పఠనీయం

మనోమందిర దీపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు
-కుప్పా వేంకట కృష్ణమూర్తి
మూల్యం: రూ.150.. పుటలు: 224
ప్రతులకు: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, భానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమల్‌గూడా, హైదరాబాద్ - 500 029. ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్,
చుట్టుగుంట, విజయవాడ - 520 004.
*
‘ఇవన్నీ వేదాలలో ఉన్నాయిష’ అంటూ గురజాడ తన ప్రదీపాత్మక భావాన్ని ‘కన్యాశుల్కం’ నాటకంలో ఒక అధిక్షేపణగా, వ్యంగ్యంగా, అన్యాపదేశంగా, వక్రోక్తికి వ్యక్తీకరించినా వేదవిజ్ఞాన గౌరవ ప్రపత్తులకు వాటిల్లిన లోటుగానీ, ప్రాముఖ్యచ్యుతిగానీ ఏమీ లేదు. ఉండదు. వేదం అంటేనే ‘ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంథః వేదయతి సవేదః (మేలును పొందటానికీ, కీడును నిరోధించుకోవటానికీ లోకాతీతమైన ఉపాయాలను తెలిపే గ్రంథం) అన్నారు సాయణాచార్యుల వారు.
ఇక్కడ లోకాతీతమైన ఉపాయాలు అంటే సాధారణ మానవునికి తెలియని వివిధ శాస్త్రాలు, విద్యలు, విజ్ఞాన విషయాలు, విన్నాణాలు, వృత్తిపర విధివిధానాలు మొదలైనవన్నీ అని అర్థం. అలాంటి అనేక విశేషాంశాలు వేదాలలో ఉన్నాయని డా.రఘువీర, జె.జి.బోధే వంటి సాంఘిక, సాంకేతిక విజ్ఞానశాస్తజ్ఞ్రులు మొదలుకొని రిచర్డ్ ఎల్.్థంప్సన్, ఆచర్యా ప్రఫుల్లచంద్ర రాయ్, రేమెల్ల అవధానులు మొదలైన బహు విషయ పరిజ్ఞాన పారంగతులు ఎందరో సోపపత్తికంగా, సోదాహరణంగా తమతమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా స్పష్టం చేశారు. అలాంటి మరో మంచి రచనా ప్రణాళిక కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు కూడా చేపట్టారు. ‘్ళ్యశషళఔఆఒ యచి డ్య్ఘూ ఉశళూక జశ ౄఒఖఇ్యజ్దూజశజ యఛి ఱ్ద్ఘ్ఘూజూత్ఘ్ఘీ’. సనాతన దేశంలో అధునాతన విజ్ఞానం’ మొదలైన తన పుస్తకాల తర్వాత ఇటీవల ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ అనే ఒక విలువైన గ్రంథం రాశారు.
ఖగోళశాస్త్రం, కాలమానాలు, గణితశాస్త్రం, భౌతిక శాస్త్రం, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్, పర్యావరణ విజ్ఞానం, రసాయనిక శాస్త్రం, లోహ శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన పదహారు ముఖ్యాంశాలే కాకుండా కొన్నికొన్ని పురాణ గాథల సంకేతార్థాలు కూడా ఈ పుస్తకంలో విస్తారంగా వివరించారు రచయిత. వేదాలు, ఉపనిషత్తులు, వివిధ ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, భారత భాగవతాదులు ఆధారంగా ప్రాచీన శాస్త్రాలలోని కొటేషన్లు, ఆ శాస్త్ర గ్రంథాల, రచయితల పేర్లు, వాళ్ల కాల వివరాలతో కూడిన భారతీయ విజ్ఞానశాస్త్ర చరిత్రలో చాలా భాగమూను. ఇందులో చోటుచేసుకున్నాయి.
‘వేదాలలో ఇంజనీరింగ్’ వ్యాసం చాలా బాగున్న వాటిలో ఒకటి. ఆ వ్యాసం (99వ పుటలో) తెలియజేసిన శిలా సంప్రయోక ప్రక్రియ (స్టోన్ ట్రీట్‌మెంట్) ను వివరిస్తూ ‘శిలల మీద శిల్పకారులు రకరకాల ద్రావకాలు పూసి, శిలాతలాన్ని మృదువుగా చేసేవాళ్లు. శంఖ ద్రావకం, కుష్ఠసారం, సైంధవ ఖర్పరం (సముద్రపు ఉప్పు), ఉకత్స అనే చెట్టు బెరడు చూర్ణం - ఇలాటి వాటితో ద్రావకాలు చేసి మర్దనం చేస్తే శిలలు మృదువుగా తయారై ఉలితో కొట్టినప్పుడు పగిలిపోకుండా సరైన విధంగా చెక్కేందుకు అనుకూలంగా తయారవుతాయి’ అంటూ ఇచ్చిన ఆనాటి స్టోన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వివరాలు అచ్చెరువు గొలుపుతాయి.
వ్యోమయాన శాస్త్ర విషయాలు (29వ పుటలో) మరో ఆకర్షకాంశం. భరద్వాజ మహర్షి విరచిత విమాన శాస్త్రంలోని లెక్కకు మిక్కిలియైన సాంకేతిక విషయాలను పూసగుచ్చినట్టు అందించారు కృష్ణమూర్తిగారు. వాయువులు నాలుగువేల రకాలున్నాయని, వాయువు అనేది ఒక పదార్థమే కాక అందులో కొన్ని రకాల శక్తులు (ద్ఘిఒళ్యఖఒ ఉశళూజళఒ) ఉన్నాయని, విమానంలో ఉంఢే యంత్ర భాగాల పేర్లు (ద్రవాకర్షణ యంత్రం, ధూమోద్గ మ యంత్రం, వాతాకర్షణ యంత్రం వగైరాలు), ఇంకా ఎన్నో నాటి వైమానిక సాంకేతిక (ళష్దశజష్ఘ) అంశాలను భరద్వాజుడు చెప్పిన వాటిలో చాలా వాటిని ఉటంకించి చెప్పారు కుప్పావారు.
101వ పుటలోని ‘హంపీ విజయనగరంలోని గాలి గోపురాల నిర్మాణంలో ఒకచోట గూళ్లలోంచి ప్రసరించే కాంతి కిరణాల ప్రభావంవల్ల చెట్ల ప్రతిబింబాలు తలక్రిందులుగా పడతాయి కెమెరాలోలాగా’ వంటి తార్కాణాలు చదువుతుంటే అంతకంటే ప్రాచీన కాలంలో సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇంకెంత మహోన్నత ‘వస్తు కళాత్మ’కంగా ఉండేదో అనే భావన కలుగుతుంది. వాస్తవాన్ని తద్విరుద్ధంగా చూపిన భారతకాలంనాటి మయసభ సంగతి కేవలం పుక్కిటి పురాణం కాదు, మిధ్యాత్మకపు మిథాలజీకానే కాదు అని అవగతం అవుతుంది. ఈ పుస్తకం కేవలం స్ఫూర్తిదాయకమే కాకుండా చాలా వైజ్ఞానికాంశాలలో ఆచరణాత్మక ప్రయోజనకారి. ఎప్పుడైనా ఎక్కడైనా పఠనీయత (రీడబిలిటీ) ఉన్న పుస్తకం ఏదైనా మస్తకాన్ని వెలిగించే దీపకం. ఈ భావనాన్ని, అనుభవాన్ని అందించే శక్తిమంతం ఈ విశేష వ్యాస సంకలనం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం