పఠనీయం

శివానందలహరి భావమకరందము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత:అనుమాండ్ల భమయ్య
వెల:రూ.100/-,
పేజీలు:130,
ప్రతులకు: ఎ.మస్వినీదేవి,
ఫ్లాట్ నెం.401, సాయి రాఘవేంద్ర రెసిడెన్సీ, స్వరూప్‌నగర్, రోడ్డునెం.5 ఉప్పల్,
హైదరాబాద్-39
మరియు నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్.
*
పూర్వ ఉపకులపతి టి.ఎస్. తెలుగు విశ్వవిద్యాలయము మరియు ప్రతిష్ఠాత్మక నోరి నరసింహశాస్ర్తీ పురస్కార గ్రహీత అయిన శ్రీ అనుమాండ్ల భూమయ్య రచించిన లేక వ్యాఖ్యానముగా (శివానందలహరి)కి చేసిన గ్రంథమిది.
శ్రీ శంకర భగవత్పాదులు రచించిన ఎన్నో ప్రసిద్ధ గ్రంథాలలో ‘శివానందలహరి’ ఒకటి. దీనికి ఎన్నో వ్యాఖ్యాన వివరణలు ఎంతోమంది పండితులు ఇంతకుముందు రచించారు. అయితే భూమయ్యగారు ఈ రచనకు ఎంచుకున్న తీరు భిన్నమైనది. శివానందలహరిలోని మొత్తం 100 శ్లోకాలను పదిపదిగా విభజించి పది రోజులలో ఈ కావ్యం గురించి తెలుసుకోవాలని వచ్చిన విద్యార్థికి తెలిపినట్లుగా కల్పన చేశారు. దీనికి కారణం విద్యార్థులకు పాఠం చెప్పిన అనుభవమే కారణమని ఆయనే చెప్పుకున్నారు (నామాటలో).
నూరు శ్లోకాల సారాంశాన్ని సంభాషణ రూపంలో విద్యార్థికి వివరిస్తూ, శ్లోకాల అంతరార్థాన్ని సులభగ్రాహ్యంగా బోధించటం ఆసక్తికరంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది అన్నారు డా వి.సీతాలక్ష్మీ భరద్వాజ తమ స్వీకృతిలో.
అయితే శ్లోకాల సారాంశాన్ని రచయిత వివరించిన తీరు ఆసక్తికరంగా వున్నది. ఉదాహరణకు 3వ శ్లోకం ‘త్రరుూవేద్యం’ అనేదానిలో ‘మ్’ సాగదీయగలిగితే కలిగే నాదం చెవికి ఇంపుగా వుంటుంది అన్నపుడు విద్యార్థి ఒక లైన్ కామెంటుగా ఉన్నది సార్’
అంటాడు. (పుట 20)
అలాగే శ్లోకం వివరిస్తున్నపుడు ఆయన ఉదహరించిన కథ బాగున్నది. స్మృతి శాస్త్రాదులను రాజులను మెప్పించటానికే వినియోగించనవసరం లేదని, కాపాడగలిగినవాడు శివుడే అని చెప్పారు (పుట 22).
అలా ఆయా శ్లోకాలను వివరిస్తున్నపుడు వాటికి అనుగుణంగా వున్న ఉపనిషత్తులను ఉదహరించారు. ఇది రచయిత ఉపనిషత్ పరిజ్ఞానానికి నిదర్శనం. కొన్ని పూర్వ రచనలను ఉదహరించారు. ఉదా శ్లోకం 9 మందకోపనిషత్తు, (పుట 20) పుట 45 కాళిదాసు చెప్పిన, 20వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని వెతుకుతూ దారితప్పడం (పుట 47), భగవద్గీతలో శ్లోకాలు (పుట 42)- ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.
ఇది నిజంగా భావమకరందమే. రచయిత భూమయ్యగారిని అభినందిస్తున్నాను. ప్రతి సాధకుడు చదువవలసిన గ్రంథమిది.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649