పఠనీయం

జీవితానుభవాల ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచమస్వరం- అభ్యుదయ కథల సంపుటి.
రచన:శొంఠి జయప్రకాశ్, వెల రూ.90/-
ప్రతులకు: రచయిత 26-4-3248, మేలాపురం, హిందుపూర్ మరియు జనని మెమోరియల్ ట్రస్ట్,
15/1, సెవెంత్ క్రాస్, ఫస్ట్ మెయిన్, కరీంనగర్, బెంగుళూరు-560096.
================================================================
సుప్రసిద్ధ సాహితీవేత్త, స్వయంగా కథకుడు అయిన మధురాంతకం నరేంద్రగారు ‘కథలెట్లా రాస్తారు?’ అన్న ప్రశ్నకు జవాబుగా రచయిత ‘దృక్కోణం’ బట్టి ఉంటుందని, రచయితలు చిత్రించిన ప్రపంచంలో ఆయా రచయితల వ్యక్తిత్వాలు అనుభవాలు, ఆ అనుభవాలను వాళ్ళు చూసే తీరును బట్టి ఉంటుందని సిద్ధాంతీకరిస్తాడు.
ఈ అభ్యుదయ కథల సంపుటి రచయిత శొంఠి జయప్రకాశ్ రాయలసీమ వాసి. ఒక ఎన్‌బిఎఫ్‌సి (నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)తో సంబంధం వున్నవారిలా అవుపిస్తారు. ఆలోచనల్లో అభ్యుదయవాదం గోచరమవుతుంటుంది. వీరిలోని రచయిత తరుచూ మంచీ చెడుల మధ్య సంఘర్షణలకు లోను అవుతుంటారు. మధ్య తరగతి మనఃస్తత్వం కలవారిలా అవుపిస్తారు. వీరి కథలన్నింటా ఒక్క గాలిలోదీపం బ్రతుకులు తప్ప, ఆఫీసు వాతావరణం, ఋణాలు, పై ఆఫీసర్లు, క్రింది గుమాస్తాలు వాళ్ళ ఆలోచనలు ప్రతిఫలిస్తుంటాయి.
‘కాగితం పులి కథ’లో గుమాస్తా నరసింహం యూనియన్ లీడర్ కూడా. కొన్ని అనధికార హక్కుల గురించి ఆరాటపడతాడు. పైపెచ్చూ డబ్బు సంబంధిత అత్యవసరాలు, సక్రమం, అక్రమంతో మల్లగుల్లాలు పడి చివరకు సక్రమ మార్గానే్న అనుసరిస్తాడు. ‘అభ్యుదయవాది’లో మాత్రం సహకార పరపతి సంఘం సభ్యులైన దళితులకు శ్రమ దోపిడీ తప్ప మిగిలిందేమీ ఉండదు. కథకు ఇలా ముగింపు ఉండకపోతే బావుండేదేమో. టైటిల్ కథ పంచమ స్వరంలో మాత్రం మంచివాడైన మదన్‌మోహన్ యెడల పాఠకులకు గొప్ప సానుభూతి కలుగుతుంది. దుష్టుడైన ‘కథకుడి’లో మార్పు వచ్చేలోగానే మదన్‌మోహన్ దూర ప్రాంతానికి వెళ్లిపోతాడు. ‘నౌక తీరం దాటిపోయింది’ అన్న ముగింపు బావుంది. సృష్టిలో ఆడదెప్పుడూ అన్యాయానికి గురౌతూనే వుంటుంది. జయప్రకాష్‌గారి ‘ఆకుపచ్చని మనసు’లో తమలపాకుల నరసమ్మ సంగతీ అంతే! కాని ఆమెలో వచ్చిన మార్పు అందరూ స్వాగతించేలా, ఒక దౌష్ట్యానికి తగిన శిక్షపడేలా కథను మలచటం బావుంది. గొప్ప సన్నివేశ చిత్రణ, శిల్పముందీ కథలో. సహజమైన కోరికలకు బానిసలైనా, వివేకం జాగృతమై ఆమె నాయుడును వెడలగొట్టిన తీరులో పాఠకులకు ఒక మంచి సందేశం ఇచ్చాడు రచయిత. తెగేదాగా లాగవద్దని, అమాయక జంతువు పిల్లినైనా నాలుగు గోడల మధ్య బంధించి ఉంచితే పీక పట్టుకుందన్న సత్యాన్ని వికృత రూపంలో చెప్పారు.
పాత్ర పోషణ, సన్నివేశ చిత్రణ కథనం అన్నీ సమతూకంలో నడిపి కథలన్నింటికీ న్యాయం చేకూర్చారు రచయిత.

-కూర చిదంబరం 8639338675