పఠనీయం

మాతృత్వపు మాధుర్యాన్ని వివరించిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనం (కథలు)
-అనూరాధ (సుజలగంటి)
వెల: రూ.120
ప్రతులకు: జ్యోతి వలబోజు
8096310140
*
ప్రపంచవ్యాప్తంగా, బహుశా అన్ని భాషల్లోనూ వచ్చిన కథలు, కవితల్లో కామన్ వస్తువు: అమ్మ. మానవ జాతిలోనే కాదు; పశు పక్ష్యాదుల్లో కూడా తల్లికీ బిడ్డకూ మధ్య ఉండే అనుబంధం, ఆత్మీయత వెలకట్టలేనిది.
అందుకే అనురాధ (సుజలగంటి) గారి కథల్లో, నవలల్లో అమ్మతనంలోని కమ్మదనం మనకు పంచుతున్నారు.
అయితే, మారుతున్న మానవ సంబంధాలలో దూరమవుతున్న ప్రేమలు; పూర్తిగా దూరం చేసుకోలేక మనసు పడే సంఘర్షణలు, ఎంతో కష్టపడి పెంచినా ఎన్ని త్యాగాలు చేసినా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు, పక్కవాళ్లను చూసి అమ్మ అవి సమకూర్చటం లేదని గొణుక్కునే పిల్లలు, వాళ్ల విలాసమయ జీవితాలు, పిల్లల పెంపకంలో ఒక్కోసారి భర్తతో కూడా పడే సంఘర్షణలు; వీటన్నింటినీ అతి ప్రతిభావంతంగా చూపబడిన కథా సంకలనమిది.
ఈ సంకలనంలో 15 కథలున్నాయి. ఇవన్నీ సంకలనంగా రాక ముందు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడినవే! ఒక్క కథ (నాకూ కథ రాయాలని ఉంది) మినహా, మిగతా కథలన్నీ పై విషయాన్ని ‘హైలెట్’ చేసిన కథలు. మరొక్క గమనించదగ్గ విషయం - ఈ కథల్లో రచయిత్రి తల్లీ పిల్లల మధ్య ఉండాల్సిన బంధం గురించే కాకుండా, తాత అమ్మమ్మ నానమ్మల ఆవశ్యకతను కూడా వివరించటం ‘మళ్లీ వచ్చిన బాల్యం’ ‘నానమ్మొస్తుంది’. అయితే ‘జలతారు’ లాంటి ఒకటి రెండు కథలు వీటికి మినహాయింపు అనుకుంటాను.
‘జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోవాలి’ (పే.27) ‘ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లు రెండు నావల్లో ప్రయాణం చెయ్యటమే. రెండూ బేలెన్స్ చెయ్యాలంటే చాలా కష్టం’ (పే.47) లాంటి మంచిమంచి వాక్యాలు కథలన్నింటా కనిపిస్తాయి.
సులభశైలి, అనవసర వర్ణనలు (ప్రబంధ కాలపు కవుల సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు) లేకపోవటం ఈ సంకలనం గొప్పతనం - ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరిగారు తన ‘ముందు మాట’లో చెప్పినట్లు - ఎత్తుగడ, ముగింపు పట్ల నవ్యత, మరింత మెరుగైన శిల్పం పాటిస్తే, ఇంకా బావుండేది.

-కూర చిదంబరం 863933 8675