పఠనీయం

వెలుగులు వెలార్చిన దక్షిణాంధ్ర దారిదీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాంధ్ర దారిదీపాలు
సం డా నాగసూరి వేణుగోపాల్
శ్రీ చాముండేశ్వరి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, పాదిరివేడు-601202, సెల్:9500819178.
====================================================

ఈలోకంలోకి వచ్చినందుకు వారి బ్రతుకుల్ని దక్షిణాదిన పండించి జీవిత సార్థక్యాన్ని సాధించిన 31 మంది తెలుగు మహనీయుల జీవన గాథల్ని సూక్ష్మంగా, సుందరంగా అందించిన అనేకమంది వ్యాసకర్తలు అభినందనీయులు. ఈ మహనీయుల జీవితాలు ఎంతటి వైవిధ్యభరితాలో వ్యాసరచయితల వ్యాపకాలు కూడా అంతటి వైవిధ్యభరితాలే.
ఈ దక్షిణాంధ్ర దారిదీపాలలో రాజకీయవేత్తలున్నారు, స్వాతంత్య్ర సమరయోధులున్నారు, ఆయుర్వేద వైద్యులున్నారు, గీతాలు వ్రాసినవాళ్లున్నారు, సంగీతకారులున్నారు, వాగ్గేయకారులున్నారు, భాషోద్ధారకులున్నారు, పరహిత చింతనతో వెలుగొందిన వెండికొండలున్నారు, ఉన్నత విద్యా పారంగతులున్నారు, అభ్యుదయ పాలకులున్నారు, మార్గదర్శకులున్నారు, తెలుగుతనం మూర్త్భీరించినవారున్నారు, అచ్చు నుదుటన సింధూరం అద్దినవారున్నారు, అనువాద వారథులున్నారు, తెలుగు భాషా సేవకులున్నారు, తెలుగు భాషోద్యమకారులున్నారు, రసజ్ఞులైన రాజులున్నారు, మహత్తర శక్తిమంతులైన మహరాణులున్నారు, విప్లవవీరులున్నారు, పర్యటనలకు ప్రాణంపోసిన వారున్నారు, బ్రహ్మ సమాజీకులున్నారు, అంబేద్కరు వంటి మహనీయుల్ని ప్రభావితం చేసిన ఆంధ్రులున్నారు, సేవా సంస్థలకు ఊపిరులు ఊదినవాళ్లున్నారు, ఆయుర్వేదంలో శిఖర సమానులున్నారు, మానవతావాదులున్నారు, భాషాప్రచారోద్యమ సారథులున్నారు, సంపాదక రత్నాలున్నారు. అందరూ అందరే. అందరూ కీర్తిశేషులే.
ఈ వ్యాసాలకు కర్తృత్వం వహించినవారిలో మాత్రం జీవనం కొనసాగిస్తున్న వారున్నారు; తనువులు చాలించినవారున్నారు; కవులున్నారు, కళాకారులున్నారు; వ్యాసకర్తలున్నారు, చేయితిరిగిన సమీక్షకులున్నారు. ఇందులోని వ్యాసకర్తలు తిరుమల రామచంద్రగారితో ప్రారంభమై డా జి.వి.పూర్ణచందు గారితో ముగుస్తాయి. వ్యాసాలలోను, వ్యాసకర్తలలోను ఎంతటి వైవిధ్యమున్నా వాటిలోని అంతఃసూత్రం ఏకత్వాన్ని సాధించింది. ఆ అంతఃసూత్రం- మంచితనం, మానవత్వం, పరోపకారం, ఆర్తితో ముడివేసినటువంటిది. అందువల్ల వారందరు మనకు సుపరిచితులుగా, ఆప్తులుగా కన్పిస్తారు. మన బంధుగణం అంతా ఒక చోట ఏదో వేడుకలో కలిసిన భ్రాంతి కలుగుతుంది. గత వైభవాన్ని నెమరువేసుకుంటున్నట్లుగా ఉంటుంది. అది యువత భవిష్యత్ ప్రణాళికా రచనకు ఊతం యిస్తుంది; వాళ్ళల్లో కలివిడితనాన్ని పెంచుతుంది; సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది. వీటన్నింటినీ మించి చదివించే గుణాన్ని పెంపొందిస్తుంది.
ఇన్ని సుగుణాలను ఈ చిన్న పుస్తకంలో సుతారంగ కలగలిపిన గ్రంథ సంపాదకులు డా నాగసూరి వేణుగోపాల్ అభినందనీయుడు. మండలి బుద్ధప్రసాద్‌గారి ముందుమాట గ్రంథానికి మరింత శోభను చేకూర్చింది.

-రావెల సాంబశివరావు 9959089630