పఠనీయం

రసాయనాలు రహస్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయన మూలకాల
రహస్యాలు
-వ్లాసోన్ - త్రిఫనోవ్
అనువాదం: శ్రీనివాసరావు
పుటలు: 290
ధర: 250
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అన్ని కేంద్రాలలో
*
రష్యా పుస్తకాలను తెలుగులోకి తెచ్చే క్రమం ఇంకా కొనసాగుతున్నది అన్నమాట! ఈ పుస్తకాన్ని 1970లో రాశారు. ఇంగ్లీషు అనువాదం 80 దశకంలో వచ్చింది. తెలుగు రూపం ఇప్పుడు వచ్చింది. సుమారు అర్ధ శతాబ్ది కాలంలో కెమిస్ట్రీ ఎంతో ముందుకు సాగింది. అయినా ఈ పుస్తకం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మాత్రమేగాక పరిశోధకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంటూ, అనువాదం చేయించి అచ్చొత్తించారు. పుస్తకం పనికి రాదు, అనలేము గానీ, ఇంత శ్రమపడితే, మంచి లేటెస్ట్ పుస్తకం ఒకటి అందరికీ అందేది.
రష్యన్ రచయితలు పేరు ఏం పెట్టిందీ తెలియదు. ఇంగ్లీష్‌లో మాత్రం ‘నీడలు’ అని అర్థం వచ్చే మాట వాడుకున్నారు. తెలుగులోకి వచ్చేసరికి పేరులోకి రహస్యాలు దూరాయి. సైన్స్‌లో రహస్యాలు ఉంటాయా?
రచన శైలి, ఒక పాఠ్యపుస్తకం వలె గాక, అందరినీ ఆకర్షించే రకంగా ఉండాలని ప్రయత్నించారు. పీఠిక రాయకుండా, ‘పీఠిక స్థానంలో’ అంటూ చెప్పదలుచుకున్నది చెప్పారు. అది నిజంగా ఒక కథలో మొదలవుతుంది. పుస్తకమంతా ఇంత హాయిగానూ సాగితే మరేమయినా ఉందా? సైన్స్ గనుక సైన్స్ పద్ధతిలోనే సాగింది రచన. అధ్యాయాలు, ఉపశీర్షికలు మంచి ఆలోచనాత్మకంగా ఉన్నాయి (అవును గానీ, మనుషులకు వృత్తులు ఉండవచ్చు. యురేనియం మూలకానికి వృత్తులు ఉంటాయా?)
అనువాదం చేస్తున్న వారికి, పుస్తకంలోని విషయం గురించి మాత్రం పరిచయం ఉంటే ఒక రకంగా ఉంటుంది. వారికి తెలుగులో రాసే అలవాటు కూడా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. విషయాన్ని అర్థం చేసుకుని, కొంతవరకు స్వతంత్రించి అనువదిస్తే ఒక రకంగా ఉంటుంది.
‘మీరు గాభరా పడవలసిన అవసరం లేదు. యురేనియంకు ఇతర కేంద్రకేతర వృత్తులు ఉన్నాయి. అవి చాలా ఎక్కువ కూడా. నిపుణులు కాని వారికి వీటి గురించి పెద్దగా తెలియదు. అలా తెలియకపోవడం చాలా చెడ్డ విషయం’ అలా సాగుతుంది రచన. మీకు నిజంగా కెమిస్ట్రీ గురించి తెలుసుకోవాలని ఉంటే, ఇది ఆసక్తికరంగానే ముందుకు పోతుంది. సైన్స్ పట్ల సానుభూతి ఏ మాత్రం ఉన్నా చదవగలుగుతారు.
కర్బను (!) అనే కార్బన్ మసిని, మొదట్లో తెలుగు పుస్తకాలలో దీపాంగారం అన్నారు. ఇప్పటికే వాడుకలో ఉన్న మాటలను వాడితే, కొంతమందికయినా వెసులుబాటుగా ఉంటుంది.
తెలుగులో సైన్స్ పుస్తకాలు తక్కువ. అయితే వచ్చిన ఒకటి రెండు, ఈ రకంగా ఉంటే ప్రయోజనం ఉంటుందా?

-గోపాలం కె.బి.