పఠనీయం

పరిశోధాత్మక గ్రంథమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసీ కులాలు సంచార జాతులు
జూలూరు గౌరీశంకర్
వెల:రూ.175/-
అడుగుజాడలు పబ్లికేషన్స్,
ఎంఎస్‌కె టూర్స్,
ఫోర్త్ఫో్లర్, ఫ్లాట్ నెం.410,
రోడ్ నెం.11, హిమాయత్‌నగర్,
హైదరాబాద్.
*
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బడుగుల అభివృద్ధి బాటలో బీసీ, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకై 740 గురుకుల విద్యాలయాలను నెలకొల్పడం, ముఖ్యంగా సంచార జాతులు, వెనుకబడ్డ బీసీల సంక్షేమానికై ప్రత్యేకించి బిసి కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచి, మిత్రుడు, ప్రముఖ రచయిత, సాహితీవేత్త, సామాజికవేత్త బి.ఎస్.రాములును చైర్మన్‌గా నియమించడం ఒక శుభ పరిణామం. బీసీ జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏర్పరచిన బీసీ కమిషన్‌లో జూలూరు గౌరీశంకర్ ఒక విశిష్ట సభ్యులు. బీసీల హక్కుల కోసం, వారి సంక్షేమ మనుగడకోసం సాహిత్య సృష్టిచేసే కలం బలం గౌరీశంకర్‌గారిది.
కమిషన్ సభ్యులుగా నియమితులైన ఆయన క్షేత్ర స్థాయికి వెళ్లి వారి జీవన పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి క్రియాశీలక సభ్యులుగా ముఖ్యంగా బీసీ(ఇ) గ్రూపునకు చెందిన ముస్లింల జీవన విధానాన్నీ, వారి సామాజిక విద్యా విషయాల పురోగతినీ నిశితంగా పరిశీలించి అధ్యయనం చేశారు. నల్గొండ, ఖమ్మం పాత జిల్లాల్లో ప్రధానంగా పర్యటించి గౌరీశంకర్ ముస్లింల జీవితాలను, వాళ్ళ దుర్భర జీవన పరిస్థితులనూ నేరుగా చూశారు. బీసీ (ఇ)గ్రూపు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వీరి నివేదిక ఫలితమే!
క్షేత్ర స్థాయిలో సంచరిస్తూ జూలూరు గౌరీశంకర్‌గారు జనంతో మమేకమైనపుడు రాజుకున్న ఆలోచనల సంఘర్షణలకు అక్షరరూపం కల్పిస్తూ రాసిన వ్యాసాల సంకలనమే బీసీ కులాలు- సంచార జాతులు అన్న గ్రంథం. వడ్డెర్లు, మేరోళ్ళు, పద్మశాలీలు, ముతరాసీలు ఇలా బహుజన సమాజంలో వున్న అన్ని కులాల వారిని ప్రత్యక్షంగా కలిసి, సంభాషించి, వారి ఆలోచనలు పంచుకుని పదునెక్కిన తమ భావాలను ఈ విలువైన వ్యాసాలుగా సంతరించారు రచయిత.
ఈ గ్రంథంలో 23 విలువైన వ్యాసాలున్నాయి. సంచార జాతులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బాలకృష్ణ రేణుక కమిషన్ నివేదికనూ అలాగే అనుబంధంగా బిసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, కోటా పెంపు, ఓబిసి ఉపవర్గీకరణ, బీసీ కులాల్లో వెలుగులు, బీసీ కులాల పేర్లు- వృత్తులు వంటి అంశాలను చేర్చడం పుస్తకం విలువను పెంచుతోంది.
ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ను ఒక ద్రష్టగా ప్రశంసించడం పలు వ్యాసాల్లో కానవస్తుంది. నిజంగా ‘ఒక పాలకుని ఆలోచన’యే కదా మూలకందం. ‘సంచార జాతులు సుఖీభవ’, ‘సంచార జాతులకు మంచి రోజులు’ వంటి వ్యాసాలు, అలాగే ‘అన్ని ప్రశ్నలకు పునర్నిర్మిణమే సమాధానం’. ‘ప్రతిభ ఎవరబ్బ సొత్తు కాదు’, ‘ఆధునిక పరిజ్ఞానంతో మరో సృష్టి’ వంటి రచనలు ఆలోచింపచేస్తాయి. వ్యాసాలతో బాటు క్షేత్ర స్థాయి అధ్యయన సందర్భపు ఛాయాచిత్రాలను సమకూర్చడం కూడా ఎంతో బాగుంది.
బీసీ కమిషన్ నిజంగా శ్రీ బి.ఎస్.రాములు చైర్మన్‌గా అభివృద్ధిపథంలో సాగుతోంది. అందుకు దాఖలాగా రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో జూన్ 29నాడు మొదలుపెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఓ ముందడుగు. బీసీలో కలిపి ఆదుకోండి అంటూ కాకిపడగల, సారోళ్ళు కులాలకు చెందిన ప్రతినిధులు కమిషన్‌కు నివేదించుకున్నారు.
గుర్తింపులేని 30 కులాలను బీసీ జాబితాలో చేర్చడానికి వచ్చిన వినతులపై జూలై అయిదవ తేదీ 2019 వరకు బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ కమిషన్ తలపెట్టడం నిజంగా ఒక ప్రజాస్వామిక చర్య. ఇందుకు కమిషన్‌ను అభినందించాలి. జూలూరు గౌరీశంకర్ గారు కమిషన్ సభ్యులుగానే కాక ఒక ప్రముఖ సాహితీవేత్తగా, సంస్కరణాభిలాషిగా సంతరించిన మంచి వ్యాసాల సంపుటి ‘బీసీ కులాలు - సంచార జాతులు’. రచయిత ఎంతగానో అభినందనీయులు.

-సుధామ