పఠనీయం

విలక్షణ రచయితా, విశేష సేకర్త..వింజమూరి అనసూయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీవు పాడితే- కడపరాయి కరుగుతుంది! బ్రహ్మజెముడు గులాబీ పూలు పూస్తుంది! శ్మశానంలో చంటి పిల్లల ఏడుపు వినబడుతుంది! హంతకుడు పశ్చాత్తాపాన్ని చూపుతాడు! నీ పాట అహల్య అయితేనే శాపంలో పాషాణాన్ని నిదరపళ్ళెంలో కలల కర్పూరం వెలిగించి ఇచ్చిన రుూ అధివాస్తవికుడు ఇచ్చిన నీరాజనం అందుకుంటావో, లోకంతోపాటు అవుతానంటావో!...’’
అని శ్రీరంగం నారాయణబాబు ఒక గాయని గురించి మహాగొప్పగా చెప్పారు. ఆవిడే వింజమూరి అనసూయాదేవిగా కీర్తిగాంచిన అవసరాల అనసూయాదేవి (మే 12, 1920- మార్చి 23, 2019). సందేహం లేదు నారాయణబాబు లాగా పలువురు ప్రస్తుతించిన అనసూయ కేవలం గాయని మాత్రమేకాదు- సంగీత ప్రయోక్త, సంగీతజ్ఞులు, రచయిత, జాతసేకర్త, పరిశోధకులు అంతకుమించి గొప్పగా హార్మోనియం వాయించే నైపుణ్యమున్న సృజనశీలి! సీత, అనసూయల ద్వయంలో ఒకరైన అనసూయ ‘శాస్ర్తియ, లలిత, జానపద సంగీతంలో దిట్ట మాత్రమేకాదు, భావగీతాలను సభలలో, ఆకాశవాణిలో ప్రాచుర్యం చేసిన దేవులపల్లి కృష్ణశాస్ర్తీ మేనకోడళ్ళలో ఒకరు.
వందో పుట్టినరోజు జరుపుకోవడానికి కొంచెం ముందుగా అమెరికాలోని హోస్టన్‌లో పిల్లల చెంత 2019 మార్చి 23న కనుమూసిన అనసూయ తన స్వీయ చరిత్రకు పేరు పెట్టుకొన్నట్టు ‘అసమాన’! అయితే ఇక్కడ ఆమె రచయిత్రి అని కూడా చెప్పాలనీ; ఆ పార్శ్వం అంతగా వెలుగులోకి రాలేదని గుర్తుచేస్తున్నాం. భావగీతాలు, జానపద గేయాలు, పెళ్ళి పాటలు, ఇంటింటి పాటలు, పండుగలు- పూజల పాటలు, సంవాదాలు- సంప్రదాయపు పాటలు, మంగళ హారతులు వంటివి బాగా ప్రాచుర్యం పొందిన సంగీత సంబంధమైన ఆవిడ పుస్తకాలు. వీటిలో తొలి రెండు పుస్తకాలు 1955 ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి ప్రచురించడం విశేషం.
కొన్ని సంవత్సరాల క్రితం వెలువడిన అసమాన ‘అనసూయ’స్వీయ చరిత్రకు నేను ఇంకా చదువలేదు కానీ, పదేళ్ళలోపే ప్రవేశించి జానపద సంగీతానికి వనే్న, వాసి తెచ్చినవారు కనుక చాలా అనుభవజ్ఞులు కనుక వారి ఏ రచన అయినా విలువైనదే! గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్ర్తీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహానుభావుల ముందు కచేరీలు చేసిన అదృష్టవంతురాలు ఆవిడ!
రెండువందల పుటల ‘జానపద గేయాలు’ పుస్తకం 1983లో ముద్రణ అయి, 2008లో పునఃముద్రణ అయ్యింది. ప్రేమ పదాలు, విరహపు పాటలు, పండుగ పాటలు, వృత్తి పాటలు, హాస్యపు పాటలు, ఇతర పాటలుగా 90 పాటలు విభజింపబడి రాగ వరుసలతో వివరించబడినాయి. కాకినాడ ప్రాంతంలో సేకరించిన ‘కొయ్యోడు పదం’ ఆమె తన ఎనిమిదో ఏట 1928లో రికార్డు ఇచ్చారు. దీనితో మొదలుపెట్టి కాకినాడ, బందరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, మద్రాసు, మైసూరు, విశాఖపట్నం, హైదరాబాదు, నిజామాబాదు ప్రాంతాల్లో నలభయ్యిల్లో సేకరించిన ఈ పాటలకు కృష్ణశాస్ర్తీ, వల్లూరి జగన్నాథరావు, అడవి బాపిరాజు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి ఎందరో తోడ్పాటునందించారు.
జానపద గీతాలకు కర్తృత్వం ప్రశ్నార్థకం మాత్రమేకాదు అవి జనశ్రుతం. చాలా మార్పులకు అనంతమైన అవకాశం. కనుక వివిధ సందర్భాలలో- ఆ వివరాలు పేర్కొంటూ సేకరించిన ఈ గీతాలకు పండితుల ఆమోదముద్ర కూడా ఉందని చెప్పడం ఉద్దేశ్యం.
పదకొండేళ్ళ క్రితం అనసూయగారు బ్రతకడానికి అలసిపోయాను కానీ పాడటానికి కాదు అన్నారు. తెలుగు నాటి జానపదులంతా తమ్ముతామే యెరుగని, తమ సంస్కృతి ప్రతిబింబాన్ని చూసుకోవడం చేతకాని అదృశ్య వాగ్గేయకారులే అనిపిస్తుందని ఆమే అంటారు. ఇంకా ఇలా వివరిస్తారు.-
‘‘వాస్తవిక జీవితానుభవాలూ, ఆ అనుభవాలు రేపిన ఆవేశాలూ, ఆ ఆవేశాలు ప్రేరేపించిన భావనా, ఆ భావన కల్పించిన చిత్రాలూ, ఆ చిత్రాలు నిర్మించిన మాటలూ, ఆ మాటలు మళ్ళీ మనుష్యులై మన ఎదుట నవ్వడమూ, నాట్యం చేయడమూ, నిట్టూర్చడమూ, జీవిత ఖండాలను ప్రదర్శించడమూ- ఈ జానపద గేయాలకు ప్రజలకు లాగే జరామరణాలు లేవు.’’ తెలుగు ఆకాశవాణి పుట్టినపుడు పద్దెనిమిదేళ్ళు, స్వాతంత్య్రం సిద్ధించినపుడు పాతికేళ్ళు మించిన వింజమూరి అనసూయ చేసిన సంగీత సేవ ముఖ్యంగా శాస్ర్తియ లలిత, జానపద సంగీత సేవ విశేషమైంది. అదే సమయంలో సేకర్తగా, పరిశోధకురాలిగా, రచయితగా చేసిన సేవ మరింత విలక్షణమైంది!

-డా.నాగసూరి వేణుగోపాల్