పఠనీయం

వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించిన కవితారుతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడవ రుతువు కవిత్వం
ప్రతులకు:
తాళం రుద్రయోగేశ్వరరావు,
సన్నాఫ్ తాళం మాధవరావు,
డో.నెం.6-143, వీరవల్లి, కృష్ణా జిల్లా-521110 వైష్ణవశ్రీ 8074210263
===========================================================
ఆధునిక యుగంలోను ఎన్నో అసమానతలు. తరాలు గడిచినా మారని సమాజం. వేయిపడగల నాగరాజై కులం కాటేస్తున్న వికృత దృశ్యాలు. విద్య, వైద్యం, రాజకీయం సమస్తం వ్యాపారమయమైన క్రూరవ్యవస్థ. ఆకాశంలో సగమని ఎన్ని అతిశయోక్తులు పలికినా ఇంకా తప్పని పితృస్వామ్యం మెట్టికాయలు. కాముక పురుషులకోరల్లో చిక్కుకున్న నిర్భయలు, ఆసిఫాలు. కల్లోల కడలిలో ఎప్పటికప్పుడు మునిగిపోయే బడుగుల బతుకు పడవలు. ఈ వ్యవస్థకు ఆగ్రహించిన వైష్ణవిశ్రీ గారి అక్షర చిత్రాలు ‘ఏడవ రుతువు’లోని కవితా చిత్రాలు.
సంవత్సరానికి ఆరు రుతువులేగదా! ఏడవ రుతువు ఎక్కడిదని పాఠకులకు సందేహం కలుగుతుంది. ‘సంవేదన’లో ‘‘ఎన్ని కంటకపు కిరీటాలు ధరించిందో ఆమె / గాజు నదిగాగమారిపోయిందిప్పుడు / ఈమెకు / జ్ఞానమే లేదంటాడు ఒకడు / నిజానికి ఆరుకాలాలకనుగుణంగా / స్పందించే ఏడో రుతువు ఆమె’’- కాలంతో పనిలేకుండా సర్వకాల సర్వావస్థలా పురుషుడికి సేవలు చేసే స్ర్తియే ఏడవ రుతవని నిర్వచిస్తారు రచయిత్రి.
ఇరవై నాలుగ్గంటలు వంటింటి చిరునామాగా మారిపోయి కుటుంబానికి సేలు చేసే అమ్మ గురించి, జీవన తరువులపై అత్యాచారం పిడుగుల పడ్డ స్ర్తిల గురించి చిత్రించిన ‘ఆకలి ఉట్టి, అమ్మని, చినుకు పువ్వులు, ఆమె.. కాఫీ కప్పు, ఆశలగీతం, అగ్నిపునీతలు, విధివంచిత, సీతాకోచిలుక, సారే జహాసే అచ్ఛా మొదలైన కవితలు మహిళల జీవితాలలోని వేదనను చిత్రికపడతాయి.
ఈ పుస్తకంలో ఎక్కువగా స్ర్తివాద కవితలు ఉన్నా ఆధునిక సమాజంలోని సంక్లిష్ట సమస్యలేవీ కవయిత్రి దృష్టిని తప్పించుకొని పోలేదు. మానవులందరూ సమానమేనని, అందరిలో ప్రవహించే రక్కటేనని పైపైన నీతి వాక్యాలు చెప్తారు గానీ, మానవుల మధ్య ఎన్నో అంతరాలు, ఆరుని కులమతాల కార్చిచ్చులు, రాళ్ళను రప్పలను పూజించేవాడే తోటి మనిషిని అంటరానివాడుగా అవమానిస్తాడు. వెలివాడలలో వెలివేస్తాడు. ‘జీవితమొక కూడికల మైదానం’, ‘ఆడదాని ఆరు రుతువులన్నీ మృగాడి బందిఖానే’’, ‘జీవితమనే ఇంద్రధనస్సులో ఏడు రంగులనుకున్నా/ కురిసిన వెనె్నల్లో ఆడకునే పసిపాప అనుకున్నా / ఇదేంటి ధనదాహమనే ఎనిమిదో రంగు పులుముకుంటోంది / ఖాళీ అయిన అన్నం కుండ మరునాటికి అమ్మ గుండెపై ఆకలి ఉట్టై వేళ్ళాడుతుంది- మొదలైన వాక్యాలు పాఠకులను వెంటాడుతాయి.
దోపిడీ వ్యవస్థలపట్ల ఆక్రోశం, పేదలు, దళితులు, అణగారిన వర్గాల పట్ల అనిమానం, వారి వెతలతో మమేకం కావడం కవయిత్రి స్వభవాం. బూటకపు ప్రజాస్వామ్య సార్వభౌమాధికారంపై ఎత్తిన పిడికిళ్ళు, పితృస్వామ్యంపై కురిసిన ఆగ్రహజ్వాల వైష్ణవశ్రీగారి అక్షరాలు. ఆవిడకు ‘ఏడవ రుతువు’ మొదటి కవితా సంపుటి అయినప్పటికీ అలా అనిపించదు. భవిష్యత్తులో మరెన్నో కవితా సంపుటులు రచించి తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ముద్ర వెయ్యాలని ఆశిస్తూ అభినందనలు.

-మందరపు హైమవతి 9441062732