పఠనీయం

భారతీయ బిస్కార్క్ సర్దార్ పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్దార్ పటేల్
-వీరంరాజు వేంకటేశ్వర్లు
వెల: రూ.60
ప్రతులకు: సాహిత్య నికేతన్
బర్కత్‌పుర
*
చరిత్ర ఎప్పుడూ ప్రవాహంలా ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ స్వర్ణ పుటలు కొందరికే ఉంటుంటాయి. అందుకే చాలామంది నాయకులు చరిత్రలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తూంటారు. కానీ కొందరు వద్దనుకున్నా చరిత్రలోకి లాగబడతారు. అలాంటి చారిత్రక పురుషుడు సర్దార్ పటేల్. ఆయన జీవితంపై ఎందరో ఎన్నో గొప్ప గ్రంథాలు రాసినా కీ.శే.వీరంరాజు వెంకటేశ్వర్లు రచించిన గ్రంథం తెలుగులో వచ్చిన ప్రామాణిక గ్రంథాల్లో పేరెన్నిక గన్నది. 42 ఏళ్ల క్రితం ప్రచురించిన పుస్తకాన్ని పునర్ముద్రణ చేయడం హర్షదాయకం.
చరిత్ర, రాజనీతి వాస్త్రాల్లో విశేషంగా కృషి చేసిన వీరంరాజు వెంకటేశ్వర్లు సర్దార్ పటేల్ జీవితాన్ని రాజకీయ, సామాజిక రంగాల్లోని అనేక ఘటనలతో అన్వయించి చెప్పారు. చాలా సరళంగా, సుందరంగా, సంక్షిప్తంగా చెప్పిన ఈ జీవిత చరిత్ర, స్ఫూర్తిదాయకంగా ఉంది. విచిత్రం ఏమిటంటే 42 ఏళ్ల క్రితం ఇది రచించబడినా ఈ రోజుకూ దీనిలోని ప్రతి విషయం తన చారిత్రక సుగంధాలను వెన్నంటే తెచ్చుకొంది. దీనికి విశ్వనాథ వంటి కవి, రచయిత ముందు మాట రాసి తన ఆశీర్వచనం అందించి ఆమోదించారు.
అఖండ భారత చరిత్రలో సర్దార్ పటేల్‌కు ఎంత అనుభవం ఉందో దేశ విభజన అయ్యాక జరిగిన పరిణామాల్లో అంతకన్నా ఎక్కువ పాత్ర పటేల్‌కు ఉంది. గణ రాజ్యాలను ఏకం చేసిన ఘనత ద్వాపరంలో శ్రీకృష్ణుడు చేపడితే, ఆధునిక యుగంలో దేశాన్ని ఏకం చేసిన పటేల్ చిరస్మరణీయుడు. 1950 జనవరి 26 నాటికి 554 సంస్థానాల్లో 216 సంస్థానాలు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కలిపివేయబడ్డాయి. 310 సంస్థానాలతో 6 సంస్థానాల సమాఖ్యలుగా ఏర్పాటయ్యాయి. 5 సంస్థానాలు కేంద్ర ప్రభుత్వ పాలనలో, 12 పంజాబ్ పర్వత ప్రాంత సంస్థానాలు హిమాచల్‌ప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి. ఇదంతా పటేల్ సాధించిన ఘనత. కొందరు హితవు చెప్పగానే విన్నారు. మరి కొందరు బెట్టు చేశారు. ఇంకొందరు మూర్ఖత్వంతో వ్యవహరిస్తే పటేల్ వాళ్ల మెడలు వంచి భారత్‌లో విలీనం చేశాడు. అలాంటి వాటిలో జూనాగఢ్, హైదరాబాద్ మనకు తెలిసినవే. కాశ్మీర్‌లో పటేల్ వ్రేలు పెట్టనందుకే ఈ రోజు పరిస్థితి ఎలా దిగజారిందో మనకు ఈ డెబ్బై ఏళ్ల చరిత్ర చెబుతోంది.
పటేల్ చేసిన ఈ సాహసాలను వీరంరాజు వేంకటేశ్వర్లు పూసగుచ్చినట్లు 10 శీర్షికల్లో 112 పుటల్లో చక్కని శైలితో వివరించాడు. పటేల్ వంటి ఆదర్శ నాయకుడి వ్యక్తిత్వం తెలుసుకోవాలనుకొన్న ప్రతివారికీ ఇది అవశ్య పఠనీయ గ్రంథం. చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. చిరిగేదీ కాదు - అదొక సజీవ సాక్ష్యం - అనడానికి ఈ గ్రంథమే సాక్ష్యం. పటేల్‌కు 1991 వరకు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్నారు కానీ ఆయన ఈ జాతి గుండెల్లో దాచుకున్న ‘వజ్రం’ అని తెలుసుకోలేక పోయారు. అలాంటి ఉక్కు మనిషి జీవితం నుండి స్ఫూర్తి పొందాలంటే ఇది చదవాల్సిందే.

డా॥ పి. భాస్కర యోగి 9912070125