పఠనీయం

కష్టిస్తేనే అద్భుత ఫలం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
====================================================
అదే శాలువా కప్పుకొని బ్రిటిష్ రాణి నివాసమైన బకింగ్‌హామ్ పాలెస్‌లో తేనీటి విందుకు హాజరయ్యాడు. ఆయనకు ఆడంబరమంటే ఎప్పుడూ ఇష్టం ఉండేదికాదు. కానీ చిరుగులుపడిన, మాసిన దుస్తులని ఎప్పుడూ ధరించేవాడు కాదు. ఒక సమావేశంలో తన సహచరుడు ధరించిన ఖద్దరు దుస్తులకు చిల్లుండటం ఆయన గమనించాడు. తక్షణమే ఆయనకొక సూచన పంపాడు: ‘‘చిరుగులు పడిన దుస్తులు ధరించడం బద్ధకానికి గుర్తుకాబట్టి సిగ్గుపడాల్సిన విషయం. కానీ అతుకులువేసిన దుస్తులు పేదరికాన్నీ, నిరాడంబరత్వాన్నీ, కష్టపడే గుణాన్నీ సూచిస్తాయి. నేను నీ దుస్తులలో చిల్లులు మెచ్చుకోలేను, అది పేదరికానికి గానీ, నిరాడంబరత్వానికి గానీ గుర్తుకాదు. అది భార్య లేకపోవడాన్ని లేదా బద్ధకస్తురాలైన భార్యను లేదా బద్ధకాన్ని సూచిస్తుంది.’’
బట్టలు ఉతికేవాడు
బారిష్టరు గాంధీ చక్కటి ఆంగ్లేయ దుస్తులు ధరించి కోర్టుకు వెళ్ళేవాడు. ఆయన తెల్లచొక్కాకు సరిపోయే విధంగా ప్రతిరోజూ ఒక తాజా పరిశుభ్రమైన కాలర్ కావాల్సి వచ్చేది. ఆయన రెండు రోజులకు ఒకసారి చొక్కా మార్చేవాడు. ఆయన చాకలి బిల్లు భారీగా వచ్చేది. తగినన్ని దుస్తులు అందుబాటులో ఉంచుకొనేందుకు ఆయన చాలా దుస్తులు కొనాల్సి వచ్చేది. చాకలి ఇష్టాయిష్టాలను తట్టుకొనేందుకు మూడు డజన్ల చొక్కాలు, కాలర్లు కూడా సరిపోయేవి కావు. గాంధీ తన ఖర్చులను తగ్గించుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చేటప్పుడు బట్టలు ఉతకటానికి కావలసిన సాధనాలన్నీ తెచ్చుకున్నాడు. బట్టలు ఉతకడానికి సంబంధించిన పుస్తకం ఒకటి కొని దాన్ని బాగా అధ్యయనం చేశాడు. బాగా బట్టలు ఉతికేందుకు కావలసిన సూచనలన్నీ ఆకళింపు చేసుకున్నాడు.
సాధన చేయడం మొదలుపెట్టాడు. పాపం కస్తూర్బా ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకురాలిగా ఉండిపోవడానికి వీలులేక పోయింది. బట్టలు ఉతకడం అనే కళను గాంధీ ఆమెకు నేర్పాడు. ఈ కొత్త వ్యాపకం గాంధీ రోజువారీ కార్యక్రమాలకు మరింత పనిని జత చేసింది. ఐతే ఆయన ఓటమి ఒప్పుకొనే తరహా మనిషికాదు. బట్టలు ఉతికే వ్యక్తి నిరంకుశ అధికార పరిధిలోంచి బయటపడి స్వాతంత్య్రం పొందాలని ఆయన ఆకాంక్షించాడు. ఒకరోజు ఆయన ఒక కాలర్‌ను ఉతికి గంజిపెట్టాడు. ఆ పని అలవాటు లేకపోవడంవల్ల, తక్కువ వేడి ఉన్న ఇస్ర్తి పెట్టెతో పైపైన ఇస్ర్తిచేశాడు. వేడి ఎక్కువైతే బట్ట కాలిపోతుందేమో అని ఆయన భయం. అదే కాలర్ వేసుకొని ఆయన కోర్టుకు వెళ్ళాడు. గంజి ఎక్కువ పెట్టడంవల్ల అది కొయ్యలా బిగుసుకుపోయింది. ఆయన అవతారం చూసి స్నేహితులు నవ్వారు. ఆయన దాన్నసలు లెక్కచెయ్యలేదు. ‘‘అవును, బట్టలు ఉతకటంలో ఇది నా మొదటి ప్రయత్నం. అందుకే గంజి కొంచెం ఎక్కువయ్యింది. కానీ అదేమంత పెద్ద విషయంకాదు. కనీసం అది మిమ్మల్ని నవ్వించడానికైనా పనికొచ్చింది కదా’’అన్నాడు గాంధీ.
‘కానీ మనకు బట్టలు ఉతికేవాళ్ళ కొరతేమీ లేదు కదా!’’
‘‘లేదు, బట్టలు ఉతికే బిల్లు మాత్రం చాలా ఎక్కువగా వుంది. ఒక కాలర్ ఉతకడానికి అయ్యే ఖర్చు దాదాపు దాని ఖరీదుతో సమానంగా వుంది. ఒకవేళ అంత ఖర్చుకు సిద్ధపడినా చివరకు బట్టలు ఉతికే వ్యక్తి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడక తప్పడంలేదు. అందుకే నా దుస్తులు నేనే ఉతుక్కోవడం చాలా మెరుగనుకుంటున్నాను’’ బదులిచ్చాడు గాంధీ. కొద్దిరోజులకే ఆయన బట్టలు ఉతికే పనిలో కూడా నైపుణ్యం సంపాదించాడు.
తన గురువుగా గౌరవించే గోఖలే ఒకసారి గాంధీవద్ద ఉండటానికి వచ్చాడు. గోఖలే ఒక పెద్ద విందుకు హాజరు కావలసి వుంది. ఆయన కండువా నలిగిపోయింది. కానీ బయటకు వెళ్లి ఉతికించుకుని వచ్చేంత సమయం లేదు. ‘‘నేను దాన్ని చక్కగా ఇస్ర్తి చేయనా?’’ గాంధీ ఆయనను అడిగాడు. ‘‘ఒక న్యాయవాదిగా నీ నైపుణ్యాలమీద నాకు విశ్వాసం ఉంది, కానీ బట్టలు ఉతకడంలో నీ నైపుణ్యలమీద లేదు. ఒకవేళ నువ్వు నా బట్టను పాడుచేస్తే?’’ అన్నాడు గోఖలే. కానీ గాంధీ పట్టుబటి ఆ ఇస్ర్తి పని పూర్తిచేశాడు. గాంధీ పనితనం గోఖలేకు నచ్చింది.