పఠనీయం

తెలుసుకోవలసినదిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు (2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం 12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614

ముందుమాట
- ప్రధాన మంత్రి గృహం న్యూఢిల్లీ
========================================
ఇది పిల్లల కోసం రాసిన పుస్తకం. అయినా చాలామంది పెద్దలు కూడా దీన్ని చదివి ఆనందాన్ని , ప్రయోజనాన్ని కూడా పొందగలరని నా విశ్వాసం. గాంధీజీ ఇప్పటికే ఒక మహానాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనను చూడనివారు, ముఖ్యంగా నేటి బాలబాలికలు అయినను ఒక అసాధారణమైన వ్యక్తిగా, గొప్ప ఘనకార్యాలు చేసిన సూపర్‌మాన్‌గా భావించవచ్చు. కాబట్టి గాంధీజీ జీవితంలోని సాధారణ పార్శ్వాలను ఈ పుస్తకంలో చెప్పినట్లుగా భావితరాల ముందుకు తీసుకరావడం ఎంతైనా వాంఛనీయం.
ఆయన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన విధం ఎంతో ఆసక్తి గొలిపే విషయం. ఆయనది పైపైన ఆసక్తి కాదు. ఆయన ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపడం ఆరంభిస్తే, ఆ అంశాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసేవాడు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించే వాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే ఆయన మానవతావాదంలో విశిష్ఠత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం. రాజకీయాల్లోనూ, బహిరంగ జీవితంలోను కాక అనేక ఇతర అంశాలలో గాంధీజీ ఎలా వ్యవహరించాడనే దాన్ని వివరిస్తూ ఈ పుస్తకం వెలువడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆయన అంతరంగాన్ని మెరుగ్గా అర్థం చేసుకొనేందుకు ఇది ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను.
జవహర్ లాల్ నెహ్రూ
న్యూఢిల్లీ
తే. 10, మార్చి, 1964.

150వ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రతిరోజు గాంధీజీని స్మరించుకుందాం