పఠనీయం

కమ్ర కథన శిల్పశ్రీ షణ్ముఖశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆకాశవర్షిణి’
-షణ్ముఖశ్రీ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
‘తట్టిన కథను తలపులోనే బిగబట్టటం కంటే తలభారం మరోటి ఉండదు (్దళూళ జఒ శ్య ళ్ఘఆళూ ఘ్యశక ఆ్ద్ఘశ ఇళ్ఘూజశ ఘశ ఖశఆ్యజూ ఒఆ్యక జశఒజజూళ క్యఖ)’ అంటుంధి ప్రసిద్ధ అమెరికా కవయిత్రి మాయా ఏంజెలో. ఈ వాస్తవం షణ్ముఖశ్రీకి సరిగ్గా సరిపోతుంది.
మరి కాకపోతే భార్యా వియోగం; అది జరిగిన సంవత్సరానికే పుత్ర వియోగం; ఆ తరువాత సోదరీ కాలధర్మం. - ఇలా బండల్లాంటి, కొండల్లాంటి దుర్భర దురంత కష్టాల్లోను, శారీరక అర్భకత్వపు చికాకు నిరంతర సమస్యగా ఉంటున్నా కూడాను తన మది గనిలోని మంచి మంచి కథల మాణిక్యాలను, సరస సాహిత్య స్ఫటికాలను కథాప్రియులకు సుధామధుర కథన శైలీ తళత్తళలతో హృదయంగమంగా అందిస్తున్నాడంటే అది షణ్ముఖశ్రీకి ఉన్న సద్యో రచనా శిల్పప్రతిభ కాక మరేమిటి? అతనిలో వున్న ఆ అనల్ప ‘అక్షర’ శిల్పం’ అతనిలోని విషాదానికి పోటీగా నిలువెత్తుగా నిలబడి ఒక విలక్షణమైన సారస హాస్యాత్మికమైన భగవత్తత్త్వపు పార్శ్వంగా, ఒక నిర్మల నిశ్చల జ్యోతిలాగా కనిపిస్తుంది. అదే అతను తన పుస్తక పాఠకులకు, బంధుమిత్రులకు, పరిచితులకూ ఇచ్చే ఆచరణ క్రియాపూర్వక ఉదాత్త సహన గంభీరతా సమతుల్యతా తాత్త్విక సందేశం. హ్ఘఆఒ యచిచి ఆ్య దజఒ ఖశతీజఆ్దజ్ఘూతీశ ఒ్ఘజశఆక జచిళ (అగ్రహీత సన్యాస జీవితం)!
షణ్ముఖశ్రీ కథలు ముచ్చటగాను, అశ్లీలతా రహితాలుగాను, సరస వినోద సహితాలుగాను, పరోక్ష సందేశ విహితాలుగాను సందీపిస్తూ ఉంటాయి. సగటు మనిషిలోని ‘సగపు శరీరం’ అయిన సతీమణిలాగా గిలిగింతలు పెడుతుంటాయి చాలా కథలు.
కథాసూత్ర బల విశేషంకన్నా కళకళలాడే సంభాషణా చమత్కారాలు, పదాల మార్పులు, విరుపులు, నవ్యాతినవ్య పదబంధాలు, వ్యక్తీకరణ - ఉచ్చారణలలో ట్విస్టులు, ప్రాస విన్యాస విలాసాలు, కథాగమనంలో అనుకోని మార్పులు పాఠకుడిని ప్రముఖంగాను, ప్రబలంగాను ఆకట్టుకుంటాయి.
తన ‘వుల్ఫ్ హాల్’ లాంటి నవలల రచనలకు రెండుసార్లు ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డును సాధించిన, బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత్రి హిలరీ మ్యాంటెల్ అంటుంది ఒకచోట ‘వాస్తవికత ఉన్నవి, వాస్తవికత లేనివి అని కథలు రెండు రకాలు. కానీ కథలన్నీ ప్రక్రియా సుందరాలే.. (...ఒ్యౄళ యచి ఆ్దళఒళ ఆ్దజశఒ ఘూళ ఆఖళ ఘశజూ ఒ్యౄళ యఛి ఆ్దళౄ జళఒ. ఱఖఆ ఆ్దళక ఘూళ ఘ య్యజూ ఒఆ్యజళఒ) అని. కథ అనే దాని మీద ఇలా హిలరీ మ్యాంటెల్‌కు ఉన్న దృక్కోణంలో కూడా షణ్ముఖశ్రీ ‘ఆకాశవర్షిణి’లోని అన్ని కథలూ మంచి కథలే.
