పఠనీయం

కాలంతో కరచాలనమే ‘చౌరస్తాలో సముద్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌరస్తాలో సముద్రం
రచన: సంగెవేని రవీంద్ర
వెల : రూ.100/-లు
ప్రతులకు
C.V. Compound 7/4
Hanuman Lane, Lower Parel,
Mumbai 400013
*
సుదీర్ఘ అనుభవంతో జీవితాన్ని లోతైన దృష్టితో అధ్యయనం చేసి, పలు కోణాల్లో కవిత్వీకరించిన కవి సంగెవేని రవీంద్ర. బతుకుతెరువు కోసం వలసపోయి ముంబయిలో స్థిరపడిన తెలుగు కవి. కవిత్వం- వ్యాసం ప్రక్రియలు రెండు కళ్ళు. దర్పణం, మార్పు, ముంబయి వన్, బెంగళూరు తెలుగు తేజం పత్రికలకు పలు హోదాల్లో పనిచేసిన అనుభవం వుంది. వివిధ పురస్కారాలు, బిరుదులు అందుకున్న తెలంగాణ బిడ్డ. సామాజిక, సాహిత్య సేవారంగాలతోపాటు సహసంపాదకత్వం వహించిన నిర్వాహకుడు. పలు సెమినార్లలో విభిన్న అంశాలపై పత్ర సమర్పణలు చేసిన దిట్ట. ఇలా బహుముఖ పార్శ్వాల్లో తనదైన ప్రత్యేకముద్రను వేసుకున్న సాహితీవేత్త. అనేక సంపుటాలతో పలు రకాల రచనలు చేసిన సృజనకారుడు. ఇప్పుడు ‘చౌరస్తాలో సముద్రం’ కవితాసంపుటితో మళ్లీ మనముందుకొచ్చారు.
‘అద్దంవెనుక’ కవితలో తన అభిప్రాయాన్ని ఇలా విప్పి కుప్పపోస్తారు ఓ చోట కవి రవీంద్ర.
‘‘గ్లోబల్ నగ్నత్వానికి లోబడి / కార్పొరేట్ సుందరి/ కుట్రల ఆక్టోపస్‌ల్ని కుప్పలు కుప్పలుగా / ప్రసవించాకా / అక్కడ / మార్కెట్ మాయాజాలం / కోరలు విప్పింది’’ అంటారు. ప్రపంచీకరణ ఉచ్చులో పడి, ఆధునిక ప్రపంచ దేశాలు ఏకచ్ఛద్రాతిపత్య గుత్త్ధాపత్యంలో పలు ఆంక్షలకు లోబడి, మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న తీరును కవితాత్మకంగా ఎండగడతారు కవి. తృతీయ దేశాలను ఎరగావేసి, సామ్రాజ్యవాదం పన్నిన బహిరంగ కుట్రలో బలిపశువులుగా మారుతున్న వైనాన్ని సామూహికంగానే నిరసిస్తారు రవీంద్ర. ఇందులో ఒక భాగమే ఈ కార్పొరేట్ సుందరి. బహుళ జాతులు పరిచిన బహు రూపురేఖల ఆనవాళ్ళ జీవన ముఖ చిత్రమే ఈ సామాజిక సందర్భం. విప్పి చెప్పడంలో విషయం తేటతెల్లమయింది.
‘నువ్వే నేను కూడా’ శీర్షికలో ఇలా చెబుతారు.‘అక్షరాలు ఆకాశం నుండి / జారిపడే నక్షత్రాలు కాదు / మెదడు పొరల్లో / భావోద్వేగాల్ని విత్తినప్పుడు / మొలకెత్తే నిప్పుకణాలు’ అంటున్నపుడు ధ్వనించే భావ సందేశం వేరు. విభిన్న మానసిక సంఘర్షణలతో తీవ్ర ఒత్తిడికి గురైనపుడు మనసులో జ్వలించే ఆవేశపూరిత భావాలు ఉద్వేగభరిత గుండె చప్పుళ్ళుగా మారి చివరకు నిప్పు కణాలుగా మొలకెత్తుతాయి. ఈ తాకిడిలోంచి నలిగి, పగిలిన ఆలోచనలు మండే అక్షరాలుగా రూపాంతరం చెందుతాయి. ఇలాంటి తపనలోంచి ఆకాశంలో గూడుకట్టుకున్న నక్షత్రాలే ఈ గాయపడ్డ చూపులు. వీటిని ఒడిసి పట్టుకోవడంలో రవీంద్రది అందెవేసిన చెయ్యి.
‘నేను చచ్చిపోతాననే కదూ / నీ బాధ / పిచ్చివాడా/ ఈ వ్యవస్థలో మనం బతికింది / తొమ్మిది మాసాలే’ అన్న కవితా పంక్తులలోని సారాంశానికి చేరువగా నిలుస్తుందిది. రవీంద్ర మాటల్లో చెప్పాలంటే- ఇంకా ఒక రకమైన బతుకు నైరాశ్యం ఇప్పటికీ మనల్ని వెంటాడుతుందనే స్పృహ ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గర్భసంచిలో వున్న చైతన్యం, ఈ బాహ్య ప్రపంచంలో చోటుచేసుకోలేదనే భావన కవి మనసులో ధ్వనిస్తుంది. ‘ఎడారి గుండె’ కవితలో ‘ఎడారి ఏడుస్తున్న సవ్వడి/ సూటిగా చూస్తే / నేనూ ఎడారీ రెండూ ఒకటే’ అని నిర్థారించుకోవడం వెనుక పైకి కనిపించని అంతర్మథన సవ్వడి లోలోపటి దిగులు తెరలను చీల్చుకొని ఉక్కపోతతనంతో బయట పడుతున్నట్టనిపిస్తుంది.
ఈ కవితాక్షరాల స్పర్శలో భాగంగానే అక్కడక్కడా ప్రతిధ్వనించే వినసొంపైన కవితాత్మక వాక్యాలూ పాఠకుల ఊహల్ని తట్టిలేపకమానవు. ఇందులో - ‘ఏకాకితనంతో బరువెక్కుతున్న ఊపిరి’, ‘కన్నీళ్లెందుకో సమ్మె చేస్తున్నాయి’, ‘పల్లె కళ్లు పగిలిన ఆల్చిప్పలయ్యాయి’,
‘ప్రేతాత్మల దాహార్తికి / ఉరేసుకున్న ఊపిరులెన్నో’, ‘నువ్వెక్కికూసున్న వేదిక కింద / తిరస్కార పిడికిళ్ళు ఏకవౌతున్నై’, ‘కూయని కోయిలకు స్వాగతం పలుకుతూ / ‘వెలుతురు దారుల నిండా / చిట్లిన మనిషితనం’, ‘మేఘాల్లేని ఊరు తరిమికొడితే / నాది కాని మట్టికి వలసయ్యాను’ వంటి వాక్యాలు శిశిరకాలంలో వసంతోదయాన్ని పూయిస్తాయి. ఇంట్లాంటివెన్నో కవితా పూలను పూయంచి మరీ మంచి కవితా సంపుటిని అందించిన సంగెవేని రవీంద్రకి సాహిత్యాభినందనలు.

-మానాపురం రాజా చంద్రశేఖర్