పఠనీయం

అలరించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణార్పణం
(కథల సంపుటి)
-వరిగొండ కాంతారావు
వెల: రూ.130
ప్రతులకు: వరిగొండ
సూర్యనారాయణ ఆదిత్య
35-5-220
జీవనమిత్ర నగర్
విద్యారణ్యపురి
హనుమకొండ -506009
9441886824
*
వరిగొండ కాంతారావు రచించిన కథల సంపుటి ‘కృష్ణార్పణం’. ఈ రచనలో ప్రధానంగా గమనించాల్సింది మానవ సంబంధాలు. అందులో ఉండే ప్రేమలు ద్వేషాలు, ఇంకా పటిష్టంగా మిగిలి ఉన్న కుటుంబ వ్యవస్థ. ఈ రచయితలో విషయాన్ని సునిశితంగా చెప్పగల శైలి ఉంది. చక్కగా అధిక్షేపించే వ్యంగ్యం ఉంది. ఆయన వ్యంగ్యానికి ఇదండీ దీపావళి, కృష్ణార్పణం, మంచి ఉదాహరణలు. పౌరాణిక కథలను ఆధునికీకరించిన తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆధునిక టెక్నాలజీ, ఆధునిక భావజాలాన్ని (స్ర్తివాద దృక్పథాన్ని) ఆయన ఇందులో ప్రవేశపెట్టిన తీరు ప్రశంసనీయం.
సాధారణంగా పౌరాణిక కథలలోని పాత్రలలో లీలా మానుషత్వాలు, మాయా మానుషత్వాలు, అలవోకగా కొనసాగుతాయి. మనకు కావలసింది కథ ద్వారా పాత్రల ద్వారా చూపిన తాత్విక దృక్పథం. పాత్ర నిర్మాణాన్ని హేతువాదంతో ప్రశ్నిస్తే ప్రయోజనం లేదు. మానవ హృదయంలోని సహజ కాల్పనికత కథా నిర్మాణంలోను పాత్రల్లోనూ ప్రవేశిస్తుంది. అది ఏ దేశంలోనైనా ఉంది. అవి ప్రక్రిరుూకరణ పొందేటపుడు చూపిన మెలకువలు, వస్తువు వెనుక దాగిన తాత్వికత మనం ప్రధానంగా గమనించాల్సిన అంశాలు. ఆ తాత్వికత ఈనాడు ఒప్పుకుంటున్నామా లేదా అనేది వేరే విషయం. ఈ సంపుటిలో పౌరాణిక కథలు ఆధునికీకరించ బడడమే ఒక వ్యంగ్యం. ఈ వ్యంగ్యంలో రచయిత చెప్పదలచుకున్నది ఏమిటి? ప్రాచీన తాత్విక మీమాంస పట్ల నిరసన. వాళ్లు ఆధునికంగా ఆలోచిస్తే ఇలా ఉంటుందని చూపించడం. ఏమైనా ఇది మరింత పరిశీలించాల్సిన అంశం.
ఈయన క్షమ, సంసారం, అవ్యక్తం, అంతిమం లాంటి కథలని మానవ సంబంధాలను వాటిలోని అనుకూల ప్రతికూల అంశాలని చిత్రిక పడతారు. మధ్యతరగతి జీవితాలకు సంబంధించిన అంశాలే. స్ర్తి పురుష సంబందాలు చాలా సహజంగా చిత్రించారు. అందులో వివక్షను పాఠకులకే వదిలేశారు. మనిషికి క్షమించే గుణం ఉండవలసిన అవసరం (క్షమ), పంతాల వల్ల మిగిలే ఆవేదన (అవ్యక్తం), దళిత కుటుంబాలలో కూడా తల్లిదండ్రుల పట్ల వివక్షను తెలిపే కథ (అభిమానం), పెద్దవాళ్లను వృద్ధాశ్రమంలో చేర్చకూడదనే సందేశం ఇచ్చే కథ (గయా శ్రాద్ధం), పరిణతి లేని ప్రేమ (సుబ్బులు మామయ్య)లో చూపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల శిష్ట వ్యవహారికాల పట్ల, మాండలికాల పట్ల కవికి మంచి ఒడుపు ఉంది. కథను పాఠకునికి విసుగు కలిగించకుండా నడిపించగల శైలి ఉంది. మధ్యతరగతి కుటుంబాలలోని సహజ వైరుధ్యాల పట్ల ఆకళింపు ఉంది. మనుషుల లోపాల మీద ఒక సాహితీవేత్తకు ఉండవలసిన సానుభూతి ఉంది. కాగా కథల్లో పాత్రల ద్వారా సన్నివేశ కల్పన ద్వారా చదువరికి చేరవలసిన అంశాలు రచయిత వివరిస్తాడు. రచయిత జోక్యం కథలో ఉండవలసిన దానికంటే కొంత ఎక్కువ కనిపిస్తుంది అక్కడక్కడా. రచయిత కాలాన్ని, సమయాన్ని, వాతావరణాన్ని కూడా చిత్రిస్తే కథలకు మరింత బిగువు వచ్చేది.
ఇందులో సంసారం లాంటి హాస్య స్ఫోరకమైన కథలు గిలిగింతలు పెడతాయి. బి.ఫై.యంకి ఈయన చెప్పిన మాట ‘్భమి చిన్న నది మింగేద్దాం.’ మనకు వద్దన్నా నవ్వు తెప్పిస్తుంది. ఈ రచయిత కవి కూడా కాబట్టి కవితా వాక్యాలు మెరుస్తూ తగులుతుంటాయి.
పదోక్లాస్‌లోనే రమాసుందరి చదువుకు గుంట పెట్టి గంట వాయించడం జరిగిపోయింది. (సంసారం)
విశాలంగా పరచుకున్న ఇసుక దిబ్బల నడుమ పాపిడి తీసినట్టుగా పారుతుంది గోదావరి. (అవ్యక్తం)
ఇంటికి ఆసుపత్రికి నడుమ నలిగిపోయిన చీపురు పుల్లయింది వారిజ (ద్రుక్కోణం)
గంగా ప్రవాహంతో పోటీ పడుతుంది అన్నపూర్ణమ్మ వాక్ప్రవాహం (గయా శ్రాద్ధం)
సత్తిగాడు కనపడని దినం పొద్దు పొడవని కిందికే (అభిమానం) ఇలాంటి వాక్యాలెన్నైనా ఉదహరించవచ్చు.
కథలో పాఠకులకు మరింత సౌకర్యంగా ఉన్న విషయం రచయిత నేరుగా ఏ సిద్ధాంత ప్రతిపాదన చేయకపోవడం. ఒకటి రెండు విషయాలు మినహా ఇంత సరళ సుందరమైన కథలు అందించిన రచయిత అభినందనీయుడు. కాత్యాయని విద్మహే గారన్నట్టు ఆయన తెలంగాణ సామాజిక జీవితాన్ని కూడా కథనం చేస్తే మరింత బాగుంటుంది.

-డా.కాంచనపల్లి 9676096614