పఠనీయం

చక్కని, చిక్కని కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశమగ్రహం (శివ్రాజు కధలు)
రచన: ఎళ్ళాయి వెంకట సత్యనూకరాజు,
వెల:రూ.300/-, కాపీలకు: విశాలాంధ్ర బుక్‌హౌజ్, విజయవాడ, నవచేతన హైదరాబాద్ మరియు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
==========================================================
కథ అంటే ఎలా ఉండాలి? కథకు నిర్వచనం ఏమిటి?? అన్న ప్రశ్నలకు జవాబు ఒక్కటే! అతి తక్కువ సమయంలో చదవగలిగేదిగా ఉండాలి. పాఠకుడిని ఆకట్టుకోగలిగేలా ఉండాలి. కథ, కథానిక, చిన్న కథ, కార్డు కథ లాంటి విశే్లషణలు ఏమైనా ఫర్వాలేదు. స్వర్గీయ ఏళ్ళాయి వెంకట సత్య నూకరాజుగారు (1948-2018) కథలు రాస్తారు. సందర్భాన్ని బట్టి ఆ కథ రెండు పేజీలుంటుంది. ఒక్కోసారి ఐదు ఆరుపేజీల వరకు విస్తరిస్తుంది.
మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడవటంవల్ల మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలోని సాధక బాధకాలు బాగా తెలుసు. అందుకే ఆయన ఎన్నుకున్న కేన్వాసు మరీ విస్తృతమైనది. ఈ కథలు నిజాయితీగా సూటిగా నిష్పక్షపాతంగా ఉంటాయి. అందుకే ఆయన రచనాకాలంలో ఆయన కథను ప్రచురించని ప్రతిక లేదు.
74 కథలున్న ఈ కథా సంకలనం ‘దశమగ్రహం’లో ఎన్నో కథల్లో రచయితను, రచయిత వ్యక్తిత్వాన్ని దర్శించగలుగుతాము. ‘‘కచ్చితమైన.. కచ్చితమైన అంటే ఏమిటి?’’ అన్నప్రశ్నకు ‘‘పనులు కచ్చితంగా చేసేవాడు’’ అనే కాకుండా ‘సినిమా గ్లామర్ సైతం ప్రభావితం చెయ్యలేని మనిషి’గా చెప్పవచ్చునంటాడు (కచ్చితంలో). ఏ పనిలోనైనా ఎంతో కొంత లాభం ఆశించే ముందుచూపు మరీ ఎక్కువగల తిరుపతయ్య ‘నావల్ బేస్’లో వాచీ కొని ఏభయి రూపాయల లాభం పొందాననుకుంటాడు. నిజానికి ఆయన డెబ్భై రూపాయలు నష్టపోతాడు. అదెలాగంటే ‘గూబలో లాభం’ చదవాల్సిందే!
లోకులు పలుగాకులు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేస్తూ, ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇవన్నీ చెవికెక్కించుకున్నంత సేపూ, ఇల్లు కట్టుకున్న సుబ్బారావుకు మనఃశాంతి కరవైంది. పర్సు ఖాళీ అయింది. ముఖమాటం ఎక్కువయింది. ఎప్పుడయితే సుబ్బారావు మొహమాటం వదులుకున్నాడో- అపుడు సుబ్బారావు హాయిగా ఉండటం మొదలయ్యింది (పరం పరంపర) కథలో..
గుర్నాధం కొడుకు కమల్‌హాసన్ అంతగాడు. అదే ఆఫీసులో పనిచేసే కుసుమ కమల్ స్నేహితులు. కొంపతీసి వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటే గుర్నాధంకి బోలెడంత కట్నం నష్టం. తాను తెలివైనవాడు.. (అనుకునే) గుర్నాధం ఓ పధకం వేస్తాడు. దాని ప్రకారం కుసుమ కమల్‌కు రాఖీ కడుతుంది. ఇంకేం- కమల్ కుసుమల మధ్య పెళ్లిప్రసక్తి ఉండే అవకాశం ఉండదు. గుర్నాధం పథకం పారిందా? కుసుమ కమల్‌కు రాఖీ కడుతుందా? మరొకరికి కడుతుందా? పాఠకులు ‘రక్ష.. రక్ష’ కథ చదివి తెలుసుకోవాల్సిందే!
1985 ప్రాంతంలో సిమెంటు ‘కంట్రోలు’ వస్తువు. కంట్రోలు సిమెంటు బయట అమ్మకూడదు, కొనకూడదు. ఇదీ చట్టం- అయినా చట్టం వెనకాల ఎన్నో చట్టరహిత కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి. సుందర్రావు దగ్గర పది బస్తాల కంట్రోలు సిమెంటు తీసుకున్నందుకు కథకుడు మూడు చెరువుల నీళ్ళు త్రాగాల్సి వచ్చింది. అయితేనేం చివరకు ధర్మమే జయిస్తుంది. సుందర్రావుకు పోలీసు కేసుతో వెయ్యి రూపాయలు ఖర్చు అయింది. కథకుడి చేతికి మట్టి అంటదు. లొసుగు వ్యవహారం అంత ఛండాలం మరొకటి లేదని చెప్పే ‘చార్ సౌబీస్’ కధ.
కథలన్నింటా- ఇలాంటి ‘పంచ్’లు ఉంటాయి. బోలెడంత నీతి కథ ఉంటుంది. పాఠకుడికి మంచి కాలక్షేపం ఉంటుంది.

-కూర చిదంబరం 8639338675