పఠనీయం

‘బాలల వనం’ ఒక అక్షర వనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాలల వనం’
(గేయ సంకలనం)
-అక్షరమాలి సురేష్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
ఎంతోమంది పెద్దపెద్ద కవులు సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఎన్నో సంకలనాలు వేశారు. అందులో అమ్మపైన మాతృస్పర్శ, రైతులపై రైతు సకళనాలు, కార్మికులపై కార్మికుల సంకలనాలు ఇలా అన్నీ పేరుగాంచిన కవుల కవితలన్నీ ఒకేచోట పేర్చి సంకలనాలు చేశారు. అలాంటి కోవకు చెందిన సంకలనం విద్యార్థులతో అక్షరమాలి సురేష్‌గారు మారుమూల గ్రామమైన ఆంధ్ర నుంచి కర్ణాటక బోర్డర్ వలస గ్రామానికి ఉపాధ్యాయుడుగా నియమితులయ్యారు. అక్కడ అందరి మాతృభాష కన్నడ చదువు మాత్రమే తెలుగు. మొదట చాలా ఇబ్బందులతో విద్యార్థులను తన ఆటపాట కథలతో తన వైపు తిప్పుకున్నాడు. తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ సాహిత్యంపై అభిమానంతో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే విధంగా గోడ పత్రికకు ‘బాలల వనం’ అనే పేరు పెట్టి అందులో చిత్రాలు, పద్యాలు, చిన్నచిన్న కవితలు సేకరించి పెట్టేవారు. అప్పుడు తట్టిన ఆలోచనే విద్యార్థులతో ఒక సంకలనం తేవాలని వెంటనే ఆ సంవత్సరం విద్యార్థులకు కవిత్వం అంటే ఏమిటని ఎలా రాయాలని విద్యార్థులకు అభిరుచి కలిగించి దాదాపు 46 మంది విద్యార్థులతో ఒక సంకలనం వేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. మొత్తానికి ‘బాలల వనం’ అనే పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు.
యం.రమేష్ అనే 7వ తరగతి విద్యార్థి ‘చినుకు అక్షరం’ అనే కవితలో చినుకు చినుకు కలిసి పడితే వర్షం అంటారు/ అక్షరం అక్షరం కలిసి కాగితం మీద పడితే దానిని పుస్తకం అంటారని, ఎంతో కొంత కవిత్వ చాయలుంటే కానీ ఇలాంటి భావం రాదని మనం చదివితే అర్థమైపోతుంది.
‘నది లాంటి జీవితం’ అనే కవితలో విద్యార్థి కరుణ జీవితంపై ఎంత అవగాహన ఉంటే ఇలాంటి వాస్తవాలు రాస్తుందో చూడండి. కదులుతూ కదులుతూ ముందుకు నడువు నేస్తమా/ కష్టాలు రానీ దుఃఖాలు రానీ/ నీ ప్రయాణం సాగనివ్వు/ నీ ప్రయాణం కొనసాగనివ్వు/ కష్టాలే నీ జీవితం/ దుఃఖాలే నీ జీవితం/ జీవితమనేది ఒక నది లాంటిది.. ఇలా నది మలుపులు జీవిత మలుపులకు ముడిపెట్టి ఒక విద్యార్థి రాయడం అద్భుతమనిపించింది.
అర్పిత 10వ తరగతి విద్యార్థి ‘ఓ భరతమాత’ కవితలో ఓ భారతమాత అందుకో నా వందనాలు/ పిల్లలు నీ స్వేచ్ఛ కోరుతున్నారమ్మా/ కంటికి రెప్పలా కాపాడుతారమ్మా’ అంటూ భరతమాతని కాపాడుకోవాలని ఎంత దేశభక్తి ఉంటే ఇలాంటి అక్షరాలు ఒక మాలకూర్చిందో మరి.
‘మా ఊరి చెరువు’ అంటూ దీపిక (8వ తరగతి విద్యార్థి) ఆ చెరువుపై ఉన్న అమితమైన ప్రేమను ఎంతో ఇష్టంగా చెప్పింది.
‘దేవుళ్లు’ అనే కవితలో రాంచరణ్ 8వ తరగతి విద్యార్థి రాసిన వాక్యాలు ‘దేవుళ్లు పంచుతారు భక్తిని/ గురువులు పంచుతారు విద్యని/ అమ్మ నాన్నలు పంచుతారు ప్రేమి/ స్నేహితులు పంచుతారు సంతోషాన్ని’ అంటూ మనం ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాం.
ఈ పుస్తకంలో ఇంకా అమ్మ, ఆట, ఉదాహరణ, విజ్ఞానం, ఆకాశరాజు, నా ఆశ, విత్తనం, ప్రకృతి, చదువులమ్మ జీవితం, గోరింటాకు, ప్రాణం, నేనే శ్రీశ్రీ, అయ్యోపాపం, కత్తికన్నా కలం మిన్న.. ఇలా ఈ పుస్తకంలో 146 కవితలు, మినీ కవితలు ఉన్నాయి.

-కుంచె చింతా లక్ష్మీనారాయణ