దేవీదేవతలందరూ కొలువైన ఈ సురేంద్రపురి ఆధునిక ప్రపంచాన్ని సైతం ఆధ్యాత్మిక సంపద వైపు ఆకర్షింప చేసే అద్భుత క్షేత్రంగా చెప్పవచ్చు.

-అలేఖ్య