పఠనీయం

శక్తి ఉత్పత్తి ..శ్రమదానంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు (2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
====================================================================
మనం తాపీపనివారినీ, చెప్పులు కుట్టేవారినీ, వడ్రంగం పనివారినీ, కమ్మరం పనివారినీ, క్షవరం చేసే వారినీ తక్కువగా చూస్తూ వచ్చాం. మనం వారినుంచి నేర్చుకోవడం మానేశాం. వారిపట్ల కనీస సంస్కారం చూపడం మరిచిపోయాం. వారికి గౌరవ మర్యాదలు లేకుండా చేశాం. నైపుణ్యంగల వృత్తిపనులను హీనంగా చూస్తూ గుమస్తా పనిని గొప్పగా చూడటం ద్వారా మనం బానిసత్వాన్ని కొనితెచ్చుకున్నాం.
ఆ బారిష్టరు ఉదయానే్న చేతిమరలో గోధుమలను పిండిపట్టేవాడు. ఆ తర్వాత విధి నిర్వహణకు సిద్ధమై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న తన కార్యాలయానికి నడిచి వెళ్ళేవాడు. ఆయన తన జుట్టును తానే క్షవరం చేసుకొనేవాడు. తన దుస్తులను తానే ఉతికి, ఇస్ర్తి చేసుకొనేవాడు. ప్లేగు వ్యాధితో బాధపడుతున్న గని కార్మికులకు వైద్య సేవలందించేందుకు రాత్రంతా మెలకువగా ఉండేవాడు. కుష్ఠురోగి పుళ్ళను శుభ్రం చేసేవాడు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సిగ్గుపడేవాడు కాదు. ఆయనకు బద్ధకం, భయం, అసహ్యం వంటివి తెలియవు.
ఆయన తన పత్రికకు వ్యాసాలు రాసేవాడు, వాని స్వయంగా టైపు చేసేవాడు. తన లెటర్‌ప్రెస్‌లో తానే అక్షరాలు కూర్చేవాడు అవసరమైతే చేత్తో నడిచే ముద్రణా యంత్రాన్నికూడా నడిపేవాడు. ఆయనకు పుస్తకాలు బైండింగ్ చేయడం బాగా వచ్చు. స్ఫూర్తిదాయకమైన లేఖలు, సంపాదకీయాలు రాయడం ఆయన సృజనాత్మకమైన చేతికి వచ్చు. చరఖాపై నూలు వడకడం వచ్చు, మగ్గంపై నేయడం వచ్చు. కొత్త కొత్త వంటలు చేయడం వచ్చు. సూది, దూరంతో చక్కగా కుట్టుపనిచేయడం వచ్చు. పళ్ళచెట్లనీ, పూల మొక్కలనీ సాకడం వచ్చు. అలాగే గుపనంతో నేలను తవ్వడం, నూతి నుంచి నీళ్ళు తోడటం వచ్చు. బండి నుంచి బరువైన సరుకులు దింపటం కూడా వచ్చు.
ఆయన జైలులో వున్నప్పుడు రోజుకు తొమ్మిది గంటలపాటు తవ్వకాలతో గట్టినేలను తవ్వేవాడు, లేదా చిరిగిన దుప్పటి ముక్కలను కుట్టేవాడు. బాగా అలసిపోయినప్పుడు శక్తికోసం దేవుడిని ప్రారంభించేవాడు. తనకు అప్పగించిన పనిని పూర్తిచేయలేకపోవడం అనే ఆలోచనే ఆయన భరించలేకపోయేవాడు.
వయసులో వున్నప్పుడు దగ్గరలో వున్న పట్టణంనుంచి సరుకులు తెచ్చుకొనేందుకు ఆయన రోజుకు 40 మైళ్ళవరకూ నడిచేవాడు. ఒకసారి ఆయన ఒక రోజులో 55 మైళ్ళు నడిచాడు. గాయపడిన సైనికులను వాలంటీరుగా స్ట్రెచరుమీద మోసేటప్పుడు ఒక్కోసారి ఆయన ఏకబిగిన 30-40 మైళ్ళు స్ట్రెచర్ మోసేవాడు. 78 ఏళ్ళ వయసులో కూడా ఆయన వారాల తరబడి రోజుకు 18 గంటలు పనిచేశాడు. రోజుకు 21 గంటలు కూడా పనిచేసిన సందర్భాలున్నాయి. ఆ వయసులో ఆయనకు నూలు వడకడం తప్ప మరో శారీరక శ్రమ చేసే శక్తి ఉండేది కాదు. అయినా ప్రతిరోజూ శీతాకాలపు ఉదయపు మంచుతో తడిన పల్లెబాటల్లో మూడు నుంచి ఐదు మైళ్ళు చెప్పుల్లేకుండా నడిచివెళ్ళగలిగేంత ఆరోగ్యంగా ఉండేవాడు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం, పనిలో ఆయన చూపించే సామర్థ్యం కారణంగా అతడి దక్షిణాఫ్రికా స్నేహితులు ఆయనకు ‘కర్మవీరుడు’ అని బిరుదు ఇచ్చారు. కర్మవీరుడైన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869, అక్టోబరు 2వతేదీన జన్మించారు.
బారిష్టరు
గాంధీ 18 ఏళ్ళ వయసలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. ఆ తర్వాత వెంటనే న్యాయశాస్త్రం అభ్యసించడానికి లండన్ వెళ్ళాడు. మోధ్-బనియా (వైశ్య) సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఇన్నర్‌టెంపుల్ (ఇంగ్లండులోని న్యాయవాద వృత్తి నియంత్రణా సంఘం)లో చేరిన తర్వాత పరీక్షలు పాసవడం తేలికేనని గాంధీకి అర్థమయ్యింది. ప్రధానాంశాలతో రాసుకున్న నోట్సును రెండునెలలపాటు శ్రద్ధగా చదివి చాలామంది పరీక్షల్లో పాసైపోతున్నారు. నోట్సులు చదివే తేలిక పద్ధతికి గాంధీకి నచ్చలేదు. మోసాన్ని అసహ్యించుకొనే స్వభావంగల ఆయన అసలైన పాఠ్యగ్రంథాలనే చదవాలని నిర్ణయించుకొని వాటి కొనుగోలుకు చాలా సొమ్ము వెచ్చించాడు.