పఠనీయం

పరిశుభ్రం .. అనివార్య కార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
========================================================

స్నానశాలలు ఇతర చోట్లనుండి వచ్చే మురికి నీటిని మొక్కల పెంపకానికి వాడేవారు. పక్కా డ్రైనేజీ వ్యవస్థ లేని ఆశ్రమంలో కూడా ఎక్కడా ఈగలూ, దోమలు, మురుగు వాసనా కనపడేవి కావు. గాంధీ , ఆయన సహచరులూ పారిశుద్ధ్య పనిని వంతుల వారీగా నిర్వహించేవారు.
ఆయన బకెట్ మరుగుదొడ్లను రెండు గుంతల మరుగుదొడ్లను పరిచయం చేశారు. సందర్శకులందరికీ తన ఆవిష్కారాన్ని గర్వంగా ప్రదర్శించేవారు. ధనికులు, పేదలు, నాయకులు, అనుచరులు, భారతీయులు, విదేశీయులు, అందరూ ఇవే మరుగుదొడ్లు వాడాల్సిందే. ఈ ప్రయోగం వల్ల ఆశ్రమంలో నివసిస్తున్న సాంప్రదాయ కుటుంబాల పురుషులు , మహిళలకు పారిశుద్ధ్య పని మీద ఉన్న ఏహ్య భావం తొలగిపోయింది. కొద్దిపాటి పారిశుద్ధ్య పనైనా తనకు అవకాశం లభిస్తే గాంధీ సంతోషించేవారు. వ్యక్తుల పరిశుభ్రతను వారి మరుగుదొడ్ల పరిశుభ్రత బట్టి అంచనా వేయవచ్చని ఆయన భావించేవారు. 76 సంవత్సరాల వయసులో కూడా ఆయన ‘‘నేను వాడుతున్న మరుగుదొడ్డి కొంచెం కూడా మురికి లేకుండా వాసన లేకుండా తళతళలాడుతుంది. నేనే దాన్ని స్వయంగా శుభ్రం చేసుకుంటాను’’ అని గర్వంగా చెప్పుకునేవారు. పారిశుద్ధ్య కార్మికుడిగా మరణించడం తనకు అపరిమితమైన తృప్తినిస్తుందని కూడా చెప్పేవాడు. కుదిరితే తనను కూడా అంటరాని వారితోపాటు సాంఘిక బహిష్కరణకు గురిచేయడమని సాంప్రదాయ వాదులను సవాలు చేశాడు. ఆయన పారిశుద్ధ్య పనివారి నివాసాలకు వెళ్లేవాడు. వారు తమ కష్టాలను ఆయనతోనిర్భయంగా చెప్పుకునేవారు. వారు చేసే ఏ మాత్రం సిగ్గుపడాల్సింది కాదని ఆయన వారికి భరోసా ఇచ్చేవాడు. తాగుడుని, చనిపోయిన జంతువుల మాంసం తినే అలవాటునీ మానమని సలహా ఇచ్చేవాడు. ఆయన పారిశుద్ధ్య పనివారి సమ్మెను ఎప్పుడూ బలపరచలేదు. పారిశుద్ధ్య పనివాడు ఒక్కరోజు కూడా తనపని మానకూడదని ఆయన భావించేవాడు.
‘హరిజన్’ పత్రికలో ఆయన ఆదర్శవంతుడైన పారిశుద్ధ్య పనివాడెలా ఉండాలో ఇలా నిర్వచించాడు. ‘‘సరైనా తరహా మరుగుదొడ్డిని ఎలా నిర్మంచాలో దాన్ని ఎలా శుభ్రం చేయాలో అతనికి తెలిసి ఉండాలి. అతనికి మలం యొక్క దుర్వాసన ఎలా పోగొట్టాలో వివిధ రకాల సూక్ష్మక్రిములను ఎలా క్రియారహితం చేయాలో తెలిసి ఉండాలి. అలాగే మలాన్ని,మూత్రాన్ని ఎలా ఎరువుగా మార్చాలో కూడా అతనికి తెలిసి ఉండాలి. ’’ పాకీపనిని ఒక గతిలేక చేసే ఉద్యోగం స్థాయి నుంచీ ఒక అనివార్యమైన సామాజిక కార్యక్రమ స్థాయికి పెంచాలని ఆయన ఆశించాడు.
ఖాదీ యాత్రలో భాగంగా ఒకసారి గాంధీ మాట్లాడే బహిరంగ సభకు హాజరయ్యేందుకు పారిశుద్ధ్య పనివారిని అనుమతించలేదని ఆయనకు తెలిసింది. వెంటనే ఆయన ‘‘మీ డబ్బును, ఉపన్యాసాలను మీ దగ్గరే ఉంచుకోండి. నేను అంటరాని వారితోనే సమావేశం నిర్వహించేందుకు వెళ్లుతున్నాను. ఇష్టమైన వారు ఎవరైనా అక్కడకు రావచ్చు’’అని నిర్వాహకులతో చెప్పాడు.
తన మరణానికి రెండేళ్ల ముందు కూడా ఆయన బొంబాయి, ఢిల్లీ నగరాల్లోని పారిశుద్ధ్య పనివారి ఇళ్లల్లో కొంతకాలం ఉన్నాడు. వారితోపాటే నివసించి వారు తినే తిండి తినాలనుకొన్నాడు. కానీ వయోభారం వల్ల అది సాధ్యం కాలేదు. పైగా మహాత్ముని మీద కొన్ని ప్రత్యేక సౌకర్యాలు రుద్దారు.
గాంధీ ఒకసారి వైస్రాయిని కలిసేందుకు సిమ్లా వెళ్లాడు. అక్డి పారిశుద్ద్య పనివారి నివాసాలను పరిశీలించేందుకు తన సహచరుడిని పంపించాడు అవి జంతువులు ఉండ టానికి కూడా పనికిరానంత దుస్థితిలో ఉన్నాయని తెలిసి బాధపడ్డారు.
‘‘నేడు మనం పారిశుద్ధ్య పనివారిని జంతువుల స్థాయికి దిగజార్చాం. వారు తమ మానవ హోదాని పణంగా పెట్టి కొద్దిపైసలు సంపాదిస్తున్నారు. మరుగుదొడ్డి గోడనీడ కింద తచ్చాడుతూ మురుగు మధ్య భోజనం చేస్తున్నవారిని చూస్తే ఎవరి గుండె ఐనా బద్ధలై పోతుంది.’’ మలంతో నిండిన తట్టను నెత్తిన పెట్టుకుని మోస్తున్న పారిశుద్ధ్య పనివారిని చూస్తే ఆయన చాలా ఇబ్బంది పడేవారు. సరైన పరికరాలు వాడటం ద్వారం తన శరీరం మైలపడకుండానే పారిశుద్ధ్య పనిని ఎలా నిర్వహింవచ్చో ఆయన వారికి చెప్పేవాడు. అదొక కళ.