పఠనీయం

వెలుగు రేఖల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ చరిత్ర-నూతన కోణం
-ప్రొ.అడపా సత్యనారాయణ
పుటలు: 134.. వెల: రూ.80
ప్రతులకు: అడుగుజాడలు
పబ్లికేషన్స్
1-8-702/33/20-ఎ
పద్యాకాలనీ, నల్లకుంట
హైదరాబాద్-500 044
*
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్నాడు మహాకవి దాశరథి. దాదాపు ఇదే ధోరణిలో నిజాం సర్కారు మీద కంటిచూపుల నిప్పులు రాల్చాడు కాళోజీ. అలాంటి జాతీయవాద రచయితల పురిటిగడ్డ ప్రేమను పుణికిపుచ్చుకొని ఈ మధ్య చాలామంది రచయితలు తెలంగాణా పునర్నిర్మాణ కార్యస్ఫూర్తితో రచనలు చేస్తున్నారు. అలా తెలంగాణ తల్లి మీది మమకారంతో ప్రొ.అడపా సత్యనారాయణ చేసిన ఒక వచన రచన ‘తెలంగాణ చరిత్ర - నూతన కోణం’ అనే పుస్తకం.
అయితే ఈ పుస్తకంలో దాశరథి యొక్క పై పద్యంలోని ముందరి మూడు పాదాల భావంతో సత్యనారాయణగారు పూర్తిగా ఏకీభవింపరు.
నిజాం రాజుల పరిపాలనా కాలంలో జరిగిన చాలా మంచి మంచి ప్రజోపయోగ కార్యక్రమాలను చాలా వివరణాత్మకంగా ఉదహరించి చూపారు. ఆ స్వదేశీ సంస్థానం ఏర్పరచుకున్న సొంత రైల్వే వ్యవస్థ, ఉర్దూ మాధ్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరుపరచటం, మరణశిక్షను రద్దు చేయటం, ప్రభుత్వ రంగంలో ప్రాగాటూల్స్ వంటి పెద్దపెద్ద పరిశ్రమల స్థాపన - ఉద్యోగాల కల్పన - రాష్ట్ర (సంస్థాన) ఆర్థికాభివృద్ధి, విమాన సర్వీసులు, రోడ్డు రవాణా సంస్థ, స్వతంత్రమైన బ్యాంకింగ్ వ్యవస్థ, దళితుల విద్యాభివృద్ధికి కోటి రూపాయల నిధి ఏర్పాటు - ఇలాంటి అసంఖ్యాకమైన ప్రగతి మార్గపు పనులను ఎన్నిటినో ఉదహరించాడు రచయిత. తెలంగాణలోని నాటి విద్యావేత్తలు ఏర్పాటు చేసిన భాషా సేవ - పునర్వికాస నిలయం అయిన ‘శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం’ మొదలైన వాటి ప్రాముఖ్యం గురించి బాగా చెప్పారు. 40వ దశకంలోని తెలంగాణ ప్రజా నాయకులు, చరిత్రకారులు అయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, వరంగల్ నివాసి, ప్రముఖ అచంచల దేశభక్తుడు అయిన మొగిలయ్య, ఆనాటి ప్రముఖ జాతీయ కాంగ్రెస్ నాయకుడు టంకశాల నరసింహారావు మొదలైన మహనీయుల చారిత్రక వృత్తాంతాలను తెలియజేయటం ముదావహం. తెలంగాణ గురించి ప్రస్తుత ప్రభుత్వం పూనుకొని తయారుచేయించాల్సి ఉన్న సమగ్ర ప్రామాణిక చరిత్ర మహాగ్రంథంలో ఏయే విషయాలు పరిశోధనాత్మకంగా వెలుగులోకి తేవాలో, తెలంగాణ ఆర్కివ్స్ కార్యాలయం (తార్నాక)లోని పాత రికార్డులన్నీ వెలికితీసి ఎనె్నన్ని అమూల్య చారిత్రక విషయాలు బహిర్గతం చేయబడాలో చాలా మంచి ఆచరణీయ సూచనలు ఇచ్చారు రచయిత.
నేలకొండపల్లి బౌద్ధస్థూపం గురించి చాలా స్ఫూర్తిదాయకమైన వ్యాసం ఈ పుస్తకంలో చదవగలం.
శాతవాహనుల ప్రాదుర్భావం జరిగింది తెలంగాణా ‘కోటిలింగాల’లోనే అనే ఇటీవలి ఒక పరిశోధనాంశంతో సత్యనారాయణగారు తెలంగాణలో చారిత్రక స్ఫూర్తిని రగిలించటానికి పూనుకున్న తీరు ప్రశంసనీయం. అయితే ఈ పుస్తకంలో కొన్నికొన్ని అంశాలు పునరుక్తులు అయ్యాయి గానీ అది రచయిత తాను వ్యక్తీకరించ దలచుకొన్న అభిప్రాయ, ఆవేశ, ఆరాటాలకు నిదర్శన రేఖల తళుకులు మాత్రమే.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290