జాతీయ వార్తలు

బిల్లులు ఆమోదం పొందేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్మథనంలో అధికార పక్షం * సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు మరో ఎనిమిది రోజుల్లో ముగియనున్నందున అత్యంత కీలకమైన మూడు బిల్లులకు చట్టరూపం సాధించటానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకరంగా తీసుకుంటున్న జిఎస్‌టి, స్థిరాస్థి, అవినీతి నిర్మూలన బిల్లులకు ఉభయ సభల ఆమోదం పొందటానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. అయితే గత వారంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు సభ నడుస్తుందా అన్న అనుమానాలకు దారితీస్తోంది. తనకున్న సంఖ్యాబలంతో లోక్‌సభలో ఆనుమతి పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం ఆ బిల్లులు పొందే అవకాశం లేదు.
దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహించే జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ అనుమతి పొందటానికి ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో అనేక అంశాలలో రాజీకి సిద్ధమైంది. కానీ నేషనల్ హెరాల్డ్ వివాదం రాజకీయ రంగు పులుముకుని ప్రధాని మోదీపై కాంగ్రెస్ వేలెత్తి చూపటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. జిఎస్‌టి బిల్లు ఆమోదానికి సహకరించవలసిందిగా కోరుతూ మరికొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం కాంగ్రెస్‌కు అందచేసింది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఆదివారం తమ పార్టీ సమావేశంలో చర్చించి సోమవారం సభ ప్రారంభమయ్యే సమయానికి తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులపై అధ్యయనం చేసి తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. జిఎస్‌టి బిల్లుపై చర్చకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సొమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తన పాకిస్తాన్ పర్యటనపై ఒక ప్రకటన చేస్తారు. ఇదే అతి ముఖ్యమైన అంశమని పార్లమైంటరీ వ్యవహారాల శాఖ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజకావాలని వెలువడిన తీర్పు రాజకీయ రంగు పులుముకోవటంతో సభ నడకపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
సాధ్యమైనంత వరకూ నేషనల్ హెరాల్డ్ వివాదంపై పెదవి విప్పవద్దని బిజెపి తనవారికి ఆదేశాలు జారీ చేసింది. కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామి తప్పించి ఎవ్వరూ ఈ వివాదంపై మాట్లాడటం లేదు. పార్లమెంట్‌ను స్వప్రయోజనాల పరిరక్షణకు వాడుకోవటం ప్రజాస్వామ్యానికే తీవ్రవిఘాతమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సభలో ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారే తప్పించి తన సహజ ధోరణిలో కాంగ్రెస్ నాయకత్వంపై దాడి చేయకపోవడం గమనార్హం.