పఠనీయం

2017 ప్రాతినిధ్య కధలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా కధలు 2017
సంకలనకర్త: సి.హెచ్.శివరామప్రసాద్, వెల:రూ.99/-, ప్రతులకు: ఉభయ రాష్ట్రాల్లోని
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
*
ఒక అంచనా ప్రకారం ఏటా తెలుగులో మూడు వేల కథలు వివిధ పత్రికలలో వెలువడుతున్నాయట! ఈ ఉరుకుల పరుగల కాలంలో ఒక సాహిత్య ప్రియుడు ఇవన్నీ చదవటం, వాటిలో గొప్ప కధలు అనబడినవీ, అలా అనిపించుకోబడినవి వేరు చేసి భద్రపచరుకోవటం తలకు మించిన పని.
ఇట్టి అసాధ్యమైన పనిని కొంతలో కొంతగానైనా సుసాధ్యం చేయటడానికి కొందరు ఔత్సాహిక సంపాదకులు- వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ (కధ), ముసునూరు ప్రమీల, సామాన్య (ప్రాతినిధ్య కధ), సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీ్ధర్, స్కైబాబా (తెలంగాణ కత) ప్రభృతులు వార్షిక సంకలనాలుగా ఆ ఏటి కధలను అందిస్తున్నారు. ఈ కోవకు చెందినదే సంకలన కర్త శ్రీ సిహెచ్.శివరామ్‌ప్రసాద్ గత ఆరేళ్ళనుండి వెలువరిస్తున్న ‘మా కధలు’. వాణిశ్రీ కలం పేరుతో సుపరిచితులైన వీరి ఆధ్వర్యంలో ‘తెలుగు కధా రచయితల వేదిక’ ఈ సత్కార్యానికి పూనుకున్నది. ప్రస్తుత సంకలనం ‘మా కధలు 2017’ సెప్టెంబర్ 2018లో వెలువడింది. ఇందులో లబ్దప్రతిష్టులైన 43 మంది రచయితల(త్రు)ల కధలు చోటుచేసుకున్నాయి. సంకలనంలో విహారి (జె.ఎస్.మూర్తి) లాంటి సీనియర్ మోస్ట్ కధకులనుండి ఇప్పుడిప్పుడే రాసి వెలుగులోకి వస్తున్న కధకులు దాకా ఉండటం విశేషం. ప్రకాశకులు మరొక కొత్త ప్రయోగాన్ని తలపెట్టారు. అదేంటంటే -పాఠకులు తమకు నచ్చిన కధకు 2018 సంచిక ఆవిష్కరణ సమయాన ఆ కధారచయితకు బహుమతి ఇవ్వవచ్చును. సంకలనాన్ని నిశితంగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అవుతాయి. సంకలనంలో ఎనమండుగురు రచయిత్రుల (19 శాతము) కధలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు రచయితలు తప్ప మిగతా రచయితలు అందరూ ఏభై ఏళ్ళకు పైబడినవారు. సింహభాగం విశ్రాంత జీవనం గడుపుతున్నవారు. రెండు కధలు (పెళ్లిచూపుల ప్రహసనం, సరదా పందెం) హాస్యరస ప్రధానమైనవి.
ప్రేమ, పెళ్లిచూపులు సంసారంలోని సరిగమలు, పిల్లలు వారి పెంపకం ఉద్యోగం అందులోని సాధక బాధకాలు- ఎక్కువ కధల్లో కధావస్తువులయ్యాయి. వయసు పైబడుతున్న తల్లిదండ్రులు వారికొరకు స్థాపించబడుతోన్న వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు, నేటి యాంత్రిక జీవితానికి అద్దం పడుతాయి. ఎవరెంత నిరసించినా, వీటి అవసరం కాలక్రమేణా పెరుగుతూ ఉండటం ఎవరూ కాదనలేని సత్యం. ఈ రోజు మనల్ని శాసిస్తున్నవి ఆర్థిక సంబంధాలు. మానవ సంబంధాలకు రెండో ప్రాధాన్యత ఇవ్వబడుతోందని తెలుపుతారుూ కథలు. వణికించే చలికి తట్టుకోలేక చనిపోయిన భార్య శవపేటికపై మూతను గుడిసె తలుపుగా వాడుకోవలసి వస్తుంది శిథిల జీవి (కాండ్రేగుల శ్రీనివాసరావు) కథలో. అనాధశవం అని నిరసించిన ఆ పార్థివ శరీరం ఓ సంపన్న కుటుంబీకుడిదని తెలియగానే శవానికి ఎక్కడలేని ఆదరణ గౌరవం దొరుకుతుంది తమ తమ నెలవుల్దప్పిన.. (కూర చిదంబరం).
ఫేసుబుక్కులు, వాట్సప్‌లు మన జీవితాల్లోకి గాఢంగా చొచ్చుకుపోయిన ఈ కాలం కథ సోల్‌మేట్ (ప్రభాకర్ జైనీ), మాతృభాషమీది మమకారం వదలొద్దని చెప్పే ఇక్కడ నేను ఎక్కడో వాడు (పి.వి.ఆర్.శివకుమార్), మాతృత్వపు మమత బాధ్యతలు దూరమవుతున్నాయని మనిషికంటే జంతువులే నయమవుతున్నాయని ఆవేదన చెందే మరో అమ్మ కథ (తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం), బాల్యస్మృతుల్ని అతి సహజంగా చిత్రీకరించిన డాటర్ ఆఫ్ ప్లవంగాచారి (కూతుతురు రాంరెడ్డి), దీనత్వంలో వున్నవారిని ఆదుకుంటే దైవత్వం అని చెప్పే దైవము ఎక్కడైనా!
ఒక్కమాటలో చెప్పాలంటే-ఈ కధల్లో పాఠకుడు ప్రపంచాన్ని, మారుతున్న విలువల్ని మారకుండా శాశ్వతంగా ఉండాల్సిన మానవత్వాన్ని హైలైట్ చేసి చూపే కథలివి.
2017లో వివిధ పత్రికలలో ప్రచురించబడిన కథలలో మేలైనవి (ఆయా రచయితల దృష్టిలో) అనుకున్న కధలివి. తెలుగు కథానికకు వేగుచుక్క అనబడిన శ్రీ వేదగిరి రాంబాబు (స్వర్గీయ) గారి స్మృతిలో వెలువడిన ఈ ‘మా కధలు 2017)ల సంకలనంలో అక్కడక్కడా బాక్సులు కట్టి వెలువరించిన ‘మంచిమాట’లు రసస్ఫోరకంగా ఉన్నాయి.

-కూర చిదంబరం