పఠనీయం

శ్రమజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు (2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం 12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=========================================================
అనవసర న్యాయ వ్యాజ్యాల ద్వారా ధనమూ, సమయమూ వృధా చేసుకొని, తమ జీవితాలు పాడుచేసుకోవద్దనీ, తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలనీ తన కక్షదార్లకు న్యాయస్థానంలో తీరిక లేకుండా ఉండే ఒక బారిస్టరు సలహా ఇచ్చేవాడు. తన తీరిక సమయాల్లో ఆయన హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్శీ బౌద్ధమతాలకు చెందిన గ్రంథాలు చదివేవాడు. ఇంకా మేధావులు రాసిన అనేక పుస్తకాలను కూడా ఆయన చదివేవాడు. ఆ పుస్తకాల అధ్యయనం, అంతశ్శోధనల ఫలితంగా వ్యక్తులు కేవలం మేధస్సుతో పనిచేస్తే చాలదనీ, ప్రతిమనిషీ ప్రతిరోజూ కొంతైనా శారీరక శ్రమ చేయాలనే విశ్వాసం ఆయనకు కలిగింది. అక్షరాస్యుడూ, నిరక్షరాస్యుడూ, వైద్యుడూ, న్యాయవాదీ, క్షవరం చేసేవాళ్లు, శుభ్రం చేసేవాళ్లు- అందరికీ వారి పనులకు సమాన వేతనం లభించాలి. ఈ విశ్వాసానికి అనుగుణంగా ఆయన నిదానంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. తన కళ్ళెదురుగా ఉన్న పనుల్లో పాలుపంచుకోవడం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు తన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ కలసి ఒక ఆశ్రమంలో నిరాడంబర సామాజిక జీవనాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన యూరోపియన్ మిత్రులు కొందరు ఆ ఆశ్రమ జీవితంలో భాగం పంచుకోవాలనుకున్నారు.
ఎవరిమీదా ఆధారపడకుండా కష్టించి పనిచేసే రైతుల్లా వాళ్ళంతా నేలను దున్ని, తోటలను పెంచుతూ జీవించడం ప్రారంభించారు. అక్కడ జీతానికి పనిచేసే పనివాళ్ళెవ్వరూ ఉండేవారు కాదు. హిందువులు, ముస్లిములూ, క్రైస్తవులు, పార్శీలు, బ్రాహ్మణులు, శూద్రులు, కార్మికులు, బారిష్టర్లు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అంతా అక్కడ ఒకే పెద్ద కుటుంబంలో సభ్యుల్లా జీవించేవారు. అందరూ సమష్ఠి వంటశాలలో తయారైన భోజనాన్ని సమష్ఠి భోజనశాలలో తినేవారు. వారి ఆహారం సామాన్యంగానూ, వారి దుస్తులు ముతకగానూ ఉండేవి. ప్రతి సభ్యునికీ అతని నెలవారీ ఖర్చులకు 40 రూపాయలు లభించేవి. అప్పటికి నెలకు 4000 రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఆ బారిష్టరు కూడా ఆ నెలవారీ భత్యంతో జీవించేవారు. కఠినశ్రమతో నిండిన తన దైనందిన కార్యకలాపాలను గడియారమంత ఖచ్చితంగా పూర్తిచేసి, ఆయన రోజుకు ఆరు గంటలు విశ్రాంతి తీసుకొనేవాడు.
పొలంలో ఒక గుడిసె నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయనే అందరికంటే ముందు దానిపైకి ఎక్కాడు. చిన్నాపెద్దా మేకులు, మర మేకులతో నిండిన అనేక జేబులున్న నీలంరంగు ముతక బట్టలను ఆయన తొడుక్కున్నాడు. ఒక జేబులోంచి ఒక సుత్తి తొంగిచూస్తోంది. ఒక చిన్న రంపం, బరమా అతని నడుం దగ్గరబెల్టుకు వేలాడుతున్నాయి. అలా ఆయన మండుటెండలో గుడిసె పని పూర్తయ్యేంతవరకూ రోజుల తరబడి పనిచేశాడు. ఒక రోజు భోజనం చేసిన తర్వాత ఆయనొక పుస్తకాల అలమరా చేయడానికి కూర్చున్నాడు. దాదాపు ఏడు గంటలపాటు నిర్విరామంగా పనిచేసి పైకప్పును తాకేంత పెద్ద పుస్తకాల అలమరా తయారుచేశాడు. ఒకసారి ఆశ్రమ దారిలో కంకర పరచాల్సిన అవసరం వచ్చింది. కానీ వారివద్ద కంకర కొనటానికి సొమ్ము లేదు. అప్పుడు ఆయన రోజూ వివిధ పనులకోసం ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళివచ్చేటప్పుడు దారిలో కనపడిన గులకరాళ్ళనీ, కంకరరాళ్ళనీ పోగుచేసి తనతోపాటు తీసుకొచ్చి ఆశ్రమంలో గుట్టపోయడం మొదలుపెట్టాడు. మిగిలిన ఆశ్రమవాసులు కూడా ఆయన ఉదాహరణను నిదానంగా అనుసరించడం ప్రారంభించారు. త్వరలోనే రోడ్డంతటినీ బాగు చేసేందుకు సరిపడా కంకరరాళ్ళ గుట్ట ఆశ్రమంలో పోగయ్యింది. అలా స్వయంగా చేసి చూపించడం ద్వారా ఆయన ఇతరులతో పనిచేయించేవాడు. తోటపని, వంటపని, ఊడ్వడం, వడ్రంగి పని, తోళ్ళపని, ముద్రణ లాంటి పనుల్లో ఆశ్రమంలోని పిల్లలు కూడా పాలుపంచుకొనేవారు.
ఇంకా ఉంది