పఠనీయం

లక్ష్మీనృసింహుని వృత్తాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టముఖ - షోడశబాహు ఉగ్రనరసింహుడు
-డా.కండ్లకుంట
నరసింహమూర్తి
పేజీలు: 272
వెల: రూ.300
ప్రతులకు: కల్వకోట
కీర్తికుమార్
ఆలయాల ధర్మకర్త, కార్యదర్శి
ఇం.నెం.2-9-47,
ముకరంపురా
కరీంనగర్ - 505 001
*
కరీంనగరం జిల్లాలోని ఒక గ్రామం కోట్ల నరసింహులపల్లె. అక్కడ దేవుని గుట్టపై అపురూపమైన షోడశ బాహు అష్టముఖ ఉగ్రనరసింహ స్వామి విగ్రహం (శిలారూపం) అతి పురాతనమైనది.
కల్వకోట వంశీయులకు ఇలవేల్పుగా ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. వారి వంశీయులే దీని పునరుద్ధరణ గావించారు. ఇది చాలా ప్రాచీనమైనది. కల్వకోట కీర్తికుమార్ అభ్యర్థన మేరకు దీనిని సంరక్షించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారు దర్శించి వాటిని పరిరక్షించాలని చెప్పారు.
ఈ ఆలయంలోనే వెలసిన శ్రీ సీతారామాలయం, ప్రక్కనే శ్రీ విశ్వనాథాలయం, వీరభద్రుని విగ్రహం ఉన్న ఈ ఆలయ సముదాయానికి క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామి.
‘తెలుగు సాహిత్యంలో నృసింహ వృత్తాంతం’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న కండ్లకుంట నరసింహమూర్తిగారు కీర్తికుమార్ అభ్యర్థనపై ఈ ఆలయ చరిత్రను గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథమే ఇది.
ఈ గ్రంథంలో శ్రీ మహావిష్ణు అవతారాలైన ప్రధాన దశావతారాల గురించి వివరిస్తూ శ్రీనృసింహావతార ప్రత్యేకతను వివరించారు. అలాగే ఈ గుట్టలోగల ఇతర దేవాలయాలను రచయిత వివరించారు.
ఇంకా వివిధ కవులు శ్రీ నృసింహ స్వామి మీద రచించిన స్తోత్రాలు పద్యాలు ఇచ్చారు. స్వామి వారి మీద త్యాగరాజు, అన్నమయ్యల కీర్తనలను ఇచ్చారు.
గ్రంథం చాలా చిత్రాలతో ఎంతో విషయ వివరణలతో ఉంది. అయితే దీనికి ఒక విపత్తు కలిగేటట్లుంది. దీని సమీపంలో మంచి గ్రానైటు రాయి లభిస్తుండటంతో దానిని వెలికి తీయటంలో ఈ ఆలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు అన్నపూర్ణా విశ్వనాథాలయాల ట్రస్టు వారు తమ తొలిపలుకులలో హెచ్చరిస్తూ, ఈ ప్రాంతాన్ని మైనింగ్ నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. మైనింగ్ చేస్తే వచ్చే నష్టాలను కల్వకోట వెంకట సంతోష్‌బాబు గారు తమ ముందు మాట ‘చెప్పాలని ఉంది’లో వివరించారు.
ఒక పురాతన శ్రీ నృసింహ ఆలయ చరిత్రను ఎంతో ప్రామాణికంగా, వివరణలతో వర్ణ చిత్రాలతో, స్తోత్రాలతో, పద్యాలతో గ్రంథస్థం చేసిన రచయిత, సంకలనకర్త అభినందనీయుడు. ఈ ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్న కల్వకోట వంశీయులు, దేవాలయాల ట్రస్టు వారు, ఇతరులు - వీరి కృషి ప్రశంసనీయము.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649