‘ఈగోల గోల - ఈశ్వరలీల7 కథ సంభాషణల్లోను, సంవిధానంలోను చక్కని హాస్యాన్ని పండిస్తూ, ఉపన్యాస విన్యాస విలాస వక్తలకన్న సేవాభావ కార్యకర్తలు మిన్న అన్న ఉదాత్త నీతి సందేశంతో ముగిసే కథ. దేవతార్చన సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు ‘్భర్తవర్షే భర్తఖండే’ అన్నారట ఒకరు. పూజను తొందరగా ముగించే సంకల్పం వలన సంకల్పం అలా ‘మారిపోయింది’ట. ఇది మంచి హాస్యానికి ఒక మచ్చుతునక.
‘కార్యేషు రంభ - శయనేషు రొంప’ కథ ముగింపు బాగుంది. కథనం అంతా ఉత్కంఠారోహణ క్రమంలో (ద్ఘిఔ్దజషగా) సాగిపోయింది. మొదటి వాక్యం నుంచే హాస్య ‘రసధ్వని’ హ్లాదదం.
‘శీఘ్ర మేవ కల్యాణ ప్రాప్తి రద్దు’ కథ నేటి కాలపు అబ్బాయిలకు, అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదుర్చుకోవటం ఒకప్పుడు ‘జ్యోతి’ మాసపత్రికలో శ్రీశ్రీ నిర్వహించిన పజిల్ ‘పద బంధ ప్రహేళిక’ను పరిష్కరించటం కంటే ఎంత కష్టమో విశదపరుస్తూ సహజతా సుందరతా సమన్వితంగా ఉంది. ఈ కథలో మ్యారేజ్ బ్యూరో టేబుళ్ల ముందు వధూవర వివరానే్వషులైన తండ్రులు ‘ఏవో కొన్ని గుర్తు పెట్టుకొని రాసుకుంటున్నారు పిహెచ్.డి చేసేవాళ్లు లైబ్రరీకి వెళ్లి ప్రముఖ గ్రంథాలు చదివి అందులోని విషయాలు రాసుకుంటున్న వారిలా’ అన్న ఉపమా వాక్యంలోని ‘అలంకార’, లలిత హాస్య ధ్వనులు సరస హృదయైక సంవేద్యాలు. ఈ కాలంలో దేవుడు కూడా పెళ్లి సంబంధాలు చూడలేక (చూసుకోలేక) తన కల్యాణం తనే చేసుకుంటున్నాడు అంటూ ఒక జోక్‌తో ‘పేలుతుంది’ కథ చివరకు.
‘చతార్వాలు - చంపసర్వరాలు’ కథ చాలా బాగా నవ్విస్తుంది.
‘తిండితులు’ కథ చక్కని సందేశాత్మక కథ. ‘ఆకలికి కావలసింది ఆహారం కానీ ధనాగారం కాదు’ సంతృప్తికి మించిన సంపత్తి లేదు అన్న సందేశాలతో, శాంత రసంతో ముగుస్తుంది కథ షణ్ముఖశ్రీ ప్రశాంత ప్రసన్న వదనంలాగా.
‘ఆకాశవర్షిణి’లోని తొమ్మిది కథలకు కథకుడు ముందే ఆలోచించి పెట్టుకున్న తొమ్మిది శీర్షికలు ‘నవ’ (హాస్య)రత్నాలు. ముందే కథ పేరు అనుకొని తరువాత తదనుగుణంగా కథ అల్లి చెప్పటం షణ్ముఖశ్రీ విశిష్ట కథనా శిల్పశ్రీకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం