పర్యాటకం

నేగంటి నేగంటి శివుని నేగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా వెళ్లాలి...
కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం వుంది. కర్నూలు వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులో యాగంటికి చేరుకోవచ్చు. అలాగే బనగానపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
గవంతుని ఉనికిని గూర్చి పదేపదే కొందరు సందేహపడుతుంటారు. భగవంతుని లేని వస్తువు లేనేలేదు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి ఏదీ లేదు అని అచంచలమైన నమ్మకస్తులు అంటారు. నిజమే! నమ్మితే చాలు భగవంతుడు తన్నుతాను దత్తం చేసుకొంటాడు. భక్తుని కోసం భగవంతుడు దిగి వస్తాడు. కింకరుడుగా కావాలని కోరినా తాను కింకరునిగా మారిపోతాడు. చిన్న పిల్లవానివైతే నిన్ను నేను లాలిస్తాను అంటే పసిబిడ్డగా మారిపోతాడు.
రూపం అనేదే లేనివాడు కనుక భక్తులు కోరిన రూపాల్లోకి తన్ను తాను సృజియించుకుంటూ ఉంటాడు. భక్తులకు నచ్చిన రూపాల్లో నామాల్లో విహరిస్తూ వారికి ఆనందం పంచుతుంటాడు. అందుకే భగవంతుడిని కృపాళువు అని కీర్తిస్తారు.
ఒకానొక కాలంలో కర్నూలు జిల్లాలో బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఓ శివభక్తుడు శివదర్శనం కోరి కఠోరమైన తపస్సు చేసుకొంటున్నాడట. పంచాక్షరిని జపిస్తూ కన్నులు మూసుకొని ఉన్నాడు. అతనికి పులి గాండ్రింపు వినవచ్చి కనులు తెరిచాడట. అతని ఎదురుగా పెద్దపులి నిలిచింది. పులిరూపంలో స్వామి వచ్చాడనుకొన్న ఆ భక్తుడు ‘నేగంటి నేగంటి శివుని నేగంటి’ అని శివుని చూశానన్న ఆనందంతో చిందులు వేశాడట. ఆ నేగంటి అన్న పదమే ఈ ప్రదేశానికి యాగంటిగా కాలక్రమంలో స్థిరపడిపోయింది. ఈ క్షేత్రంలో శివుడు ఆ భక్తుని కోసం ఉమామహేశ్వరుడై పూజలందుకుంటున్నాడు. అయితే 15వ శతాబ్దంలో విజయ నగర రాజు హరిహర బుక్కరాయలు ఈ ఉమామహేశ్వరాలయాన్ని ఆధునాతనంగా తీర్చిదిద్దాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ ఆలయానికి ముందు పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి దాటుకుని ముందుకి వెళితే ఆలయ రాజగోపురం తేజో విరాజమానమవుతుంది. మెట్లమీదుగా ఈ రాజగోపురాన్ని దాటితే ప్రధానాలయ ప్రాంగణంవస్తుంది. ఇక్కడ రాతి శాసనాలు, ఎదురుగా ధ్వజస్థంభము కనిపిస్తుంది. ఈ మండపంలో శివలింగమొకటి ఉంది. గర్భాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఈ ఆలయంలోని ఉమా మహేశ్వరుని అగస్త్యుడు ప్రతిష్టించారని చెబు తారు. పానవట్టంపై ఉన్న లింగం మీద శివపార్వతుల మూర్తులున్నాయి. అగస్త్యుడు శివుని మెప్పించి పార్వతీ పరమేశ్వరులను ఇక్కడ కొలువుతీరి భక్తులను కాపాడమని వేడు కున్నాడట. మొట్ట మొదట అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలు చూసి చాలాబాగున్నాయి. ఈ క్షేత్రం కలియుగవేంకటేశ్వరుని పూజించడానికి అనువుగా ఉన్నాయి. ఇక్కడ ఆస్వామిని ప్రతిష్టించాలనుకుని విగ్రహాన్ని మలుస్తూ ఉండగాచేతి బొటనవేలుకి గాయమైందట. తాను ఏదైనా తప్పుచేస్తున్నానేమోన్న భావానికి లోనైన అగస్త్యుడు వెంటనే వేంకటేశ్వరుని గూర్చి తపస్సులో మునిగిపోయాడట. కాని ఆయన ఏకాగ్రతను భంగం చేసేట్లుగా కాకుల రొద ఇక్కడ ఎక్కువగా ఉండేదట. అందుకే అగస్త్యుడు ఆ కాకులను ఈ యాగంటిక్షేత్రంలోకి రావద్దు అని అంక్ష పెట్టాడట. దాంతో ఇక్కడ ఏ కాకులు కనిపించవు. దీనికి గుర్తుగా వేంకటేశ్వరస్వామి గుహ ఇక్కడ ఉంది. దీనిని చేరుకోవడానికి సోపాన మార్గం ఉంది. ఈ గుహలో అగస్త్యమహర్షి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. యాగంటిలో తొలుత ప్రతిష్టించాలనుకున్న విగ్రహమిదే. ఈ విగ్రహంలోని ఒక భాగం ఇప్పటికీ భిన్నమైనట్లు కనిపిస్తుంది. దీని పక్కగా శంకర గుహ ఉంది. దీనిని రోకళ్ళ గుహ అని కూడా అంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ గుహలోనే తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని చెబుతారు. ఈ గుహలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం అచ్చెమ్మ విగ్రహాలు కనిపిస్తాయ.ఈ ఆలయ క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి. ఈ వీర భద్రుడు శివుని అంశే. ఈ వీరభద్రుని దర్శనం సర్వ పాపహరం కీర్తిస్తారు. ఆలయ వెనకవైపు భాగంలో కేదారేశ్వరస్వామి మందిరం ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడూ కొలువుదీరాడు.ఇక్కడి పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అంటారు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో వుండడమేఇక్కడి విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయవౌతాయని అంటారు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వరాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నది ఒక బసవేశ్వరుడు. ఈ బసవన్న విగ్రహం దినదినాభివృద్ధి చెందుతూ అటు హేతువాదులకు ఆశ్చర్యాన్ని ఇటు భక్తులకు పరమసంతోషాన్ని కలుగచేస్తోంది. స్వయంభువుగా వెలసిన ఈ బసవన్న విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతుంది. వీరబ్రహ్మేంద్రస్వామిగా రు ఈ బసవన్న గురించి కాల జ్ఞాన తత్వాల్లో విశేషాలు చెప్పారు. ఈ ఆలయానికి కుడివైపువున్న కొండమీద దాదాపు నూట యాభై అడుగుల ఎత్తున అనేక ప్రకృతి సిద్ధమైన గుహలు ఉన్నాయి

- ఎస్. నాగలక్ష్మి