పఠనీయం

మార్మికత ఆయన కవిత్వ లక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవనయానం (కవితా/కథాసమాహారం)
రచయిత: డా. ప్యారక కృష్ణమాచారి, వెల:రూ.100/-, పేజీలు:183, ప్రతులకు: రచయిత, ఇంటి.నెం.10-185, గాయత్రి హోమ్స్, గాయత్రినగర్, కర్మన్‌ఘాట్, హైదరాబాద్-500079
*
పి.కృష్ణమాచార్యులుచే రచించబడిన ‘జీవనయానం’ కవితా / కథా సమాహారం- తాను కాచి వడపోసిన జీవితసారం అనిపిస్తుంది పాఠకలోకానికి. ఈ గ్రంథం భాషా పరిమళాల సుగంధం. అయితే అచ్చంగా ఈ గ్రంథంలో ఆచార్యులుగారు కేవలం కవితలే వ్రాయలేదు. 27 కవితలతోపాటు, ఉగాది పేరును ప్రస్తావిస్తూ విభన - శుక్ల - ప్రమోదూత-ప్రజోత్పత్తి -విరోధి -ఖర నామ-నందన - మన్మథ -దుర్ముఖి -హేవళంబి-విళంబి -ఆనంద -దుర్మంతి - రుధిరోద్గారి వంటి నూతన సంవత్సర ప్రారంభంలో తాను చెప్పిన కవితల్ని చేర్చడం విశేషం. అదీగాక ఇందులో ఒక భాగంగా గుండెపోటు పరామర్శ కొన్ని వారినుద్దేశించి కొన్ని మినీ కవితలూ చెప్పారు. వారేది వ్రాసినా సహేతుకంగా కవితాలత మునుముందుకు సాగిపోతుంది.
కవిత్వంలోని మార్మికత ఆయనకు బాగా వొంటపట్టిన కవిత్వ లక్షణం. అదీగాక ఆయన కొన్ని కొత్త పంథాలో అభివ్యక్తి ధోరణులను ప్రదర్శించారు. వాటి పేరు చిత్రంగా ‘చిటుకులు’ అని నామకరణం గావించారు. మనం ఇప్పటివరకు కవిత్వంలో వైవిధ్యంగల నానీలు, మామీలు, ఎలనాగలు, హైకూలు ఇంకా బోలెడన్ని కొత్త పరంపరను చదివాం. జీర్ణించుకున్నాం! కృష్ణమాచారిగారు తమ చిటుకుల్ని బెల్లంతో కూడిన అటుకులుగా చేర్చి వాటి వైవిధ్యం, అంతిమప్రాసలు, చలోక్తులు, చురకలు కూడా కలగలపడం మూలంగా అవి చదువుతున్నంతసేపు వారెంత చమత్కారులో అర్థం అవుతుంది. చిటుకుల్లో రాజకీయం గురించి ప్రస్తావిస్తూ ఆయన ‘ప్రత్యర్థిని చూస్తుంటే కల్గుతున్న కోపం / తనని ఓడించాడనే కుములుతున్న తాపం’- ఇంకోదానిలో ‘నోటికెంతొస్తే అంత వాగే కూతల /విలేఖరులు మసాలా జోడించి రాతలు’. మరో చిటుకును పరిశీలిద్దాం. ‘వేగంగా పరిగెడుతోంది కోర్కెల జట్కా / దీన్ని సాధించడానికి సారించాడో చిట్కా’. కవితాత్మకమైన ప్రక్రియలన్నింటిలో వీరికి అభినివేశం ఉందడానికి వైవిధ్యమైన వచన కవితలు, గుండెపోటు మినీ కవితలు, నూతన వత్సరాల్ని ఆహ్వానిస్తూ చెప్పిన కవితలు, చిటుకులు-అన్నీ రసభరితంగానే ఉన్నాయి. జీవన సంధ్య కవితలో ఒక చోట- మీద పడే వార్థక్యం గురించి పకపకమని నవ్వుతూ వెక్కిరిస్తాయి ఊడుతున్న దంతాలు అని. వసంతం గురించి, మానవత్వం గురించి, గార్హస్థ్య జీవితంలోని మాధుర్యం గురించి, డబ్బు గురించి కొన్ని ఆలోచానత్మకమైన కవితలు లయాత్మకంగా సాగాయి. ఇంకా నేడు చదువు గురించి సరస్వతిదేవి గురించి ‘నన్ను నడివీధిలో నిలబెట్టకండి /నా పరువు తీయకండి /నన్ను వ్యాపారంగా మార్చకండి...’ అంటూ ఎలుగెత్తి చాటారు.
గ్రంథకర్తగా పుస్తకం చివరి భాగంలో క్రాంతికుమార్‌గా కలం పేరు ధరించిన ఆచార్యులుగారు ఐదు కథల్ని ఈ సంపుటిలో చేర్చడం జరిగింది. ఇవి ‘శత చిత్ర ప్రేక్షకశ్రీ’ కథైతే నేటి సిన్మాలపై ఒక సెటైర్‌గా వ్రాయబడింది. దీనిలో నేటి చలన చిత్రాలపై కొన్ని చురకలు, ప్రేక్షకుల అభిరుచులు వగైరాలకు అనుగుణంగా సాగుతుంది. రెండో కథ మనం నిత్య జీవితంలో ఉపయోగించే నానుడి ధైర్యే సాహసే లక్ష్మి అన్న దాన్ని ఆ పేరుతో కాకుండా వీరు ‘్ధర్యే సాహసే.. సమయస్ఫూర్తే’ అనే కొసమెరుపుతో వ్రాసినది. ఈనాడు కిడ్నాపవుతున్న యువతుల తాలూకు యదార్థ సంఘటనకు అక్షరరూపం ఇస్తూ వ్రాసినది. దీనిలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి, బొంబాయిలో జరిగే చీకటి వ్యాపారం వగైరాలు చక్కగా చిత్రించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ కథలో స్నిగ్థ పాత్ర చక్కగా మలిచారు కథకులు. మూడో కథ ‘ఇల్లాలే’. ఇది సంసార పురాణంగా అనిపించినా, మనిషి దారి తప్పితే పడే వ్యధ చక్కగా చిత్రించారు. నాలుగో కథ ‘అర్పణ’-ఇది దేశభక్తికి సంబంధించిన చక్కని త్యాగం తాలూకు కథ. ఐదో కథ ‘రంభా సాంబార్’. ఇవన్నీ చదువదగ్గవి, ఉత్కంఠభరితాలు.

-డా మంతెన