పఠనీయం

ఆలోచింపచేసేదే ‘వెంట వచ్చునది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంట వచ్చునది ఎవీ రామిరెడ్డి కథలు
వెల రూ.160/-
మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ప్రచురణ, పెదపరిమి, గుంటూరు 522236,
======================================================
ఎవీ రామిరెడ్డి వౌలికంగా కవి. అందువల్ల ఒక సున్నితత్త్వం, మారుతున్న పరిస్థితులపట్ల, గాయపడుతున్న మానవ సంబంధాల పట్ల ఒక ఆర్తి కలిగినవాడు. అయితే అతని కధనరీతి కూడా సహజంగా ఉంటుంది. ‘వెనె్నల్లో లావా’ అనే కథా సంపుటి 2011లోనే వెలువరించాడు. అయితే ఆ తరువాత తన సామాజిక సేవా కార్యక్రమాల్లో, వృత్తి ధర్మాల్లో పడి కథారచన కొంత మందగించినా ఆ సమయాన్ని విస్తృత అధ్యయనానికి వినియోగించుకోవడంవల్ల సరికొత్తగా, భిన్నంగా రెక్కవిప్పిన పుంఖానుపుంఖ ఆలోచనలను నిలవరించుకోలేక మూడేళ్ల తరువాత మళ్లీ కలం పట్టి కథలు రాశాడు.
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పులు, అభివృద్ధి అనే పేరిట అందుకోసం భూములు కోల్పోయిన అన్నదాతల పరిస్థితులు బెంజికార్లతో, కరెన్సీ కట్టలతో, విస్తరించిన మందుషాపులతో ఊరి ముఖచిత్రం మారిపోయి, అదే సమయంలో మనుషుల్లో కొత్తగా వచ్చిన అలవాట్లు, ఆడంబరమైన ఖరీదైన విలాస జీవితం, అన్నదమ్ముల మధ్యే అకారణ వైరాలు, పొలం తగాదాలు వంటివన్నీ అతడిని విచలితుడిని చేసాయి. ఆ హృదయ స్పందనలే కథలుగా రూపొందాయి. ‘వెంటవచ్చునది’ పేర ప్రచురితమైన ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి.
వ్యవసాయానికి వెలుగుదీధితులద్దిన తెలుగునాట విత్తే పని, గొర్రు తోలే పని, కలుపు తీసే పని, కుప్ప నూర్చే పనిలేక పొలాలు బీడుపడడం వ్యవసాయ క్షేత్రాలు వ్యాపార భూములుగా మారిపోవడం అన్న ఆవేదనలో రాసిన కథ ‘రేపటి బీడు’. పాతికపైగా గ్రామాల్లోని పంట పొలాలు సమస్తం రాజధాని నిర్మాణానికి ఇచ్చేయాల్సిందేనన్న ప్రభుత్వ ఆదేశం రైతు బతుకులను, కూరగాయల సాగు వంటి వాటిపై ఆధారపడ్డ వందలాది కూలీల జీవనాలను ఎలా అతలాకుతలం చేసిందీ రమేశ్, శీనుల భిత్తికగా నడిపిన కథనం కటిక వాస్తవాల దర్పణం.
‘ముళ్ళూ పూలూ’ కథ అమ్మాయి అయినా ఆదర్శవంతమైన జీవన విధానంతో తండ్రి ఆలోచనా విధానానే్న మార్చిన సుమ కథనం. నిజంగానే అమ్మాయిలు మదర్ థెరిస్సాలలా సేవామూర్తులుగా భాసిల్లగలరు అని వివరించగల కథ. ‘మృగయా’ గొప్ప శిల్పంతో కూడిన కథ. మృగాడు అని కామాంధులకు, రేపిస్టులకు వాడే పదాన్ని ఆధారంచేసుకుని స్వప్న తను అమ్మాయిగా జీవితంలో పాము, తోడేలు, హైనా, ఎలుగుబంటి, పులి, ఆక్టోపస్, రక్తపింజర, హిప్పోపోటమస్ వంటి వారి బారినపడిన వైనాన్ని ఎంతో వైవిధ్యంగా ప్రతీకాత్మకంగా చిత్రించిన కథ. వివాహమయ్యాక భర్త తనకు మృగాడు కాదు గానీ, మృగాడు కాకుండా పోని గుంటనక్కగా బయల్పడ్డ ఒక అద్భుతమైన ముగింపు. ‘అవయవాలు మొలిచినమనిషి’ కథలో మనిషి ఎదుగుదలకు అవయవలోపం ఏదీ అవరోధం కాదని నల్గొండ జిల్లాకు చెందిన సైక్లిస్టు శేఖర్ జీవితం ఆధారంగా రాసిన కథ స్ఫూర్తిదాయకమైంది.
‘నేలమీదయినా ఉండచ్చు లేదా ఆకాశంలోనయినా ఉండ చ్చు. తప్పులేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ త్రిశంకు స్వర్గంలో ఉండకూడదు’ అంటూ అది బాడీలో ఎంజైమ్స్ గతి తప్పి ప్రవర్తించడంగా అభివ్యక్తీకరించే కథ ‘వెంటవచ్చునది’. సారపు ధర్మమున్ అనే మహాభారత పద్యంలో ‘ఎవ్వారలుపేక్ష సేసిరది వారల చేటగు’ అన్నట్లు వౌనం వహించడం అసలైన నేరం ఒక యాక్సిడెంట్ జరిగితే నిమ్మకు నీరెత్తినట్లు తరలిపోవడం అమానవీయం అని చెబుతుందీ కథ.
ఏ ఇతివృత్తాన్ని తీసుకున్నా ఒక కొత్త కోణంలో ఆసక్తిదాయకమైన శైలీ విన్యాసంతో కథ చెప్పడం మువ్వా వెంకట రామిరెడ్డి ప్రత్యేకత. సమాజంపట్ల రచయితకు ఒక బాధ్యత వుందని నమ్మి రచన చేసే, విలువల కోసం నిలిచే రచయితకు తన వృత్తిని ప్రవృత్తినీ తదనుగుణంగా అనువర్తింపచేసుకుంటున్నందుకు మన సా అభినందనలు

- సుధామ.. 98492 97958