పఠనీయం

ఆకాశవర్షిణి నుంచి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీజీ మార్మిక మాయావాదం
భారత రాజకీయాలు.. అంబేద్కర్ దృక్పథం
-డా.కత్తి పద్మారావు
వెల: 1000.. పేజీలు: 980
ప్రతులకు: కత్తి స్వర్ణకుమారి
లోకాయుత ప్రచురణలు, లుంబినీ వనం
అంబేద్కర్ కాలనీ, పొన్నూరు - 522 124
గుంటూరు జిల్లా
9849741695
*
కులం పునాదుల్ని కూల్చడం వల్లే భారతదేశ పునర్నిర్మాణం సాధ్యం అనేది డాక్టర్ కత్తి పద్మారావు బృహద్గ్రంథం ‘భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం’. శాస్ర్తియ చారిత్రిక సాంఘిక పునాదుల ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రగాఢంగా విశదీకరిస్తుంది. భారత రాజకీయాలకు తాత్విక పునాది ప్రసాదించిన, సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ శిల్పి డా.బి.ఆర్.అంబేద్కర్‌కు అంకితంగా లోకాయుత ప్రచురణలు డా.కత్తి పద్మారావుగారి 67వ పుస్తకంగా వెలువరించిన ఈ గ్రంథం, రాజ్యాధికార కులాధిపత్య హిందూ వాదం, తాత్వికత, ఏ చరిత్ర లేకుండా, మార్మికత మాయావాదంగా పెద్ద అవకాశవాదంగా ఎలా నిలద్రొక్కుకున్నదీ, రాజకీయాంశలను నడిపించే భావజాల ప్రాధాన్యతను నిర్దుష్టంగా విశే్లషిస్తుంది. మతం అనేది ఏదైనా మానవ ధర్మంలో నడువకుండా మానవతా ప్రబోధం లేకుండా ఇతర మతాలను ద్వేషించే సంకుచిత సైద్ధాంతిక పరిణామాలు సృష్టించే సంక్షోభం గ్రహించకుండా గాంధీ, నెహ్రూ, జిన్నాలు దేశ రాజ్యాధికారానికి సంబంధించిన మోసపూరిత విధానాలను ముందుకు తెచ్చారని అంబేద్కర్ పోరాటం, సామాజిక బావుటా ఎగురవేసింది.
‘ భారత రాజకీయాలు అంబేద్కర్ చూపు’ తొలి అంశంగా ఈ గ్రంథం ఆరంభమై ‘అంబేద్కర్ అనుభవం భారత పునర్నిర్మాణం’ 27వ అంశంగా అంబేద్కర్ యుగం నిర్మించిన ప్రజాస్వామ్య లౌకిక సోషలిస్టు భావజాలాలే భారత రాజకీయాలలో అంతిమంగా విజయకేతనం ఎగురవేయటం చారిత్రిక సత్యంగా ఆ దిశలో పయనించాలని డా.కత్తి పద్మారావు ప్రగాఢంగా అభిలషిస్తారు. ఇప్పటికి 66 గ్రంథాలు రాసి ప్రచురించిన మేధావి పద్మారావు, ఈ గ్రంథంలో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక, సాంస్కృతిక, తాత్విక విశే్లషణలను సందర్భానుసారంగా ప్రస్తావించారు. గాంధీ చేసిన మార్మికత, భారతదేశ రాజకీయాలను వర్ణ వ్యవస్థా ప్రభావంలో ఉంచాయనే అభిప్రాయానికి మద్దతుగా తన ఇంటి పేరుని నెహ్రూ కుటుంబానికి బదిలీ చేసి బ్రాహ్మణ బనియా ఐక్యతను గాంధీ చాటి చెప్పాడనే అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది.
