పఠనీయం

రక్తి లేక విరక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవేమన (నాటకం)
-ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పేజీలు: 91
వెల: రూ.60
ప్రతులకు: రచయిత,
ఇం.నెం.9-1-1/సి డిఫెన్సు కాలనీ,
లంగర్‌హౌస్, హైదరాబాద్-8
*
ఈ వేమన నాటకానికి నాంది ఎలా జరిగిందో జి.ఎస్.ఎన్.శాస్ర్తీగారు తమ నానుడిలో వివరించారు. వారు యోగి వేమన నాటకాన్ని రవీంద్రభారతిలో ప్రదర్శిస్తుంటే వారికి ఆ రచయిత లాయరు నోటీసు ఇచ్చాడట. అందువలన వారు తమకే ఒక నాటకం ఉంటే బాగుంటుందని రచయిత గంగిశెట్టిని అడిగారట. ఆయన పద్య నాటకాలకు బద్ధ వ్యతిరేకి. అయినా ఆయనను జి.ఎస్.ఎన్.శాస్ర్తీగారు సమాధానపరిచారు. నాటకంలో లోకధర్మి, నాట్యధర్మి రెండూ ఉన్నప్పుడే అది రక్తి కడుతుంది.
వేమన చెప్పింది రక్తి లేక విరక్తి లేదు. వేమనకు కల వేశ్యా వ్యామోహంతో వదినగారి ముక్కెరను అడిగి తెచ్చి వేశ్య అయిన శృంగారవల్లికి బహుమానంగా ఇస్తాడు. ఇస్తూ తన వదినగారు పెట్టిన షరతు వినిపిస్తాడు. ‘ఇచ్చెద ముక్కెరన్.. పుట 61) ఆమెను అనగా శృంగారవల్లిని వివస్తన్రు చేయమని చెబుతుంది. శృంగారవల్లి ఆ మాట విని ‘నీ వదినగారికి నీవు పుత్రతుల్యుడవు. నేటి నుంచి నాకు కూడా పుత్రుతులుల్యడివే (పేజీ 62) ‘కనుమా కనులువిచ్చి..’ అంటూ నగ్న సౌందర్యం చూపిస్తుంది. శృంగారవల్లి చెప్పిన మాటలతో వేమనకు జ్ఞానోదయమయి మాయ తొలగిపోయి ‘కంటిన్, కంటిన్...’ (పుట 65) అనే పద్యం చెపుతాడు. తరువాత తన అన్నగారిని ప్రభువులు కప్పము ఇవ్వలేదని బందీని చేయగా ఆయనను విడిపించుటకు లంబికా శివయోగిని దర్శించి రసవిద్యతో బంగారం ఇమ్మంటాడు. శివయోగి ఆ విద్యను వేమనకే చెప్పి ఆయన ముట్టుకున్న రాళ్లు బంగారం కాగా దానితో ప్రభువుకు ధనం చెల్లించి అన్నను బంధవిముక్తుడిని చేస్తాడు. వేమన రసవిద్యను అంతవరకే ఉపయోగిస్తాడు. అంతకు ముందు అదే విద్యను అభ్యర్థించిన అభిరామయ్యకు శివయోగి చెప్పలేదు. ఎందుకంటే అతడు తన స్వార్థానికి అడిగాడు ఆ విద్యను.
ఇక రచయిత వ్రాసినది చూద్దామా. కొన్ని పాత్రల చేత రచయిత చెప్పించిన మాటలు:
పుట 52: అనవేమారెడ్డి: దేవబ్రాహ్మణ మాన్యాలు మేము అంటరానివి. ఇది ఈనాటి పాలకులు గ్రహించాలి.
పుట 60: శృంగారవల్లి: సర్వ జగత్సత్యమైన శృంగారమంటే జీవాత్మ పరమాత్మతో జరిపే శృంగారం. మామూలు శృంగారం కాదని రచయిత వేశ్యతో అనిపించిన మాట.
పుట 63: శూన్యమంతా ఆవరించిన ప్రకృతియే స్ర్తి.
పుట 65: ‘కంటిన్ కంటిన్ లోవెలుగు.. తంటాల్ బెట్టెడి మిధ్యకాగ నిజవౌ తత్వమ్ము నేగంటిన్’
పుట 68: వేమన శివయోగిని అన్నను విడిపించటానికి బంగారం అడిగితే ఆయన అన్న మాటలు నువ్వు వినిపించాల్సింది వ్యామోహపు చెరలో బందీ అయిన నీ మనోనేత్రాన్ని, నీకు కావలసింది బంగారం కాదు. ఆత్మదర్శనం.
పుట 69: శివయోగి: నాయనా వేమా! నిజమైన యోగిని నిర్వచనం పలికేది. ఈ హేమకారీనమైనటువంటి క్షుద్రవిద్యలూ, కనికట్టు మహత్తులూ కావు. యోగసమాధిలో నిలిచి పరమేశ్వర సాయుజ్యాన్ని పొందటం, పదిమందికి శాశ్వతమైన ఆనంద మార్గాన్ని చూపటం. ఆ ఆనందానుభవమే పరబ్రహ్మం.
అనే తైత్తిరీయ ఉపనిషత్ సత్యాన్ని రచయిత ఆవిష్కరించారు.
చాలా వేదాంత బోధనలతో ఈ నాటకాన్ని రచించిన రచయిత అభినందనీయుడు. పద్యాలు రాయటం తనకు చేతకాదు అన్న రచయితచే ఈ నాటకాన్ని శాస్ర్తీగారు ఎందుకు రాయించారో తెలియదు. రచయిత తన నాటకంలో ఎవరు ఏ పద్యాలు రచించారో చెప్పటం ఆయన సత్యవ్రతానికి ప్రతీక. అందుకు అభినందనీయుడు. మొత్తం సమారు 48 పద్యాలలో రచయిత రచించినవే 29 ఉన్నాయి. అందరూ చదువదగిన పుస్తకం. ఇతరుల పద్యాలలో చిల్లర కృష్ణమూర్తి, అక్కిరాజు సుందర రామకృష్ణవి బాగున్నాయి.

-నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ 9849793649