పఠనీయం

అరణ్యంపై చూపాల్సిన కారుణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరణ్యపర్వం
రచన: సలీం
వెల:రూ.120/-
ప్రతులకు:
జ్యోతివలబోజు,
ఫోన్:8096310140,
మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రేతలు.
*
మహారాష్టల్రో నాగపూర్ పట్టణానికి దగ్గరగా వున్న ‘కల్మేశ్వర్’ అడవిలో ‘పార్ది’ తెగ వారుంటారు. వీరు నిరక్షరాస్యులు. వేట వారి ఉపాధి. వేటాడటానికి ఏమీ దొరక్కపోతే కడుపు నింపుకోవటానికి మాత్రమే దొంగతనాలు చేస్తుంటారు. ఆంగ్లేయుల కాలంనుండే వీరు ‘నేరస్థులు’గా ముద్రవేయబడి హింసింపబడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినాక కూడా వీరి జీవితాలు ఏమీ మారలేదు. పులుల్లాంటి క్రూర జంతువులొకప్రక్క, స్వార్థపరులైన నాయకులు మరియు అటవీ శాఖ అధికారులు మరొకప్రక్క ‘పార్ది’తెగను వేటాడుతున్నారు.‘పార్ది’తెగకు చెందిన గుంజన్ (గుంజన్‌సింగ్) అతని భార్య, కూతురు శ్రద్ధ, మరి పాతిక పార్ది కుటుంబాలు, పులులు సంరక్షణ చట్టాలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య నడిచే నవల ఇది.
శ్రద్ధ తెలివితేటలుగల అమ్మాయి. చదువుకుంటున్నది. తన తండ్రి గుంజన్ పులుల్ని వేటాడటం, వాటి చర్మం, గోళ్లు, బొమికెలను అమ్మి సొమ్ము చేసుకోవడం శ్రద్ధకు నచ్చలేదు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి మార్గాలను ఎంచుకుని నడవాల్సిందిగా తండ్రిని బలవంతపెడుతూ ఉంటుంది.
మనిషి మాంసం రుచి మరిగి తరచూ పల్లెలమీద దాడి చేస్తున్న ఒకానొక పులిని చంపవలసిందిగా ప్రభుత్వం నుండి ఆర్డర్ వస్తుంది. గుంజన్ నాయకత్వంలో బయలుదేరిన ‘స్క్వాడ్’పైనే ఆ పులి దాడిచేస్తుంది. చిన్నతనంలో తాను వీరోచితంగా పోరాడి చంపిన పులి తాలూకు కవల పిల్లల్లో అది ఒకటి అని గుంజన్ గుర్తిస్తాడు.
కత్తితో పులిని గాయపరుస్తాడు. ఈ పోరాటంలో గుంజన్ తీవ్రంగా గాయపడి మరణిస్తాడు. మరింత పకడ్బందీగా రెండవసారి బయలుదేరిన స్క్వాడ్ కవలలో రెండవ పులిని చంపుతారు. గుంజన్ చేతిలో గాయపడ్డ మొదటి కవల రోజురోజుకీ బలహీనమైపోయి చావుకి దగ్గరపడుతుంది.
అంతరించిపోతున్న పులుల్ని చంపవద్దన్న ప్రభుత్వ ఉత్తరువుల్లోని డొల్లతనం, వంజారి అనే ప్రజా నాయకుడు ‘బాంగ్డియా’ అనే ఫారెస్ట్ చీఫ్ వార్డెన్‌కు ఇచ్చే వన్యప్రాణుల మాంసం విందుతో నవల ముస్తుంది.
నవల మొదటి సగభాగం, పులుల సంరక్షణ, పులి, దాని అలవాట్లు, ప్రవర్తన, ఆటవికుల జీవనాన్ని వివరిస్తే, రెండవ భాగం ‘నరభక్షి’గా మారిన పులిని చంపటం. అలా చంపటానికి అవసరమయ్యే ప్రభుత్వ పరమైన నిబంధనలు, గుంజన్ పులిని ఎదుర్కోవటం లాంటి వివరించబడ్డాయి. రెండవ సగం చదువుతూంటే, ‘జిం కార్బెట్’ అనే బ్రిటిష్ అధికారి, రచయిత రాసిన ‘ది మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమావూన్’ రచనను గుర్తుకుతెస్తుంది. 18 నవలలు, 200 కథలు, వచనకవిత్వం రాసి కేంద్ర సాహిత్య కాడమీ అవార్డు (అత్యుత్తమ సాహిత్య పురస్కారం) పొందిన రచయిత ‘సలీం’ కలం నుండి వెలువడిన నవల ఇది. పేద ముస్లింల జీవితాలు, సంస్కృతి ఆచారాలమధ్య నలుగుతున్న వారి దయనీయ స్థితిని బహుశా సలీంగారు తప్ప మరెవరూ రాయలేరు అనిపించే రచయిత, తన ప్రతిభను మరో భిన్నమైన విషయంమీద లోతైన పరిశోధనతో రాసిన నవల.
వన్యప్రాణి సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ అన్నవి సామాజిక బాధ్యతలు. ఈ బాధ్యతలను రచయిత ఎన్నో ఆసక్తికరమైన వివరాలు తెలియపరుస్తూ రాసిన నవల ఇది.

-కూర చిదంబరం 8639398675