పఠనీయం

అశ్వత్థామ ప్రభావం కలియుగం మీద ఉండబోతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వత్థామ అశ్వత్థామ న హతః( ఆథ్యాత్మిక నవల)
-మహేష్ విశ్వనాథ
వెల: రూ.50
ప్రతులకు: రచయిత
డోర్ నెం.16-2-836/బి/3 ఎల్‌ఐసి కాలనీ సైదాబాద్, హైదరాబాద్. 7997994678

= = = = = = = = = = = ========

మహాభారతంలో విదురుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు, సైంధవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. మహాభారత యుద్ధమంటే పాండవులు గెలిచారు. కౌరవులు ఓటమి చెందారని తెలుసుకుంటాం. శ్రీకృష్ణ్భగవానుడు హైందవ ధర్మానికి మూలమైన భగవద్గీతను భారతీయులకు ప్రసాదించారు. పంచపాండవులు, వారి పోరాట పటిమ, ఆధిపత్యపోరులో కౌరవులు దిగజారిన తీరు గురించి మాత్రమే తెలుసుకుంటాం. కాని మహాభారతంలో లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాయి. అందులో అశ్వత్థామ పాత్ర గొప్పది. అశ్వత్థామ, అశ్వత్థామ న హతః అనే ఆధ్యాత్మిక నవల ద్వారా మహేష్ విశ్వనాథ ఆసక్తికరమైన విశేషాలను అందించారు. 108 పేజీల్లో అశ్వత్థామ గురించి సంక్షిప్తంగా వివరించారు. అశ్వత్థామ ఉపపాండవులను వధిస్తారు. అందుకే ప్రజలకు అశ్వత్థామ పాత్ర అంటే కోపం ఉంటుంది. కాని అశ్వత్థామ ఏ పరిస్థితుల్లో ఉపపాండవులను చంపాల్సి వచ్చింది? అశ్వత్థామ పాండవులు, కౌరవులకు గురువుగా ఉన్న ద్రోణాచార్యుడి పుత్రుడు. ద్రోణాచార్యుడు ఏ పరిస్థితుల్లో పాండవుల చేతుల్లో వధించబడ్డారు. దానికి కారణమేంటి? ద్రోణాచార్యుడి దృష్టిని మరల్చేందుకు ధర్మరాజు నోటి వెంట వచ్చిన వాక్యాలు ఏమిటి? బ్రాహ్మణుడైన అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. దీంతో అశ్వత్థామ రోగాలబారిన పడతాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత జీవించి ఉన్న అతి తక్కువ మంది పోరాట యోధుల్లో అశ్వత్థామ ఒకరు. యుద్ధం తర్వాత రాజ్యం విచ్ఛిన్నమైంది. దేశ బహిష్కరణ పొందిన అశ్వత్థామ కురు రాజ్యానికి దూరంగా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్లాడు. మనకు సప్తరుషులు మాత్రమే తెలుసు. సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. మార్కండేయ, అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, కృపాచార్య, పరశురామ, వ్యాస, విభీషణులు ఉన్నారు. సప్త రుషులకు ప్రత్యేక మండలం ఉంటుంది. కాని సప్త చిరంజీవులు కంటికి కనిపించరు. సూక్ష్మ శరీరంతో తపస్సు చేస్తూ భూమికి కావాల్సిన సహాయం అందిస్తూ ఉంటారు. అశ్వత్థామ ప్రభావం కలియుగం మీద ఏ విధంగా ఉండబోతోందనే పలు అసక్తిరమైన విశేషాలను రచయిత మహేష్ విశ్వనాథ ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో 18 అంశాలు అమరత్వం, అహింస, అగర్త, అధోభువనం, అనాగరికత, అశ్వమేధం, అశ్వాలు, అసురులు, అద్వైతం, అస్త్రాలు, అశాంతి, అభద్రత, అజ్ఞానం, అధర్మం, అవిద్య, అబ్రహ్మం, అంతం శీర్షికలతో ఉన్నాయి. పాండవేయులను సంహరించడం అశ్వత్థామ చేసిన అధర్మమా? అనే ప్రశ్నకు జవాబు లభించాలంటే ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదవాల్సిందే. ఈ పుస్తకాన్ని మార్పు చేసి సరళ భాషలో కథా రూపంలో రచయిత వివరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందనిపించింది.
కాలమే దైవం, సర్వకాలాల్లో నివసించగలగడం దైవ దర్శనమే ఇది నాకు వరం అని రచయిత పుస్తకాన్ని ముగిస్తారు. తెలుగు సాహితీవేత్తలు, పెద్దలు మాదిరాజు రంగారావు అనుశీలనం రాశారు. విశ్వనాథ సాహిత్య సారం పేరిట ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు, జిజ్ఞాసితవ్వం పేరుతో ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు, శుభకామన పేరుతో ప్రాచార్య శలాక రఘునాథశర్మ, స్వాగతం పేరుతో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆశీర్వదించారు. ఈ పుస్తకాన్ని రాజకుమారి సాహేబ ఇందిరా దేవి ధనరాజ్‌గిరికి అంకితం ఇచ్చారు. మహాభారతంలో విమర్శలకు గురైన అశ్వత్థామ పాత్రను ఎంచుకున్న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సోదరుడు రామమూర్తి కుమారుడు మహేష్ అధ్యయనం చేసి గ్రహించిన అంశాలను పాఠకులకు అందించేందుకు మంచి ప్రయత్నం చేశారు. ప్రతులకు ఫోన్ నంబర్ 7997994678ను సంప్రదించాలి.

-ఎస్‌వీకే