పఠనీయం

వేంకటేశ్వర సాహిత్య అక్షరాల వీడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు
(14-17 శతాబ్దాలు);
రచయిత:డాక్టర్ కె.వి.రాఘవాచార్య;
పుటలు:488, వెల:రూ.150/-,
ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు,
తిరుపతి.
*
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి
విశ్వంలో తిరుమలకు సాటియైన చోటు ఏ ఒక్కటీ లేదు. వేంకటేశ్వరునికి సమానమైన దేవుడు లేడు; ఇక ముందు ఉండడు అంటుంది స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం (వేంకటాచల మహాత్మ్యంలో). అలాంటి ఆ ప్రభువును తెలుగువాళ్ళు ‘వెంకన్నస్వామి’ అంటూను, తమిళాది దక్షిణ ప్రాంతాలవాళ్ళు ‘తిరువెంగళప్పా’ అంటూను, ఔత్తరాహికులు ‘బాలాజీ’ అంటూను పిలుచుకున్నా, ఆపన్నులకు, ఆర్తులకు అడిగినదే తడవుగా చేయూతనిచ్చి చేదుకునే కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటపతి.
ఆ స్వామిని గూర్చిన సాహిత్య సర్వస్వం- 4వ సంపుటం ఇటీవలే తిరమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించి విడుదల చేశారు. పుస్తకం పేరు ‘ప్రాచీనాంధ్ర సాహిత్యంలో వేంకటేశ్వరుడు (14-17 శతాబ్దాలు). ఈ పుస్తక రూపకల్పనలో రచయిత డాక్టర్ కె.వి.రాఘవాచార్య సలిపిన బృహత్ పరిశోధనా కృషి అద్భుతం; పడ్డ శ్రమ ఆదర్శాత్మకంగా అభినందనీయం, చూపిన శ్రద్ధ అనంత స్ఫూర్తిదాయకం.
ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం, క్రీ.శ.రెండవ శతాబ్దం నాటి తమిళ ఇతిహాసం ‘శిలప్పదిగారం’, స్కాంద, వాయు, వామనాది అష్టాదశ పురాణాలు, హరివంశాది గ్రంథాలు, వేంకటాచల మహాత్మ్యాది స్థల తీర్థ పురాణాలు లెక్కకు మిక్కిలిగా గావించారు. అసలు బాలాజీ ప్రస్తావన ఎక్కడ ఎపుడు ఎలా ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవటానికి రచయిత.
చివరకు సారాంశప్రాయంగా క్రీ.శ.1417-1491 మధ్య పసిండి వేంకటత్తు రైవరు అనే అర్చకస్వామి ‘తిరువేంకట మహాత్మ్యం’ అనే పేరున వేంకటేశ్వరస్వామి చరిత్రను సమగ్ర గ్రంథంగా రాశాడు అని, పనె్నండు పురాణాలలో కొంత కొంతగానే కనిపిస్తున్న వివరాలు, వర్ణనలు, చంద్రగిరి-మంగాపురం దగ్గరి 22-3-1540వ తేదీ నాటి అన్నమాచార్యుల మనుమడు పెద తిరుమలాచార్యులు వేయించిన శాసనము, 27-6-1541 నాడు పసిండి వేంకటత్తు రైవరు తిరుమలలో వేయించిన శాసనములు ఆధారంగా ఆ భక్త కవి వెంకన్న స్వామి చరిత్రను విపులంగా రచించాడు అని,
అదే ఇప్పటివరకు మనకు సాహిత్య చరిత్రలో దొరికిన తిరుమల ప్రభువు యొక్క సంపూర్ణ గ్రంథము అని, శాసన, చారిత్రక ఆధారములను బట్టి వేంకటాచల మహాత్మ్యం గురించి సమగ్ర చరిత్రగల పురాణ గ్రంథం తెలుగులో క్రీ.శ.15వ శతాబ్దానికి ముందు రచింపబడలేదని ధృవపడుతున్నదని రాఘవాచార్యగారు తేల్చి చెప్పారు.
ఇది వారి పరిశోధనా దీక్షాగ్రతను, నిశిత దృష్టిని, నిర్విరామకృషి బృహత్తరతను తెలియజేస్తోంది.
ఎఱ్ఱన నృసింహపురాణం, కృష్ణమాచార్య కవి సింహగిరి వచనాలు, శ్రీనాథుని హరవిలాసం, కాశీఖండం ఇత్యాదులు మొదలుకొని గురుభాస్కరాచార్యులవారి వైశ్యపురాణం వరకుగల 51 వేంకటేశ్వరస్వామి ప్రస్తావిత గ్రంథాలను, ఆముక్తమాల్యద మొదలుకొని ‘గుర్రంకొండ భక్తవత్సలుడు’ రాసిన కాటమరాజు చరిత్ర వరకుగల 25 అంకిత కావ్యాలను, తాళ్ళపాక కవి సుభద్రా కల్యాణం మొదలుకొని అన్నమాచార్య వేలకొలది కీర్తనలు, అణ్ణన్‌స్వామి కృత ప్రసిద్ధ వేంకటేశ్వర సుప్రభారతం మొదలుగాల నలభై ప్రాస్తావిక గ్రంథాలను ఆయా అంశాల అవసరాన్ని బట్టి పలుచోట్ల ఉదాహరించారు. ఇంత విస్తృత అధ్యయనం నిజంగా ఒక భగీరథ సఫలకృషి.ఇది స్థల పురాణ చారిత్రార్థక గ్రంథమైనా కూడా ఒక సాహితీ ప్రియుడుగా రాఘవాచార్యగారు కమ్ర కవిత్వ సస్త్వాకర్షణ్మాక పద్యాలను కూడా అక్కడక్కడ
ఉదాహరించారు.-

- ఇంకా ఉంది

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం