పఠనీయం

జీవనయానంలో రసాయనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.చాగంటి కృష్ణకుమారి గారు తెలంగాణ అకాడెమీ ఆఫ్ సైనె్సస్ కోసం 2017లో
రచించిన 130 పుటల పుస్తకం
*
ఈ పుస్తకం చదవాలని రెండు నెలల క్రితం చాగంటి కృష్ణకుమారిగారు పంపారు. వారు సాటి సైన్స్ రచయిత్రి, కథకులు చాగంటి సోమయాజులు గారి కుమార్తె. పుస్తకం అందుకుని తిరగేయగానే మూడు కారణాలతో ఎక్కడో ఒకచోట దీని గురించి ప్రస్తావించాలని భావించాను. దాని ఫలితమే ఈ చిరువ్యాసం. తెలంగాణ సైన్స్ అకాడెమీ ఎంతో కొంత కృషి ప్రారంభించి, అందమైన పుస్తకం తెచ్చిందని తెలియజేయాలి కనుకనూ. బహుశా ఇదే వారి తొలి ప్రచురణ అయినట్టుంది. ఇతర పుస్తకాల వివరాలు లేవు. చక్కని, ఆసక్తికరమైన వ్యక్తీకరణతో కృష్ణకుమారి గారు సైన్స్ రాస్తారు. ఆ విషయం గురించి కూడా అభినందించాలి. ఈ పుస్తకంలోని తొలి నాలుగు వ్యాసాలకు నామకరణం నేనే చేశాను. 2012లో ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం కోసం ప్రసంగ వస్తువు చర్చించాక శీర్షికలు ఇచ్చి వారిని ఆహ్వానించాలి. తర్వాత కూడా మరికొన్ని ఆకాశవాణికి చేసిన ప్రసంగాలు ఇందులో ఉన్నాయి. ఈ మూడు కారణాలతో పాటు మరికొన్ని విషయాలు చెప్పుకోవాలి.
సరే, రచయిత్రిగారి నా మాటగా అంటూ రాసిన నేపథ్యం చదువుతుంటే ఎక్కడో చదివామనే అభిప్రాయం కల్గింది. పరికించి చూస్తే మేము సంకలనం చేసిన ‘సైన్స్ ఎందుకు రాస్తున్నాం’ కోసం వారు రాసిన దాన్ని మళ్లీ వాడుకోవడం మహదానందం కల్గించింది. మరి అంశాలు ఇలా కొనసాగుతాయి. ఆక్సిజన్ మనకి హాని కూడా చేస్తుందా? నోరూరించే సువాసనలు; సూక్ష్మజీవుల దాడికి ప్రతిదాడి; నీటికి నూనెకీ మధ్య సయోధ్య సాధ్యమా? ఆకట్టుకునే ఆహార రంజనాలు; తీపి పదార్థాల తీయందనాలు; మన ఆహార పదార్థాలలో ఆమ్లాలు; ఏ ఐస్‌క్రీంలు తిందాం; నూనెలంటే పడదు, నీరంటే గిట్టదు; మరకలు పడనీయని రసాయనం - ఇలా 18 వ్యాసాలు ఆసక్తి కల్గించడమే కాదు, పసందుగా చదివిస్తాయి. ఇవన్నీ కూడా నిత్య జీవిత విషయాలు కనుక ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. చెప్పిన శైలి బావుంది. కనుక మొత్తంగా పుస్తకం ఆకర్షణీయంగా ఉంది.
కొంతకాలం క్రితం దాకా తెలుగు పత్రికల ఆదివారం సంచికల కవర్ స్టోరీల్లో నెలకు రెండు సైన్స్ విషయాల మీద ఉండేవి. నిత్యం ఎంతో కొంత సైన్స్ సమాచారం ఉండేది. ఇప్పుడు పూర్తిగా విలాస దృష్టిని పెంపొందించే గాడ్జెట్ల సమాచారాన్ని సైన్స్‌గా పరిగణించమంటున్నారు. టెలివిజన్ వెయ్యి శాతం వినోద వ్యవహారం కనుక అందులో సైన్స్ వెతికినా కనపడదు. కనుక సైన్స్ కావాలంటే పుస్తకాలలో తప్ప మరో మార్గంలేదు.
1963లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడెమీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైన్స్ అకాడెమీ అయ్యింది. దేశంలోనే తొలి సైన్స్ అకాడెమీ అయిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడెమీ ఎన్నో మంచి ప్రచురణలు వెలువరించింది. 1980-83 ప్రాంతంలో కళాశాల లైబ్రరీలో సి.వి.రామన్ గురించి డా.సూరి భగవంతం రాసిన పుస్తకం నేను చదివాను. నేరుగా పరిచయం, సాన్నిహిత్యం ఉన్న శాస్తవ్రేత్త రాసిన జీవితచరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. తెలంగాణ సైన్స్ అకాడెమీ మరిన్ని పుస్తకాలు వెలువరించాలి. వెలువరించిన పుస్తకాలు పాఠకులను చేరాలి. అలాగే ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో సైన్స్ అకాడెమీ వంటిది బీజప్రాయంగా ఏర్పడింది. కార్యకలాపాలు చేసినట్టు, చేస్తున్నట్టు బోధ పడలేదు. తక్షణమే సైన్స్ రచయితలకు వర్క్‌షాపు నిర్వహించడంతో పాటు రాష్ట్రంతో ముడిపడి ఉన్న విషయాల వైజ్ఞానిక సంగతులను జనరంజకంగా తెలిపే పుస్తకాలు వెలువరించడానికి కృషి ప్రారంభించాలి. దీనికి కొంత ప్రణాళికా, పరిశోధనతోపాటు సామూహిక ప్రయత్నం అవసరం. ఇలాంటి ప్రయోగాలు త్వరలో కార్యరూపం దాలుస్తాయని ఆకాంక్ష.

-డా.నాగసూరి వేణుగోపాల్ 94407 32392