* * *
భారత రాజకీయాలు ఒక భావజాల సముద్ర గర్భంలో నడిచినా అంబేద్కర్ నిర్మించిన ప్రజాస్వామ్య లౌకిక సోషలిస్టు భావజాలం నేటికీ వర్ణవాద, మనుస్మృత రాజ్యాధికారం సంపూర్ణంగా నాశనం కావాలని, అస్పృశ్యత, నిరక్షరాస్యత, పేదరికం, అణచివేతలపై డా.బి.ఆర్.అంబేద్కర్ అలుపెరుగని రాజనీతిజ్ఞునిగా జీవితాంతం పోరాటం కొనసాగించారు. ఆత్మగౌరవం, విముక్తి, సమానత్వం, కుల నిర్మూలనం, అంటరాని తనం నిర్మూలనం, అన్యాయ, దౌర్జన్యాలపై పోరాటాలు రాజ్యాధికారం కీలకంగా అంబేద్కర్ బోధించారు. అంబేద్కర్ ఆశయాలే రాజ్యాధికార ఊపిరిగా బాలెట్‌ని తక్కువ అంచనా వేయకుండా హక్కులను సాధించి, రాజ్యాధికారం సంపదను పంచే దిశలో సాగాలని అంబేద్కర్ ప్రబోధించారు. దళిత, బహుజన, మైనార్టీ, మహిళలకు రాజకీయాలలో సమప్రాధాన్యత సాధించటమే బౌద్ధ అంబేద్కర్ వాద భావజాలం, ఈ గ్రంథం అద్భుతంగా విశే్లషిస్తోంది.
గాంధీ అహింసావాదం మార్మికమైనదని, ప్రత్యర్థిని నిరాయుధంగా సెంటిమెంటల్‌గా దెబ్బతీసే కుయుక్తులు, కుతంత్రాలతో ఆమరణ నిరాహార దీక్ష అస్త్రంగా ప్రయోగించేవాడని ‘పూనా ఫ్యాక్ట్ - దృశ్యం’ ప్రకరణలో రచయిత, అంబేద్కర్ - గాంధీ వ్యక్తిత్వ వైరుధ్యం సుస్పష్టం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ జీవితంలో బ్రాహ్మణ భావజాల ప్రస్తావనలో ఎంత సంస్కారులైనా పరాశర, మనుస్మృతికి అధీనులై వుంటారని ద్వైదీకృతంగా వ్యవహరించటంలో నెహ్రూ, పటేల్ ఆర్.ఎస్.ఎస్. శ్రేణుల పట్ల ఉదాసీనంగా ఉండటం వల్లనే ఆర్.ఎస్.ఎస్. పూర్తిగా రూపుమాసిపోకుండా పెంచి పోషించబడిందని ‘బ్రాహ్మణాధిపత్యంలో భారతం’ అనే అధ్యాయంలో డా.కత్తి పద్మారావు స్పష్టంగా వివరించారు.
సుమారుగా వెయ్యి పేజీలున్న ఈ గ్రంథం, శతాబ్ది నాటి అస్వతంత్ర అఖండ ప్రాచీనతా చారిత్రక పరిశోధనా అంశాలు, నాటి నేటి సమాజ వైరుధ్య నడవడికలో వాస్తవాలు, బలాలు, బలహీనతలు, అన్యాయ అసమానతా అణచివేతలు, డా.బి.ఆర్.అంబేద్కర్ సామాజిక విప్లవ జ్వలిత కార్యాచరణను ప్రమాణబద్ధంగా వ్రాయగలగటంలో డా.కత్తి పద్మారావు వంటి అసామాన్య శాస్ర్తియ తాత్విక మేధా రచయిత, అనే్వషణా నిరంతర అధ్యయనశీలికే చెందింది. ప్రస్తుత భారత రాజ్యాధికారం, యుపిఎ, ఎన్‌డిఎ కేంద్ర సంకీర్ణ కేంద్ర రాజ్యాధిపత్యం కోసం కుమ్ములాటలో నిమగ్నమయ్యే కాలమాన స్థితిగతులలో, అంబేద్కర్ బౌద్వాద భావజాలం ఎంతవరకు కృతకృత్యంగా సజీవ భావ చైతన్యంతో జాజ్వల్యమానంగా భారత రాజకీయాలను మలుపు తిప్పి ప్రభావితం చేయగలదో అంబేద్కర్ సత్కీర్తి ప్రతిభా ప్రతిష్ఠలను అజరామరంగా యుగ ప్రస్థానపు గుండెలలో ప్రవర్థమానం చేయగలదో దర్శింపచేయడం ఈ గ్రంథ ద్వితీయ భాగంగా మరొక కత్తిసాము వంటి సాహసిక నైతిక దర్పణ దృశ్యమానం కోసం ఎదురుచూద్దాం. మేధాప్రతిభా సమన్వితులైన మనోశిల్పికి శుభాభినందనలు.

-జయసూర్య 9440664610