పఠనీయం

ఆధ్యాత్మికత - తులనాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిసీ ఒకటే, తెలియకా ఒకటే-
వ్యాస సంకలనం-
రచన:నీలంరాజు లక్ష్మీప్రసాద్,
వెల:రూ.80/-,
ప్రతులకు:
నవోదయా బుక్ హౌస్,
ఆర్య సమాజ్ మందిర్ ఎదురువీధి,
కాచీగూడ, హైదరాబాద్-27.
*
‘‘భారతదేశం వేదభూమి. ఎందరో మహర్షులు జన్మించిన పుణ్యభూమి. హరిశ్చంద్రుడు, ధర్మరాజు వంటి సత్యవ్రతులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు జన్మించి, ఉత్తమ సంస్కృతికి వారసులై ఆదర్శంగా నిలిచారు. కాలం గడిచినకొద్దీ చిత్తశుద్ధి నశించి, సిద్ధాంతాల ఆచరణ మాత్రం మిగిలిపోయింది. విశ్వాసం, జీవించే తీరు - దేనికదే అన్నట్లుంది’’.
‘‘్భరతదేశంలో ఒక మసీదు కూల్చినందుకు ప్రతిక్రియగా, హిందూ దేవాలయాలను ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ అక్కడక్కడా ధ్వంసం చేసారు. పిల్లలు పిల్లలు బీచి ఒడ్డున తగాదాపడి అంతకుముందు తాము ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఇసుకగూళ్ళను నేలమట్టం చేసి వాటిమీద చిందులు తొక్కినట్లు కనిపిస్తుంది’’.
‘‘ఆధ్యాత్మికత అంటే, మహిమలు, అద్భుతాలు అనుకోవటం మన దురదృష్టంగా భావించాలి. ఆధ్యాత్మికత నుండి ఉత్పన్నమయ్యే ఈ ‘బైప్రొడక్టు’ను పట్టుకుని అసలు ‘ప్రాడక్టు’ అయిన జీవితావగాహనను విస్మరిస్తున్నాము. భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య అడుగంటటానికి ఈ మాజిక్ పురుషులే మూలం.. ఈ కుహనా గురువులే కారణం!
ఆణిముత్యాల్లాంటి ఇలాంటి జీవిత సత్యాలను, నేటి మన దేశపు తీరుతెన్నులను, పోకడలను నిర్మొహమాటంగా, సూటిగా ఎండగడుతున్నారు శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్‌గారు తన ‘తెలిసీ ఒకటే, తెలియకా ఒకటే’ వ్యాస సంకలనంలో.
ఈ సంకలన రచయిత తన ఆధ్యాత్మిక వ్యాసాల ద్వారా తెలుగు పాఠకులకు చిరపరిచితులు. రమణ మహర్షి గారిని, మరియు జిడ్డు కృష్ణమూర్తిగారిని వీరు తెలుగువారికి పరిచయం చేసిన తీరు చిరస్మరణీయము మరియు అతి రమణీయమూను.
ప్రస్తుత గ్రంథంలో 37 అధ్యాయాల్లో ఆధ్యాత్మికమే కాదు; ప్రాపంచిక విషయాలను కూడా, తనదైన బాణీలో వివరించారు. తను చువుకునే రోజుల్లోనూ ర్యాగింగ్ ఉందంటూ ఫ్రెషర్స్‌ని ఆట పట్టించారే కాని ఏడ్పించలేదు (పే.33) అంటూ, అందరూ కలిసి నవ్వుకునే నాగరిక హాస్యం ఉండేది కాని, ఆత్మన్యూనతకు, ఆత్మహత్యలకు పాల్పడేంత వికృతంగా ఉండేది కాదు అంటారు.
‘ప్రార్థన - ధ్యాdనం’అనే అధ్యాయంలో ఈ రెంటికి తేడా విడమర్చుతారు. భారతదేశంలోని అతి పేదవాడైన గాంధీజీ గారి ‘సింపుల్ లైఫ్’కు అవసరమైన ఖర్జూరాలు, కమలా ఫలాలు, మేకపాలు సేకరించటానికి ఆయనకు ఆతిథ్యమిచ్చిన బిర్లా ఎంత యాతన పడేవాడో వివరిస్తాడు. అక్కడక్కడ బ్రాకెట్టు కట్టి చెప్పిన చిరు సంగతులు కూడా అధ్యాయంలో వివరించిన విశేషాలకు తీసిపోకుండా ఉన్నాయి.
మంచిని ఎక్కడున్నా మనఃస్ఫూర్తిగా స్వీకరించు అంటూ హిందూ ఆధ్యాత్మికతనే కాకుండా, అవిభక్త భారతదేశపు సింధ్ రాష్ట్రం (నేటి పాకిస్తాన్‌లో భాగం)లో జీవించిన షా అబ్దుల్ లతీఫ్ అనే పద్దెనిమిదవ శతాబ్దపు మహనీయుడిని కూడా మనకు పరియం చేశారు లక్ష్మీప్రసాద్‌గారు.
ఎన్నో అధ్యాయాల్లో నాటినీ నేటినీ పోలుస్తూ ‘నేటి భారతంలో తత్త్వ విచారణ తగ్గిపోయింది. మతాభినివేశం మాత్రం పెరుగుతున్నది’ అని తన విచారం ప్రకటించటం నవ భారత నిర్మాతలమైన మనం అందరం సీరియస్‌గా ఆలోచించాల్సి వుంది.

-కూర చిదంబరం 8639338675