పఠనీయం

ప్రబోధన శీలమైన నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్యామి (నవల)
-సింహప్రసాద్
వెల: రూ.75
ప్రతులకు: అన్ని పుస్తకకేంద్రాలలో
*
సమాజపు సమిష్టి జీవనాన్ని సంప్రదాయాలు నిర్దేశిస్తాయి. బహుజన హితాన్ని ఆశిస్తూ, సంప్రదాయాలు ఏర్పడుతాయి. నాగరిక సమాజంలో ఈ సంప్రదాయాలు చట్టాలుగా రూపొందుతాయి. చట్టాలను, సంప్రదాయాలను గౌరవించటం పౌరుల బాధ్యత. అధికారంలో ఉండే వ్యక్తులు చట్టాలను బేఖాతరు చేస్తూ, తమ అధికారాన్ని సంఘ ప్రయోజనాలకు కాకుండా స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవటం కద్దు. ఇలాంటి ‘కట్టుతప్పిన’ వ్యక్తుల అంతరాత్మను ప్రేరేపించి వారిని సక్రమమైన మార్గంలో పెట్టటానికి సాహిత్యం ఉపయోగపడుతుందని నిరుటి తరం సంస్కర్త కొడవటిగంటి కుటుంబరావుగారు చెబుతారు.
నేడు ప్రపంచానే్న పట్టి పీడిస్తున్న దురాచారం ‘అవినీతి’ మరియు ‘లంచగొండితనము’. భారతదేశంలో అది ఎయిడ్స్ కంటె అతి భయంకరంగా వ్యాప్తి చెందుతూ, చెదపురుగులా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నది. ఈ దురాచారాన్ని నిరసిస్తూ, రచయిత సింహప్రసాద్ గారు ‘అంతర్యామి’ నవలను మన ముందుకు తెచ్చారు. 2017లో ఆంధ్రభూమి వారపత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొంది, ధారావాహికగా ప్రచురించబడి ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చింది.
చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ (సింహప్రసాద్) సమకాలీన సాహితీ స్రష్టలలో పేరు పొందినవారు. 340 కథలు, 60 నవలలు, పలు వ్యాసాలు, కవితలు, నాటికలు రాసి పలు పురస్కారాలు అందుకున్నారు. కథ, కథనం - రెంటిలోనూ సమతూకం పాటిస్తూ, పాఠకుడిని ఆకట్టుకునేలా చెప్పగలగటం వీరి ప్రత్యేకత. వీరి రచనలు పలు భాషల్లోకి అనువదింపబడ్డాయి.
ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందనీ మంచేదో చెడేదో ఆ అంతరాత్మ ప్రబోధిస్తుందని, బాహ్య వ్యామోహాలకు, ప్రలోభాలకు లొంగకుండా, అంతరాత్మ నిర్దేశించిన దోవన నడవాలని చెబుతుంది ఈ నవల.
పరబ్రహ్మం అనే మైనింగ్ అధికారి చుట్టూ అల్లబడిన ఈ నవలలో, రమణ అనే స్నేహితుడు, శ్రీరాం అనే కొడుకు విద్యుల్లత అనే సెకండ్ సెట్ ఆయన్ను మంచి వేపు లాగే పాత్రలు. సూరిబాబు మైనింగ్ కాంట్రాక్టరు, భార్య సుందరి మరియు నల్లబ్బులు అనే సూరిబాబు అనుచరుడు పరబ్రహ్మంను చెడువేపు లాగుతుంటారు. యక్షుడు అన్న పాత్రను అడుగడుగునా, మంచేదో చెడేదో హెచ్చరిస్తూ ఉంటుంది. చివరకు పరబ్రహ్మం, మంచి దారిన నడవటంతో నవల ముగుస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఉండే అంతరాత్మ దైవ సమానము. ప్రాపంచిక వ్యవహారాల్లో ఈ అణు ప్రమాణమైన ‘అంతరాత్మ’ ప్రతీ క్షణము మంచీ చెడుల హెచ్చరికలు పంపుతూ ఉంటుంది. ఆ హెచ్చరికల వల్ల మంచీ చెడుల నిర్ణయం ఆ వ్యక్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. నవల చదువుతున్నంతసేపూ మనకు రామాయణ రచయితగా మారక ముందున్న బోయవాడి అంతర్మథనం గుర్తుకు వస్తుంది.

-కూర చిదంబరం 8639338675